కృత్రిమ తీపి రసాయనాలు ( ఆర్టి ఫీషియల్ స్వీ టె నర్స్ ) డయాబెటిస్ ను ఎందుకు ఎక్కువ చేస్తాయి ?
నడి వయసులో వచ్చే టైప్ టూ ( type 2 diabetes ) మధుమేహ వ్యాధి ఈ రోజుల్లో ప్రపంచం లోని అనేక దేశాలలో , అతి త్వరగా , ఎక్కువ మంది లో కనిపిస్తూ , ఆ వ్యాధి గ్రస్తులకే కాకుండా , ఆ యా దేశాల ప్రభుత్వాలకు కూడా ఒక తీవ్రమైన సమస్య గా పరిణమించింది !
సర్వ సాధారణం గా, ఈ రకమైన నడి వయసు లో వచ్చే డయాబెటిస్ ఉన్న వారికి , ఇప్పటి వరకూ డాక్టర్లు , షుగర్ అంటే చక్కెర ను నేరుగా , వారు తినే ఆహారం లో కానీ , తాగే పానీయాలలో కానీ , అసలు వేసుకోక పోతేనే ఉత్తమం అని సలహా ఇస్తారు !
అంతే కాకుండా , వారికి ,చక్కెర కు బదులు గా కృత్రిమం గా లభ్యమయే , శాకరిన్ , లేదా సుక్రాలేజ్ అనే ‘ షుగర్ ట్యా బ్లెట్ ‘ లు నిరభ్యంతరం గా తీసుకోవచ్చని శెలవిస్తారు !
శాకరిన్ లేదా షుగర్ ట్యా బ్లెట్ కనుక్కున్న కొత్తల్లో , అది షుగర్ వ్యాధి గ్రస్తులకు ఒక ‘ వరం ‘ లా భావించ బడింది ! ఎందుకంటే , ఈ రసాయనం లో కేవలం తీపి కలిగించే లక్షణాలే ఉన్నాయి కానీ , క్యాలరీలు ఏవీ ఉండవు ! అంటే , రక్తం లో చక్కర శాతం ఎక్కువ అవదు , ఈ ట్యా బ్లెట్ లు చక్కెర కు బదులు గా ఆహారం లోనూ , పానీయాల లోనూ తీసుకుంటే ! అందువల్లనే , ఈ షుగర్ ట్యా బ్లెట్ లు ప్రపంచం లో అనేక దేశాలలో , టన్నుల కొద్దీ అమ్మ బడుతూంది ! కేవలం మధు మెహ వ్యాధి గ్రస్తులే కాకుండా , ఊబకాయం , అంటే ఒబీసిటీ సమస్య ఉన్న వారు, లేదా సన్న బడాలనుకునే వారూ కూడా విస్తృతం గా ఈ షుగర్ ట్యా బ్లెట్ లను వాడుతున్నారు , రోజూ !
వారందరూ ఇప్పుడు ఆశ్చర్య పోవడమే కాకుండా , ఈ విషయం లో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం కూడా తాజా పరిశోధన ఫలితాల వల్ల , తప్పని సరి అవుతుంది ! ఆ వివరాలు చూద్దాం !
చేంతాడంత చదవడం ఎందుకు అసలు విషయం చెప్పడానికి ‘ అనుకునే వారికి ‘ షుగర్ ట్యా బ్లెట్ లు ‘ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇక ముందు నుంచి నిషేధం ‘ అనే వార్నింగ్ గుర్తు ఉంచుకుని ఆచరిస్తే , వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది !
కారణం : షుగర్ ట్యా బ్లెట్ లు లేదా కృత్రిమ తీపి రసాయనాలు , డయాబెటిస్ ను ఎక్కువ చేస్తాయి !
పరిశోధనా స్థలం : ఇజ్రాయల్ లోని వీజ్ మన్ విద్యాలయం.
ఆ పరిశోధన ఎందువల్ల మొదలు పెట్టడం జరిగింది ? : ఆశ్చర్య కరం గా , ఈ తీపి రసాయనాలు ( షుగర్ ట్యా బ్లెట్ లు ) వాడుతున్న అనేకమంది లో డయాబెటిస్ ఏమాత్రమూ కంట్రోలు లో లేక పోగా , వారి ఊబకాయం కూడా తగ్గక పోవడం జరిగింది , అందుకని శాస్త్రజ్ఞులు కారణాలు వెదకడం మొదలు పెట్టారు !
పరిశోధన ఎట్లా జరిగింది ? : ముందుగా వారు ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఎలుకలకు , ఈ తీపి రసాయనాలు ఉన్న ఆహారం , పానీయాలు ఇచ్చారు ! ఇంకో రకం ఎలుకలకు షుగర్ ట్యా బ్లెట్ లు లేకుండా , సహజమైన తీపి అంటే చక్కెర వేసిన ఆహారమే ఇచ్చారు !తీపి ( కృత్రిమ ) రసాయనాలు ఉన్న ఆహారం తిన్న ఎలుకలకు డయాబెటిస్ వచ్చింది ! దీనికి కారణాలు వెతుకుతుంటే , శాస్త్రజ్ఞులకు ఒక ఆశ్చర్య కరమైన విషయం తెలిసింది ! మన దేహం లో , ప్రత్యేకించి మన జీర్ణ వ్యవస్థ లో ఉండే అనేక లక్షల బ్యాక్టీరియా క్రిములు , నేరస్తుల లాగా , తీసుకున్న తీపి రసాయనాల తో కుమ్మక్కయి , గ్లూకోజు ను తట్టుకో లేకుండా చేస్తున్నాయి అని ! అంటే తీపి రసాయనాలు లేదా షుగర్ ట్యా బ్లెట్ లు తీసుకుంటే , ఆ తీసుకున్న వారి రక్తం లో చక్కెర శాతం ఎక్కువ అవుతుంది ! ఆ పరిస్థితి స్థిరం గా ఉంటే , దానినే డయాబెటిస్ అని అంటాము !
మరి ఈ బ్యాక్టీరియా నే నేరస్తులు గా ఎట్లా నిర్ణయించారు ?
డయాబెటిస్ వచ్చిన ఎలుకల లోనుంచి బ్యాక్టీరియా ను తీసుకుని , డయాబెటిస్ లేని ( ఆరోగ్య వంతమైన ) ఎలుకలలోకి ప్రవేశ పెడితే , ఆ ఎలుకలకు కూడా డయాబెటిస్ వచ్చింది ! అందువల్ల కృత్రిమ తీపి రసాయనాలకూ , ఈ బ్యాక్టీరియా లకూ మధ్య ఉన్న లింకు స్పష్టమయింది !
మనం నేర్చుకోవలసినది : కృత్రిమ తీపి పదార్ధాలు అంటే ఆర్టి ఫీషియల్ స్వీ టె నర్స్ కానీ , లేదా ఆ కృత్రిమ తీపి పదార్ధాలు అంటే ఆర్టి ఫీషియల్ స్వీ టె నర్స్ ఉన్న ఏ ఆహార పదార్ధాలూ , పానీయాలూ కానీ , తినడమూ , తాగడమూ , కేవలం ఆ యా కంపెనీ లు సొమ్ము చేసుకోవడానికే చేయాలి కానీ మన ఆరోగ్యం కోసం కాదు అని !
అవి తీసుకుంటే , మన ఆరోగ్యం బాగా ఉండడం మాట దేవుడెరుగు , అనారోగ్యం ( డయాబెటిస్ ) కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! అంతే కాకుండా , ఇప్పటికే డయాబెటిస్ వచ్చి ఉన్న వారికి కూడా , ఆ వ్యాధి కంట్రోలు తప్పి పోవడం జరుగుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !
Excellent post. pl continue. I m a victim of diabetes
Thank you. This post is a one off post( to tell about the recent findings of the research ), since many posts were posted in the past about diabetes. Please let me know if you are interested in any particular topic about health. I will try to post it as time permits.