తన కోపమె … 7.వ్యాయామం , ధ్యానం తో కోపాన్ని కంట్రోలు చేసుకోవడం ఎట్లా ?
పైన హిందీ లో ఉన్న వీడియో చూడండి , బ్రహ్మ కుమారి వాళ్ళది , ఉత్సాహం ఉన్న వారు యు ట్యూబ్ లో మిగతా ఎపిసోడ్ లు కూడా చూడవచ్చు !
క్రితం టపా లో కోపం రాగానే దాని దారి మళ్ళించి , ‘ ఆకాశం ‘ లోకి పంపడం ఎట్లాగో తెలుసుకున్నాం కదా ! అట్లాంటి చర్యలలో వ్యాయామం కూడా ఒకటి ! అంటే బాగా కోపం వస్తే , అది ఎదుటి వారిని ఏదో రకం గా హింసించడం కోసం కాకుండా , ఆ కోపాన్ని శరీర వ్యాయామం కోసం వెచ్చిస్తే , ఉపయోగకరం అవుతుంది ! శరీరం లోని వివిధ భాగాల లో ఉన్న కండరాలు శక్తి వంతం అవుతాయి ! వ్యాయామం వల్ల కలిగే అనేక రకాలైన జీవ రసాయన చర్యలలో , ‘ నేను క్షేమం గా ఆరోగ్యం గా ఉన్నాను ‘ అనిపించే జీవ రసాయనం ఒకటుంది ! దాని పేరు ఎండార్ఫిన్ ! ఆ ఎండార్ఫి న్ లు ఎక్కువ గా విడుదల అవుతాయి వ్యాయామం చేస్తే ! ఈ రకమైన ఎండార్ఫిన్ లు కేవలం ‘ నేను క్షేమం ‘ అనిపించే భావనలే కాకుండా , మన కు ఉపశమనం కూడా కలిగించి , మనలను రిలాక్స్ చేస్తాయి ! అందుకే ‘ ఎక్సర్ సైజ్ ఫర్ హెల్త్ , ఎక్సర్ సైజ్ ఫర్ ఎండార్ఫిన్స్ ‘
ఒక వార్నింగు : కోపం ఎక్కువ గా ఉన్నప్పుడు , వ్యాయామం చేయడం ఉపయోగ కరం అయినా , వ్యాయామం అతి గా చేయ కూడదు ! ఈ మధ్యే హైదరాబాదు లో ఒక నలభై సంవత్సరాల వ్యక్తి , శలవులు అని , జిమ్ లో ప్రవేశించి , రెండు గంటలకు పైగా ట్రెడ్ మిల్ మీద వ్యాయామం చేసి , ఒక్క సారి గా కుప్ప కూలి పోయాడు ! ( ఈ లోకం నుంచి కూడా పోయాడు ) కోపం లో ‘ అతి గా’ వ్యాయామం చేయకూడదు !
కోపాన్ని నియంత్రించు కోడానికి యోగాభ్యాసం , ధ్యానం మంచివేనా ? : ముమ్మాటికీ మంచివే ! కేవలం అవి మన జాతి కి వేల ఏళ్ళ నుంచీ తెలియడమే కాకుండా , అనేక రకాలైన శాస్త్రీయ పరిశోధనల వల్ల కూడా , ఆ పద్ధతులు ఉత్తమమైనవి గా నిర్దారింప బడినవి కూడా ! యోగాభ్యాసం , ధ్యానం , అంటే మెడిటేషన్ వల్ల , మనో నిగ్రహం పెరుగుతుంది ! అంటే మన మనసు , ఆలోచనల , వివేచనల ద్వారా , మన భౌతిక శక్తులను , అంటే మన చేతలను ఎట్లా నియంత్రించు కొవచ్చో తెలియ చేసే అత్యుత్తమ మార్గాలు ! యోగా అయినా , ధ్యానం అయినా కూడా , ఒక క్రమ పధ్ధతి లో చేస్తూ ఉంటే , అది అనేక రకాలు గా ఉపయోగ పడుతుంది ! జీవన శైలి మారుతుంది ! సాత్విక మనస్తత్వం అలవడుతుంది ! ఆహార అలవాట్లలో మార్పు వస్తుంది ! అది కోపం కలిగించే ఆహార పదార్ధాలు కూడా ఎట్లా తగ్గించు కొవచ్చో తెలుస్తుంది !
మరి ఏ యోగా మంచిది ? : ఏదైనా మంచిదే ! అది మనకు మంచిదో ,చెడో నిర్ణయించేది మనమే కదా ! అంటే మనం క్రమం గా చేస్తూ ఉంటేనే , యోగా కానీ ధ్యానం కానీ ఫలితాలిచ్చేది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Interesting