Our Health

కీళ్ళ నొప్పులు . 1. చిన్న పిల్లల్లో వస్తే ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 2, 2014 at 8:31 సా.

కీళ్ళ నొప్పులు . 1. చిన్న పిల్లల్లో  వస్తే ?

 

కీళ్ళ నొప్పులు, మానవులు అనుభవించే  సామాన్య లక్షణం. సాధారణం గా, కీళ్ళ నొప్పులు, ఒక వయసు దాటిన తరువాత  అనే నాల్గో దశకం లో కానీ, ఐదో దశకం లో కానీ మొదలవుతాయి ! కానీ  కొన్ని సందర్భాలలో కీళ్ళ నొప్పులు , చిన్న వయసు లోనే , బాల బాలికలకు అనుభవం  అవ వచ్చు !  పెద్ద వారికి వచ్చే కీళ్ళ నొప్పుల గురించి తెలుసుకునే ముందు , చిన్నారుల కు వచ్చే కీళ్ళ నొప్పుల గురించి తెలుసుకోవడం మంచిదీ , ముఖ్యమూ కూడా నూ ! 
మరి చిన్న పిల్లలలో కీళ్ళ నొప్పుల లక్షణాలు ఎట్లా ఉంటాయి ?
సామాన్యం గా మోకాళ్ళు కానీ , మోచేతులు కానీ నొప్పి కలగ వచ్చు ! నొప్పితో పాటుగా , ఆ కీళ్ళు వాయడం ,  లేదా ఎర్ర బడడం గమనించ  వచ్చు ! చర్మం తెలుపు రంగు కాక పొతే , ఈ ఎర్ర బడడం కనబడదు ! అప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తో పరిశీలించాలి, వారి కీళ్ళను , ప్రత్యేకించి తల్లి దండ్రులు ! ఎందుకంటే , వారికి వారి సంతానం గురించి ఎక్కువ గా తెలుసు కనుక ! నొప్పి సామాన్యం గా ఆడుకునే సమయాలలో ఉండక పోవచ్చు ! ప్రత్యేకించి , ఆరంభ దశ లో !  పిల్లలు కనుక  ఆటల ధ్యాస లో పడితే , వారికి అంతగా నొప్పి అనిపించక పోవచ్చు , కానీ రాత్రి సమయాలలో పడుకుని ఉన్నపుడు వారికి నొప్పి కలగడమూ , లేదా ఉదయం లేచినప్పుడు నొప్పి గా ఉండడం జరగ వచ్చు ! అట్లాంటి నొప్పిని , ఏదో ఆటలో ఆ కీలు బెణికి ఉంటుందేమో అని అశ్రద్ధ చేస్తే , ఆ నొప్పి తగ్గక పోగా , పిల్లలు ఆ కీలు కదిలించడం కష్టం గా ఉండి , బాధ  పడుతూ ఉండడం జరుగుతుంది ! 
కొన్ని సందర్భాలలో , ఇట్లా కీళ్ళ నొప్పులతో పాటుగా , పిల్లలకు  చర్మం మీద కొద్దిగా మచ్చలు కూడా ఏర్పడ వచ్చు ! అంతే కాకుండా,  వారికి జ్వరం వచ్చి ఒళ్ళు వెచ్చ బడుతూ ఉండడం , జ్వరం తో పాటు , నీరసమూ , బలహీనతా , ఆటలలో ఉత్సాహం తగ్గి పోవడమూ , ఆకలి తగ్గిపోవడమూ కూడా తల్లి దండ్రులు గమనించ వచ్చు ! గొంతు వాపు , గొంతు నొప్పి ,  ప్రత్యేకించి , పానీయాలు తాగుతున్నప్పుడూ , ఆహారం తింటున్నప్పుడూ. కొన్ని సందర్భాలలో , కేవలం ఒకటో రెండో పెద్ద కీళ్ళ లో కాకుండా , చేతులూ కాళ్ళూ , వాటి కీళ్ళు అంటే జాయింట్ లు  చాలా  వాటిలో నొప్పులు కలగ వచ్చు ! 
చిన్న పిల్లల్లో కీళ్ళ నొప్పులు వస్తే  ఏమవుతుంది ? 
చిన్న పిల్లలో కీళ్ళ నొప్పి లక్షణాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు ! కేవలం బెణుకు అయి ఉంటుందని  తీసి పారేయకుండా,  శ్రద్ధ తో , ఆ నొప్పి లక్షణాలను తల్లి దండ్రులు గమనించడమే కాకుండా , మిగతా లక్షణాలను కూడా ఓపికతో కనుక్కోవాలి ! చిన్న పిల్లలలో కీళ్ళ నొప్పులు  సామాన్యం గా ఇన్ఫెక్షన్  కు సంకేతం ! అంటే శరీరం లో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే , కీళ్ళ నొప్పులు లక్షణాలు గా కనిపించ వచ్చు !  ఒకటో రెండో కీళ్ళ లో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ గా ఉండి , బాధ కలిగించ వచ్చు ! రుమాటిక్ ఫీవర్ అనే  జబ్బు లో కీళ్ళ వాపు లక్షణాలతో , జ్వరం కూడా ఉండి ,  ఆ లక్షణాలను అశ్రద్ధ చేస్తే ,  ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ గుండె కు కూడా పాక వచ్చు ! అంటే స్ప్రెడ్ అవడం ! 
మరి ఏమి చేస్తే ఉత్తమం ? 
చిన్న పిల్లలలో ఇట్లా కనిపించే , కీళ్ళ వ్యాధి లక్షణాలను ఎంత మాత్రమూ అశ్రద్ధ చేయకూడదు ! వెంటనే పిల్లల డాక్టర్ లేదా పెడియా ట్రిస్ట్  కు చూపించాలి !  మూఢ నమ్మకాలకు చిన్న పిల్లలను  లక్ష్యం గా చేయ కూడదు !  ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో , చిన్న పిల్లలలో కీళ్ళు వాయడం గమనించిన తల్లి దండ్రులు  ఆ కీలు కు  నానా రకాలైన ఆకులు  కట్టు కట్టడం , పూజలు చేయించడం చేస్తూ ఉంటారు !  ఇది ఎంత మాత్రమూ తగదు ! ఎందుకంటే  లక్షణాలు కనిపించిన తరువాతి ఒకటి రెండు వారాలలో సరి అయిన చికిత్స జరపక పొతే , ఇన్ఫెక్షన్ మిగతా శరీరానికి పాకుతుంది అంటే గుండె కు కూడా ! 
చికిత్స ఏమిటి ? 
వ్యాధి నిర్ధారణ కు అవసరమయే పరీక్షలు జరిపాక , చికిత్స జరుగుతుంది ! నొప్పి నివారణ కు మందులతో పాటుగా ,  శక్తి వంతమైన యాంటీ బయాటిక్స్ అవసరం అవుతాయి !  ఇవన్నీ నిపుణు లైన వైద్యులతో  లక్షణాల తొలి దశ లోనే చేయించుకోవడం ఉత్తమం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. నిజమే! అశ్రద్ధ అసలు పనికి రాదు ఆరోగ్యం విషయంలో. ‘సయాటికా’ గురించి కొద్దిగా సాయించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: