అనంత యంత్రం ! ఇన్ఫినిటీ మెషీన్ !1.
పైన చిత్రం లో కనిపించేది, డీ వేవ్ టూ ( D wave two ) కంప్యూటర్ లో అమర్చబడే 512 క్యూ బిట్ ప్రాసెసర్ ఫోటో !
ఈ నూతన అనంత యంత్రం అనేక సమస్యలను పరిష్కరించడమే కాకుండా , రోగ నివారణ తీరునూ , ఈ అనంత విశ్వాన్ని పరిశీలన నూ , ప్రపంచం లో వ్యాపారాలు జరిగే తీరునూ , విప్లవాత్మకం గా మారుస్తుందని భావిస్తున్నారు ! కానీ ఇంకొందరు శాస్త్రజ్ఞులు మాత్రం , అది అంత సులభం కాదని కూడా భావిస్తున్నారు ! ఆ వివరాలు తెలుసుకుందాం !
చాలా ఏళ్ళు గా , ఈ విశ్వం లో అత్యంత శీతలమైన ప్రాంతం , భూమికి 5 వేల కాంతి సంవత్సరాల దూరం లో ఉండే ‘ బూమెరాంగ్ నెబ్యులా ‘ అనే ప్రదేశం లో విస్తరించి ఉన్న ఒక విశాలమైన వాయు మేఘం అని శాస్త్రజ్ఞలు భావిస్తున్నారు ! కానీ అది ఇప్పుడు వాస్తవం కాదు !
ఎందుకంటే , అత్యంత శీతలమైన ప్రదేశం ఇప్పుడు కెనడా లోని బర్నబీ అనే ఒక పట్టణం లో ఉంది ! డీ వేవ్ ( D – wave ) అనే ఒక కంపెనీ ప్రధాన కార్యాలయం ఈ బర్నబీ పట్టణం లోనే ఉంది !
ఈ డీ వేవ్ కంపెనీ తయారు చేసిన అత్యాధునిక కంప్యూటర్ పేరు డీ వేవ్ టూ ( D wave two ) ఈ డీ వేవ్ టూ లు కేవలం ఐదింటిని మాత్రమే , తయారు చేసింది ఇప్పటి వరకు , డీ వేవ్ కంపెనీ ! ఖరీదు పది మిలియన్ల డాలర్లు . నిజం . ఒక్కో కంప్యుటర్ ఖరీదు పది మిలియన్ డాలర్లు ! అంటే అక్షరాలా అరవై ఒక్క కోట్ల రూపాయలు ! డీ వేవ్ టూ మూడు మీటర్ల ఎత్తు ఉన్న ఒక నల్లటి పెట్టె ! అంటే బ్లాక్ బాక్స్ ! ఈ నల్లటి పెట్టెలో ఒక శీతలీకరణ యంత్రం ఉంది ! ఆ శీతలీకరణ యంత్రం లోపల నిక్షిప్తమై ఉన్నదే ‘ నియోబియం కంప్యూటర్ చిప్ ‘ ! అదే డీ వేవ్ టూ ! ( నియోబియం అనే మూలకం పరమాణు సంఖ్య 41. ఈ మూలకం అత్యంత తక్కువ బరువు ఉన్నా కూడా అత్యంత రెసిస్టన్స్ అంటే నిరోధక శక్తి ఉన్న మూలకం . ) ఈ శీతలీకరణ యంత్రం నియోబియం చిప్ ను అత్యంత శీతలం గా, అంటే మైనస్ 273. 1 డిగ్రీల శీతలం గా ఉంచుతుంది ! ఆ డీ వేవ్ కంపెనీ లో పని చేస్తున్నది కేవలం 114 మంది ఉద్యోగులే ! కానీ ఈ కంపెనీ కి పెట్టుబడి పెడుతున్నది మాత్రం , ప్రపంచం లోని అత్యంత ధనవంతులలో కొందరు ! వారిలో అమెజాన్ స్థాపకుడు బెజోస్ కూడా ఉన్నారు ! అట్లాగే డీ వేవ్ టూ కొనుగోలు దారులు అంటే కస్టమర్ లు కూడా అతిరధ మహారధులే ! వారిలో గూగుల్ కంపెనీ , నాసా , ఇంకా అమెరికా గూఢ చార వ్యవస్థ కూడా ఉంది ! దానికి కారణం ఏమిటంటే, డీ వేవ్ టూ కంపెనీ తయారు చేసే క్వాంటం కంప్యూటర్ చాలా విచిత్రమైనదీ , విప్లవాత్మకమైనదీ అవడం వల్ల ! జనాలు ఇంకా , ఈ రకమైన కంప్యూటర్ ను తాము ఎట్లా ఉపయోగించు కొవచ్చో తెలుసుకునే పని లో ఉన్నారు ! ఈ క్వాంటం కంప్యూటర్ లు, సాధారణ కంప్యూటర్ లు అనేక శతాబ్దాలు చేసే పనిని కొన్ని రోజుల్లోనే చేయగల సామర్ధ్యం కలిగి ఉంటాయి !
మిగతా సంగతులు వచ్చే టపాలో !
Wonderful info