అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ ! 2. ఈ 60 కోట్ల రూపాయల కంప్యూటర్ ఎట్లా పని చేస్తుంది ?
క్రితం టపాలో, ఈ అనంత యంత్రం గురించిన ఉపోత్ఘాతం చదివారు కదా ! మరి, ఈ అరవై కోట్ల రూపాయల కు పైగా ధర ఉన్న కంప్యూటర్ , మిగతా కంప్యూటర్ లకన్నా , ఎట్లా భిన్నం గా ఉంటుంది ? వాటికన్నా ఎక్కువ సామర్ధ్యం తో ఎట్లా పని చేయగలుగుతుంది ? అన్న సందేహాలు మనకు సహజం గానే వస్తాయి కదా ! ఆ వివరాలు తెలుసుకుందాం !
మనం ప్రస్తుతం వాడే కంప్యూటర్ లు, వాటికి ఫీడ్ చేసిన వివరాలను కేవలం 1 లేక 0 అంటే బైనరీ బిట్స్ ఆధారం గానే పని చేస్తాయి ! అంటే, ఏ క్షణం లోనైనా , వివరాలు కేవలం సున్నా కానీ లేదా ఒకటి కానీ అయి ఉంటాయి ! అంటే, కంప్యూటర్ కు ఇచ్చిన ఏ రకమైన లెక్క లైనా కూడా , ఏ క్షణం లోనైనా , ఒక స్థితి లోనే పని చేస్తుంది ! అంటే, ఒక నియమిత క్రమం లోనే పనిచేయ గలుగుతాయి , ఒక దాని తరువాత ఒకటి గా ! అందుకే, మన కంప్యూటర్ లను డిజిటల్ కంప్యూటర్ లు అని కూడా అంటారు ! కానీ అందుకు భిన్నం గా, క్వాంటం నియమాల ఆధారం గా పనిచేస్తుంది ఈ అనంత యంత్రం !
క్వాంటం నియమాలు ఏమిటి ? :
క్వాంటం నియమాలలో ప్రధానమైనది, సూపర్ పొజిషన్ : సూపర్ పొజిషన్ అంటే , ఒకే సమయం లో రెండు స్థితులలో పని చేస్తుంది కంప్యూటర్ ! అంటే, రెండు రకాలైన లెక్క లను ఏక కాలం లో చేయ గలదు , ఒక్క బిట్ సమాచారం కనుక ఈ కంప్యూటర్ కు ఇస్తే ఇస్తే ! రెండు బిట్స్ కనుక కంప్యూటర్ లో ఉంటే 2x 2 = 4 లెక్కలను, ఏక కాలం లో చేయగలదు ! మూడు బిట్స్ ఉంటే , 2x 2x 2=8 లెక్కల నూ , ఇట్లా అనేక లెక్కలను ఏక కాలం లో చేయగలదు ! ఇప్పుడు మన అనంత యంత్రం సంగతి చూద్దాం ! ఈ యంత్రం లో అత్యంత శీతల స్థితి లో , అంటే మైనస్ 273 డిగ్రీల శీతల స్థితి లో ఉంచిన నియోబియం చిప్ లో 512 బిట్స్ అమర్చి ఉన్నాయి ( వీటిని క్వాంటం బిట్స్ లేదా క్యూ బిట్స్ అని అంటారు ) ! అంటే, ఈ D వేవ్ టూ కంప్యూటర్ ఏక కాలం లో 2 టు ది పవర్ అఫ్ 512 లెక్కలను చేయగలదు , ఏక కాలం లో ! ఇంకో రకం గా చెప్పుకోవాలంటే, ఈ 2 టు ది పవర్ అఫ్ 512 విలువ , ఈ విశ్వం లో ఉన్న మొత్తం పరమాణువుల సంఖ్య కన్నా ఎక్కువ అవుతుంది ! ఇట్లా , ఇన్ని లెక్కలు ఏక కాలం లో పరిష్కారం చేయ గలిగే సామర్ధ్యం , ప్రస్తుతం ఉన్న ఏ సూపర్ కంప్యూటర్ కూ లేదు ! అని అంటారు కాలిన్ విలియమ్స్ ( D వేవ్ కంప్యూటర్స్ డైరెక్టర్ , ఈయన నోబెల్ బహుమతి గ్రహీత స్టీఫెన్ హాకింగ్ శిష్యుడు ).
( పైన ఉన్న చిత్రం చూసి , స్థూలం గానూ , క్రింద ఉన్న చిత్రం మీద క్లిక్ చేస్తే సూక్ష్మం గానూ , ఈ క్వాంటం కంప్యూటర్ మూల సూత్రం గురించి తెలుసుకోవచ్చు ! )
వచ్చే టపాలో , ఈ అనంత యంత్రం గురించిన ఇంకొన్ని సంగతులు !
wonderful