Our Health

చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే, ఎక్కువ లాభం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 8, 2013 at 7:43 సా.

చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే ఎక్కువ లాభం ? 

మునుపటి టపా లో , పరీక్ష రోజున మీరు చక్కగా పర్ఫాం చేయాలంటే , అంతకు ముందు రాత్రి సరిపడినంత  నిద్ర పోవాలని తెలుసుకున్నాం కదా !  ఈ విషయం హాస్యానికి రాయలేదని గమనించాలి !  ఒకవేళ మీరు పరీక్ష ముందు రాత్రి చదవాలనుకుంటే కూడా ,  రోజూ చదివే సమయమే అప్పుడుకూడా , వినియోగించాలి అంటే , సాయింత్రం అయిదు గంటలనుంచి , ఎనిమిది వరకూ చదువుకోవడం అలవాటయి ఉంటే , ఆ విధం గా చేయవచ్చు ! కానీ పరీక్ష ముందు రోజుల్లో, రాత్రి చాలా సమయం మేలుకొని కనుక చదివే అలవాటు ఉన్న వారు కూడా  , పరీక్ష ముందు రోజున, త్వరగా నిద్ర పోవడం  మరచి పోకూడదు ! మరి మిగతా జాగ్రత్తలేంటి ?
 రాత పరికరాలు సిద్ధం చేసుకోవడం :  పరీక్ష ముందు రోజే , రాత కు అవసరమయే , పెన్సిళ్ళూ , పెన్నులూ , స్కేలూ , మిగతా  కంపాస్ బాక్స్ లాంటి వాటిని సిద్ధం చేసుకోవాలి !  ఎక్కువ  పెన్సిళ్ళు తీసుకు వెళ్ళడం వల్ల సహజం గానే , పరీక్షలో సమయం ఆదా చేస్తున్నారన్న మాటే కదా , చెక్కు కోకుండా !  పరీక్షా సమయం లో ప్రతి నిమిషమూ విలువైనదే కదా ! ఒక వాటర్ బాటిల్ ను అనుమతిస్తే , తీసుకు వెళ్ళ వచ్చు ! అట్లాగే  కొద్దిగా చిరు తిళ్ళు కూడా చాక్లెట్ , బిస్కెట్లూ అనుమతిస్తే ! ఉంటే ,  సరిగా పనిచేసే వాచీ ని కూడా ! 
ఆహారం, నీరూ : పరీక్ష కు ముందే మీ ఆహారం విషయం లో జాగ్రత్త తీసుకోవాలి !  అతి గా కానీ అల్పం గా కానీ తిన కూడదు ! పడని ఆహారమూ , కొత్త ప్రదేశం లో ఆహారమూ అసలే తినకూడదు , పరీక్ష రోజున !  ప్రత్యేకించి మద్యాహ్నం పరీక్ష ఉన్న సమయం లో ! డీ హైడ్రేట్ అవకుండా , ముందే ,  చాలినంత నీరు తాగడం మంచిది ! ప్రత్యేకించి , భారత దేశం లాంటి ఉష్ణ దేశాలలో ,  చాలా మంది విద్యార్ధులు , అతిగా టీలూ , కాఫీలూ తాగి , నీరు సరిపడినంత తాగకుండా , వారికి తెలియ కుండానే డీ హైడ్రేట్ అయి పరీక్షా హాలు లోకి వస్తారు ! దానికి తోడు , పరీక్ష ల వలన కలిగే ఆందోళన , వారికి ఎక్కువ చెమట పట్టించి , పరిస్థితిని ఇంకా అధ్వాన్నం చేస్తుంది ! ఇవన్నీ చిన్న విషయాలే అయినా , మిగతా సమయాలలో అంత ఏకాగ్రత అవసరం లేదు కనుక , డీ హైడ్రేషన్ వల్ల వెంటనే ఏ పరిణామాలూ ఉండక పోవచ్చు , కానీ , పరీక్షా సమయం లో డీ హైడ్రేట్ అవుతే , వారి మెదడు అతి సున్నితమైన భాగం కావడం వల్ల , ఏకాగ్రత తక్కువ అవడమే కాకుండా ,  తల తిప్పినట్టూ , తల నొప్పిగానూ కూడా ఉంటుంది ! ఆ లక్షణాలతో పరీక్ష ముందు బాగా సిద్ధం అయిన వారు కూడా , పూర్తి గా సమాధానాలు రాయలేక పోవడం జరగ వచ్చు ! 
పరీక్షా పధ్ధతి గురించి ముందే తెలుసుకోవడం :  చదవడం , నేర్చుకోవడం ఒక ఎత్తైతే , పరీక్ష గురించి పూర్తి గా తెలుసుకుని అవగాహన ఏర్పరుచు కోవడం ఇంకో ఎత్తు ! ఆ మాటకొస్తే ,  రోజూ పాఠాలు నేర్చు కుంటున్నప్పుడే , పరీక్షా పత్రం లో ప్రశ్నలు ఎట్లా ఇస్తారు ! ఎంత సమయం ఉంటుంది ? వాటిని ఆ సమయం లో నే బాగా రాయడం ఎట్లా ? అనే విషయాలన్నీ తెలుసుకుని , తదనుగుణం గా చదవడమూ , రాసుకోవడమూ, అంటే నోట్సు రాసుకోవడమూ చేసిన విద్యార్ధులు ఎక్కువ లాభ పడతారు !  ఇక పరీక్ష హాలులో కూడా , ప్రశ్న పత్రం గురించిన అన్ని సూచనలనూ, నిబంధనలనూ ,  శ్రద్ధ గా విని , ఆచరించాలి !  
వచ్చే టపాలో , అసలు పరీక్షా సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: