Our Health

చర్మ మర్మాలు. 1. చర్మ ఆరోగ్యం మనకెందుకు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 12, 2014 at 9:28 ఉద.

చర్మ మర్మాలు. 1. చర్మ ఆరోగ్యం మనకెందుకు ?

File:HumanSkinDiagram.jpg

 

మన చర్మం నిర్వర్తించే విధులు తెలుసుకుంటే ,  చర్మం ఆరోగ్యం మీద మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవచ్చు ! మన చర్మం మనకు అనేక విధాలు గా ఉపయోగ పడుతుంది ! 
1. రక్షణ కవచం : చర్మం లో ఉండే లాంగర్ హాన్స్ కణాలు మన రోగ నిరోధక శక్తి కి ఉపయోగ పడతాయి ! 
2. స్పర్శ కు చర్మం : చర్మం  లో , అనేక లక్షల నాడీ కణాల కొనలు నిర్మితమై ఉంటాయి ! ఈ నాడీ తంత్రులు , స్పర్శ జ్ఞానాన్ని మెదడుకు చేర వేస్తాయి !  ఒక ప్రేమ పూర్వకమైన కౌగిలి నీ , ఒక ఆప్యాయమైన ఆలింగనాన్నీ , ఒక హృదయానికి హత్తుకునే చుంబ నాన్నీ , ఏ రకమైన స్పర్శ జ్ఞానమూ లేని మన చర్మం తో ఊహించు కొగలమా ?కేవలం స్పర్శ జ్ఞానమే కాకుండా , మన చర్మం లో ఉండే ప్రత్యేక కణాలూ , నాడీ తంత్రులు ,  అతి శీతల , అతి ఉష్ణ  పదార్ధాలనూ , లేదా వాతావరణాన్నీ , కూడా మన ( మెదడు ) కు తెలియ చేయగలవు !  అట్లాగే , వత్తిడి తీవ్రత నూ , నొప్పినీ కూడా తెలియ చేస్తాయి ! 
3. మన దేహ ఉష్ణోగ్రత ను నియంత్రించేది మన చర్మమే ! :  మన శరీర ఉష్ణోగ్రత పెరిగితే , మన చర్మం లో ఉన్న స్వేద గ్రంధులు తెరుచుకుని , మనకు స్వేదం కలిగిస్తాయి అంటే చెమట పుట్టిస్తాయి ! దానితో మన శరీరం చల్ల బడుతుంది ! 
4. చర్మం లో నీరూ , కొవ్వూ కూడా నిలువ చేయబడుతుంది !  మన దేహానికి ఆహారం దొరకని  పరిస్థితు లల్లొ , చర్మం లో నిలువ చేయబడిన కొవ్వు కరిగి , శక్తి నిస్తుంది ! 
5. ప్రాణ వాయువూ , నైట్రోజన్ , ఇంకా కార్బన్ డయాక్సైడ్ ( బొగ్గు పులుసు వాయువు ) లు కూడా మన చర్మం ద్వారా కొంత మేర గ్రహింప బడ డమూ , విసర్జింప బడ టమూ ,జరుగుతూ ఉంటుంది నిరంతరమూ ! 
6. మన చర్మం లో ని పైపొర , అంటే ఎపి డెర్మిస్ , చర్మం లో ఉన్న పోషక పదార్ధాలు వ్యర్ధం అవకుండా , ఒక కొవ్వు పొరను ఏర్పరిచి , జాగ్రత్త తీసుకుంటుంది ! 
ఇన్ని ధర్మాలు , మనకోసం నిర్వర్తించే మన చర్మం గురించిన మర్మాలు మనం తెలుసుకుందాం ! అవి తెలుసుకుంటే ,  మన ( చర్మ ) ఆరోగ్యం కోసం మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా విశదం అవుతాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: