Our Health

ఉండే చోటు మీద మమకారం .4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 9, 2014 at 11:16 ఉద.

ఉండే చోటు మీద మమకారం . 4. 

ఉండే చోటు మీద మనకు ఏర్పడే మమకారం , కేవలం ఆ స్థానం మీదనే కాక , అక్కడ మనం, అక్కడి వ్యక్తులతో కలిగి ఉన్న పరిచయాల మీద కూడా ఆధార పడి ఉంటుందని సామాజిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. అనేక మంది శాస్త్ర వేత్తలు ,  ఈ  మమకారం , ప్రధానం గా అక్కడి సమాజం తో మన సంబంధాల మీదా , ఆ తరువాత ఆ స్థానం మీదా ఆధార పడి ఉంటుందని విశద పరిచారు ! 

ఒక ప్రాంతం లో లభించే వసతులూ , అవి ఎంత వరకూ మనం అనుభవిస్తున్నాం అనే విషయాలు కూడా మన మమకారాన్ని , ప్రభావితం చేస్తాయి !  మనకు ఆ ప్రాంతం లో వివిధ కారణాల వల్ల అనేక వత్తిడులను కనుక భరించాల్సి వస్తే , ఆ అనుభవాలు , మనకు, ఆ ప్రాంతం మీద ఏవగింపు కలిగిస్తాయి ! ఆ ప్రాంతం నుంచి ఇంకో చోటికి వెళితే బాగుంటుందేమో అన్న భావన కలిగిస్తాయి !  ఈ వత్తిడులు ,  భౌతికం గా ఉండే ఆవాసం సరి అయినది కాక పోవడం వల్ల కానీ, లేదా అక్కడి వ్యక్తులతో మనం సత్సంబంధాలు ఏర్పరుచుకోలేక పోవడం వలన కానీ అవవచ్చు !  
ఏ కారణాల యినా కూడా , మానవులలో  పరిణామం చెందుతున్న ఈ  ఎటాచ్ మెంట్ స్వభావం , చిన్న తనం నుంచీ వారికి ఉండే గుణాల పరిణామే అని కూడా సామాజిక శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడతారు ! పుట్టిన తరువాత నుంచీ , మానవులు సహజం గా , ఒక స్థిరమైన ‘ ఆలంబన ‘ కోసం పరితపిస్తారు ! అంటే, తమను జాగ్రత్త గా చూసుకునే వారి కోసం !  జననం ముందూ , అంటే పిండ దశలో గర్భం లోనూ , జననం తరువాతా , ఈ బాధ్యత సమర్దవంతం గా చేయగలిగేది , ఒక్క తల్లి మాత్రమే !  తల్లి ఒడి లో పిల్లలు పొందే ఆనందమూ , భద్రతా భావమూ , ఇంకెక్కడా  వారికి దొరకదు !  ఆ స్థిరమైన ఆలంబన ఏర్పడితే , అక్కడ నుంచి పిల్లలు తమ పరిసరాలను పరిశీలించడమూ , ఆ పరిసరాలను గురించి అవగాహన ఏర్పరుచుకోవడమూ చేస్తారు !  అంటే ,  వారి తల్లి ( దండ్రుల ) ‘ కను సన్నల ‘ లోనే , తమ పరిసరాలను కూడా గమనించడం అలవాటు చేసుకుంటారు ! అట్లాగే , వారి పెరిగి పెద్దయాక కూడా , ఒక స్థిరమైన ఆలంబన ఏర్పరుచుకుని , పరిసరాలను అర్ధం చేసుకోవడమూ , వాటితో తమ సంబంధాలను ఏర్పరుచుకోవడమూ చేస్తారు !   ఈ దశలో కూడా , వారికి  ఎటాచ్ మెంట్ ఫిగర్స్ ఉంటారు !  అంటే , చిన్న తనం లో తమకు ఏర్పడిన  ఎటాచ్మెంట్ తల్లి దండ్రులతో అయితే , వారు పెరిగే వయసులో కూడా , ఆ రకమైన ఎటాచ్ మెంట్ వ్యక్తులు లేదా ఫిగర్స్ కోసం  అప్రయత్నం గానే వెదుకుతూ ఉంటారు !  అట్లాంటి వ్యక్తులు తారస పడితే , వారి  లక్ష్యాలు సులభం అవుతాయి ! అంటే , వారు స్కూల్ లో ప్రవేశించ గానే ,  వారి తల్లి దండ్రుల లాంటి భావన కలిగించే ఉపాధ్యాయుల సమక్షం లేదా పర్యవేక్షణ లో , వారు ఎక్కువ ప్రభావ శీలురవుతారు ! అట్లా కాక , వారి తల్లి దండ్రుల  వ్యక్తిత్వానికి పూర్తి గా విరుద్ధం గా , క్రూర ప్రవర్తన కలిగి , విద్యార్ధులను  తీవ్రం గా మందలిస్తూ , దండించే వారి లో ‘ ఎటాచ్ మెంట్ ఫిగర్ ‘ అదృశ్యం అయి ,  వత్తిడి కి లోనవుతారు ! అభద్రతా భావన కు గురవుతారు !  వారు చేయవలసిన ఇతర పనులు, అంటే ఇక్కడ చదువుకోవడంలో  , ఆసక్తి చూపరు !
మానవులు పెరుగుతున్న కొద్దీ , ఒక స్థిరమైన స్థానం కోసం కూడా వెదుకుతూ ఉంటారు !  ఆ స్థానాన్ని ఒక  ‘ స్థావరం ‘ అంటే,  ‘ సెక్యూర్ బేస్ ‘ గా చేసుకుని , తమ పరిసరాలను పరిశీలించడ మూ , తమ చుట్టూ ఉన్న సమాజం తో సంబంధాలు ఏర్పరుచుకోవడం  చేస్తారు !  వారు ఉండే చోటు ఒక ‘ తల్లి ఒడి ‘ కావాలని ఆశిస్తారు  ! 
ఈ విధం గా , ప్రతి వ్యక్తి కీ ,  ఎటాచ్ మెంట్ ఫిగర్స్ తో పాటు గా , తాము అభిమానించే , లేదా మమకారం ఏర్పరుచుకున్న ఒక స్థానం కూడా  ఉంటుంది, వారి జీవితం లో ఏదో ఒక దశ లో’   అనే పరిశీలన తో చాలా మంది శాస్త్ర వేత్తలు అంగీకరిస్తారు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: