చర్మ మర్మాలు . 9. మొటిమలకూ, ఋతు స్రావానికీ సంబంధం ఉంటుందా ?
క్రితం టపా లలో మొటిమలు తగ్గాలంటే వాడాల్సిన క్రీములూ , యాంటీ బయాటిక్స్ గురించి తెలుసుకున్నాం కదా ! యువతులలో వచ్చే మొటిమలు కొన్ని సందర్భాలలో క్రీములతోనూ , యాంటీ బయాటిక్స్ తోనూ తగ్గక పోవచ్చు !
ప్రత్యేకించి , కొందరు యువతులలో , మొటిమలు , వారికి ముట్టు సమయం లో, అంటే ఋతు స్రావం సమయం లో ఎక్కువ అవుతూ ఉంటాయి ! దానికి కారణం , ఋతు స్రావ సమయం లో కలిగే హార్మోనుల ప్రభావమే ! సామాన్యం గా రుతుస్రావ సమయం లో స్త్రీలలో అండం విడుదల అవుతుంది ! ఆ అండం , పురుషుడి నుంచి విడుదల అయే శుక్రం లో ఉండే పురుష బీజ కణం కోసం గర్భాశయ భాగం లో వేచి ఉంటుంది కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ! అట్లా వేచి ఉండడానికి , ఆ స్త్రీలో కలిగే హార్మోనులలో మార్పులే కారణం ! కానీ కొందరు స్త్రీలలో ఈ మార్పులు , చర్మం లో ఉన్న హేర్ ఫాలికిల్ కు ఉన్న కొవ్వు కణాలను కూడా ఎక్కువ గా ప్రభావితం చేసి , మొటిమలకు కారణ మవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో ఆ స్త్రీలు గర్భ నిరోధక పిల్ వాడడం వల్ల లాభం పొందుతారు ! అంటే వీరిలో గర్భ నిరోధక పిల్ , మొటిమలను కూడా నిరోధిస్తుందన్న మాట !
ప్రతి యువతీ, మొటిమలు తగ్గాలంటే , గర్భ నిరోధక పిల్ వాడ వచ్చా ? :
జవాబు : ఋతు స్రావ సమయం లో మొటిమలు ఎక్కువ అయే యువతులూ , స్త్రీలే గర్భ నిరోధక పిల్ తో ఎక్కువ లాభ పడతారు ! మిగతా యువతులూ , స్త్రీలూ కనుక గర్భ నిరోధక పిల్ వాడితే , వారికి గర్భ నిరోధమే అవుతుంది ! మొటిమల మీద ప్రభావం ఉండదు !
కో సిప్రి న్డయోల్ ( co cyprindiol ) : ఈ మందు ఒక హార్మోను. ఈ హార్మోను సీబమ్ ( చర్మం లో ఉండే కొవ్వు కణాలలో కొవ్వు ) ను తగ్గిస్తుంది ! దానితో మొటిమలు తగ్గుతాయి ! ఈ హార్మోను ను సామాన్యం గా మొటిమలు విపరీతం గా వస్తూ మిగతా పద్ధతులతో తగ్గక పోతేనే ( అదీ యువతులలోనే , యువకులలో కాదు ) వాడ వలసిన అవసరం ఉంటుంది . సామాన్యం గా, కనీసం ఆరు నెలల పాటు ఈ హార్మోను వాడాలి !
హార్మోనులు వాడే ముందు , ఆ హార్మోనులు కలిగించే మేలు తో పాటుగా , వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ లను కూడా వివరం గా తెలుసుకుని , వాటికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ! ఈ హార్మోను వాడడం వలన కొద్ది శాతం యువతులలో స్థన క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్కు ఎక్కువ అయిందని పరిశీలన ల వల్ల తెలిసింది.
ఐసో ట్రె టినోయిన్ ( isotretinoin ) : ఇది ఇంకో మందు. ఈ మందు కూడా సీబమ్ ను తగ్గించి , తద్వారా మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా , హేర్ ఫాలికిల్ బ్లాక్ అవకుండా నిరోధిస్తుంది , ఇంకా మొటిమల లో బ్యాక్టీరియా లను నిరోధిస్తుంది.
ఈ మందు మొటిమల నిరోధం లో శక్తి వంతమైనదే అయినా , దీని వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఎక్కువ గానే ఉంటాయి !
గర్భ వతులు కావాలనుకునే యువతులు ఈ మందు ను వాడ కూడదు ! ఎందుకంటే , గర్భం లో పెరిగే శిశువు అంగ వైకల్యం తో పెరిగే ప్రమాదం ఉంది , ఈ ఐసో ట్రె టినోయిన్ మందు తో ! అందువల్ల , గర్భం దాల్చ లేదని ఖచ్చితం గా ( ప్రెగ్నెన్సీ పరీక్ష తో ) తెలుసుకున్నాకే , ఈ మందు బిళ్ళలు వాడాలి. చర్మ నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !