తన కోపమె … 3.
మరి మనకు, కోపం తెప్పించే కారణాలు ఏమిటి ?
మనకు కానీ మన బంధు మిత్రులకు కానీ ఆపద కలిగి , ముప్పు ఏర్పడినప్పుడు .
మనలను , ఇతరులు దూషిస్తున్నా , లేదా భౌతికం గా అంటే ఫిజికల్ గా మనకు హాని కలిగిస్తున్నా ,
మనం ఏవైనా లక్ష్యాలు ఏర్పరుచుకుని , వాటికోసం శ్రమిస్తూ ఉండే సమయం లో ఏ కారణం చేత నైనా అంతరాయం కలిగితే,
మనం ఉండే సమాజం లో , మన ఆత్మ గౌరవాన్ని కించ పరిచే ఏ సంఘటన అయినా జరిగినా,
మనం ఎంతో శ్రమ కూడ బెట్టిన ధనాన్ని , మనం కోల్పోతున్నా , లేదా నష్ట పోతున్నా కూడా ,
మనం ప్రాణ ప్రదం గా భావించి , ఆచరిస్తున్న ఆశయాలను ఇతరులు గౌరవించ కుండా ,వాటిని వమ్ము చేస్తూ ఉంటే ,
మనం ఉండే చోట , మనకు , ఇతరుల వల్ల అన్యాయం జరిగినా , మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్నప్పుడు ,
మన మీద మనం కానీ , మనకు సంబంధించిన వారి మీద కానీ మనము డిసపాయింట్ అయినప్పుడు,
ఇట్లా అనేక కారణాల వల్ల మనం కోపం తెచ్చుకోవడం జరుగుతుంది , సహజం గా !
మనకు వచ్చే ఈ కోపం కూడా , వెంటనే వచ్చే కోపం ఒకటీ , కోపం , ఆ సందర్భం లో కనిపించ కుండా , అనేక నెలల తరువాత కానీ , సంవత్సరాల తరువాత కానీ , బయట పడే కోపం ఇంకో రకం ! అంటే ఒక సంఘటన జరిగిన సందర్భం లో అనేక కారణాల వల్ల , ఆ కోపం బహిర్గతం కాకుండా , ఒక బాటిల్ లో పెట్టి మూత పెట్టినట్టు మనలో నిగూఢ మై ఉండి , ఒక్క సారి ( ఒక సుముహుర్తాన ! ) బయట పడుతుంది ! పైన వివరించినవి కాక ఇంకా ఏవైనా కారణాలు మీకు ప్రధాన మైనవీ , ముఖ్యమైనవీ అనిపిస్తే , తెలియ చేయండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !