పని సూత్రాలు. 44. ఆఫీసులో, ‘ ఏకాకి ‘ కన్నా, ‘ గుంపు లో గోవిందా ‘ మేలు !
సామాన్యం గా పని చేసే ఆఫీసులో , భిన్న మనస్తత్వాలూ , భిన్న ఆచార వ్యవహారాలూ , ఉన్న ఉద్యోగులు ఉంటారు ! కారణాలు ఏమైనప్పటికీ , వారి, వారి అలవాట్లను , వారు ఏదో ఒక రకం గా కొనసాగిస్తూ ఉంటారు ! ‘అది నా చిన్న తనం నుంచీ ఉన్న అలవాటు’ అని వారు , వారి అలవాట్లను గర్వం గా సమర్ధించు కుంటూ ఉంటారు కూడా ! మీరు అట్లాంటి ఉద్యోగులు పని చేస్తున్న ఆఫీసు లో నిల దొక్కు కోవాలంటే ,అది కత్తి మీద సాము లాంటిదే ! ప్రత్యేకించి , మీకు అట్లాంటి అలవాట్లు లేక పోతే , లేదా, అట్లాంటి అలవాట్లను మీరు అలవాటు చేసుకోకూడదని నిర్ణయించు కుంటే !
ఒక యదార్ధ అనుభవం !
నేను స్కూల్ లో చదివే సమయం లో, ఒక మిత్రుడు పరిచయమయ్యాడు ! వాడి ఇల్లు మా ఇంటి దగ్గర గా ఉండడం చేతా , వాడి చక్కటి అలవాట్ల వల్ల కూడా , మా స్నేహం పెరిగింది ! ‘ రాముడు మంచి బాలుడు ‘ అన్న రీతి లో , ఉదయమే లేచి , స్నానాదికాలు ముగించుకుని , దైవ ప్రార్ధన చేసుకుని , నుదిటి మీద చక్కగా ఒక కుంకుమ బొట్టు కూడా పెట్టుకుని , స్కూల్ కు వచ్చే వాడు ! చక్కగా చదువుకోవడమే కాకుండా , సినిమా డైలాగులూ , ఇతర సినిమా నటులను అనుకరించి మిమిక్రీ కూడా చేసే వాడు ! పదో తరగతి లో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు కూడా ! ఇక ఇంటర్మీడియేట్ నుంచీ , ఎందుకో చదువు మీద శ్రద్ధ సన్నగిలింది ! ఒక మాదిరి గా మార్కులు వచ్చాయి , బీ ఎస్సీ లో చేరి , సెకండ్ క్లాస్ లో పాసయ్యాడు ! ఒక కేంద్ర ప్రభుత్వ శాఖ లో ఉద్యోగం వచ్చింది , మార్కుల ఆధారం గానూ , డిగ్రీ పట్టా ఉన్నందుకూ !
ఇతర ఉద్యోగులు కొందరు , ప్రత్యేకించి , తనతో పనిచేసే ఉద్యోగులు , అలవాట్లలోనూ , చదువులోనూ కూడా , వీడి కన్నా తక్కువ అయిన వారితో , వీడికి , రోజూ పనిచేసే ఉద్యోగం ! అది వారి నేరం కాదు ! కానీ ఆ క్రమం లో వీడు , వారి అలవాట్లను ,తానూ అలవాటు చేసుకున్నాడు ! వారితో రోజూ , చీటికీ మాటికీ , టీలూ , కాఫీలూ తాగడం తో మొదలైంది ! క్రమేణా , ఆ అలవాటు, విషమించి , రోజూ ఆఫీసు ముగియ గానే , తప్పని సరిగా , మద్యం తాగటం దాకా వచ్చింది ! అంతే కాకుండా ,ఆ తాగే మద్యం , మితి మీరి తాగడమూ , ఇతరులకు తాగించ డమూ , కూడా జరుగుతుంది ! వీడు సహజం గా మొహమా ట స్తుడూ , సున్నిత స్వభావం కలవాడూ అవడం వల్ల , చుట్టూ చేరిన వారు కూడా , అది అలుసుగా తీసుకుంటున్నారు ! తన జీతం డబ్బులు ‘ ఆ అలవాట్లకు ‘ సరి పోకున్నా కూడా , బలవంతం గా వాడి చేత అప్పు చేయించి మరీ తాగిస్తున్నారు , తాగుతున్నారు !
ప్రస్తుతం : రోజూ ఆఫీసు లో పని పూర్తి అవగానే , సహ ఉద్యోగులతో , విస్కీ తాగడం,ఆటోలో ఇంటికి వెళ్లి పడుకోవడం ! ఇదీ వాడి దిన చర్య ! అదృష్టం కొద్దీ , భార్య కూడా ఉద్యోగాస్తురాలవడం చేత , ఉన్న ఒక్క కొడుకునూ ఇంజనీరు చేయగలిగింది ! కానీ వాడి జీవితం , చేవ లేని జీవితం అయి పోయింది ! కేవలం స్వయంకృతాపరాధం !
జరగ బోయేది : మితి మీరి తాగుతూ ఉండడం వల్ల , వచ్చే అనేక రోగాలు , త్వరగా రావడమూ , జీవిత కాలం, కనీసం పది పదేహేనేళ్ళు తక్కువ అవడమూ కూడా జరుగుతాయి ! ఇదీ నా స్నేహితుడి పరిణామ క్రమం ! చదువులో నేను ప్రేరణ పొందిన స్నేహితుడి పరిణామ క్రమం !
ప్రతి ఆఫీసు లోనూ , సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వారూ , మద్యం తాగే అలవాటు ఉన్న వారూ , జూదం ఆడే అలవాటు ఉన్న వారూ ఉంటారు ! ఎట్టి పరిస్థితులలోనూ , వారి అలవాట్లను విమర్శించడం కూడదు ! ఎందుకంటే , మీ బాధ్యత , కేవలం, మీ ఇతర ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మాత్రమే , వారి అలవాట్లను ,విమర్శించడం కానీ , మానించడం కానీ , మీ బాధ్యత కాదు ! అది మీ ఉద్యోగ విధులలో లేదు ! ఇంకో ముఖ్య విషయం : ఆ అలవాట్లు ఉన్న ఇతర ఉద్యోగులందరూ కూడా , మానసికం గా వికలాంగులు కాదు ! అంటే , వారికి , వారి అలవాట్ల పూర్వా పరాలు , అనర్ధాలూ కూడా వివరం గా తెలుసు ! ఇక మీరు కొత్తగా చెప్పేదేమీ ఉండదు !
మీ లక్ష్యం , వారితో సఖ్యత గా ఉంటూ , మీ పని చేసుకోవడమే ! వారితో చేరమని , మీకు ‘ ఆహ్వానాలు ‘ అందుతుంటే, తెలివి గా, వాటిని తిరస్కరించాలి ! అంటే, మీకు ఇంకో అత్యవసర మైన పని ఉందనో , ఇంకో కారణం చెప్పి కానీ , ఆ పరిస్థితి నుంచి తప్పుకోవాలి ! అంతే కానీ, వారి అలవాట్లను విమర్శిస్తూ , ‘ నాకు ఆ అలవాటు లేదు ‘ అని నిర్ద్వందం గా వారికి చెప్పడం , కేవలం లౌక్యం లేకుండా, సమస్యలు కొని తెచ్చుకోవడమే ! మీ వ్యక్తిత్వం మీదే ! మీ అలవాట్లు మీవే ! వారి అలవాట్లు వారివే ! మీ లక్ష్యం మీదే ! మీ మార్గం మీదే ! వారి మార్గం వారిదే ! మీ గమ్యం మీదే ! వారి గమ్యం చేరుకోవాలనుకునే వ్యక్తిత్వం మీది కాదు , కాకూడదు !
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు !
Wel lsaid