వెనక నొప్పి రకాలు. బ్యాకేక్ . 2.
తల వెనుక భాగం లో పైనుంచి భుజాల వరకూ ఉండే భాగంలో వచ్చే నొప్పిని మెడ నొప్పి అంటారు. ఈ భాగం లో వచ్చే నొప్పి అక్కడే పరిమితమై ఉండకుండా , పైకి పాక వచ్చు , అట్లాగే ( కిందకు ) చేతులకు పాక వచ్చు. ( పై చిత్రం గమనించండి )
నొప్పి ఎట్లా ఉంటుంది ?
ఈ నొప్పి వచ్చిన ప్రాతం లో స్టిఫ్ గా ఉండడం , అంటే కండరాలు బిగ బట్టి నట్టు టైట్ గా అనిపించడం , లేదా నొప్పి తిమ్మిరి గానూ , సూదులతో పోడిచినట్టు కూడా అనిపించ వచ్చు. ఈ నొప్పి వల్ల తల నొప్పి కూడా కలగ వచ్చు ! సాధారణం గా మన శరీరం లో ఉండే చాలా కండరాలు , కేవలం వాటిని ఉపయోగిస్తున్న సమయం లో మాత్రమే బిగుతు గా ఉండి , మిగతా సమయం లో రిలాక్స్ అవుతాయి. ఉదాహరణకు రెండు కిలోల బరువున్న సంచీని ఒక మైలు దూరం ఒక చేత్తో తీసుకు వెళితే , మనకు ఆ చేతి కండరాలు బిగుతు గా ఉన్న అనుభవం కలుగుతుంది కదా ! కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచీ , పడుకునే సమయం వరకూ , మెడ లో ఉన్న కండరాలు బిగుతు గా ఉండి , తలను నిటారు గా ఉంచుతాయి ! దానితో పాటుగా , సరి అయిన పొజిషన్ లో కూర్చోక పోవడమూ , లేదా మెడను మాత్రమే చాలా ముందు కు ఉంచి , ఎక్కువ సేపు పని చేస్తూ ఉండడమూ , లేదా కంప్యూటర్ ముందు తదేకం గా , విరామం లేకుండా గంటల తరబడి పని చేస్తూ ఉండడం వల్ల కూడా మెడ నొప్పి రావచ్చు. ఇక వాహన ప్రమాదాల సమయం లో కూడా మెడ నొప్పి కలగ వచ్చు. దీనిని విప్ ల్యాష్ ఇంజూరీ అంటారు ! ప్రమాద సమయాలలో శరీరం చాలా వేగం గా ముందుకూ , వెనుకకూ కదలడం వల్ల ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది !

చాతీ లోని వెన్ను పూసల ద్వారా వచ్చే నొప్పి : ఈ నొప్పి సాధారణం గా వీపు మధ్య లో వస్తుంది. ఇట్లాంటి నొప్పి అరుదు గా వస్తుంది. ఎందుకంటే , ఈ ప్రదేశం లో ఉన్న వెన్ను పూస ఎముకలు , మెడ లో ఉన్న వెన్ను పూస ఎముకల తో పోలిస్తే , స్థిరం గా ఉంటాయి కనుక ! ఈ భాగం లో వచ్చే నొప్పికి సామాన్యం గా , సరి అయిన పొజిషన్ లో కూర్చోక పోవడం వల్ల కలుగుతుంది. ! ( పై చిత్రం గమనించండి )
నడుము భాగం లో వెన్ను పూసల ద్వారా వచ్చే నొప్పి: దీనినే లోయర్ బ్యాకేక్ అని కూడా ఉంటారు. సాధారణం గా ఈ నొప్పి , ఛాతీ క్రింద నుంచి కాళ్ళు మొదలయే భాగం మధ్య లో వస్తుంది. ఈ నొప్పి సామాన్యం గా ఎక్కువ బరువులు , ఒక్క సారిగా ఎత్తడం వల్ల నూ , లేదా ఒక్క సారిగా వంగడం వలనో , లేదా ఎక్కువ సమయం విరామం తీసుకో కుండా ఒకే పొజిషన్ లో కూర్చోడం వల్లనూ , డ్రైవింగ్ చేయడం వల్ల కూడా కలగ వచ్చు ! ( పై చిత్రం గమనించండి )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Got the point pl continue
The information which is available in this site very much useful to people..i am appreciating the persons who are running this website.
Thanks Kishore ! Hope you’d keep posting your comments.