చదువు కోవడం ఎట్లా ? 20. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?

ఎనాలజీ లేదా సామ్యాల తో చదవడం : ఈ విషయం లో ఉన్న మరి కొన్ని ముఖ్య మైన కిటుకులలో , ఎనాలజీ లేదా సామ్యాల తో చదవడం ఎంతో ముఖ్యమైనది ! అంటే, మనం చదివే చదువు, కేవలం ఒకే మూస లో పోసినట్టు అంటే , ఒకే రకం గా బట్టీ పట్టకుండా , ప్రతి అధ్యాయాన్నీ మిగతా అధ్యాఅయాలతో పోల్చి చూసుకుంటూ , చదివితే చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుండి పోతాయి ! ఆ మాటకొస్తే , మనం చదువుకునే చదువంతా , మూల సూత్రాలు తెలుసుకోవడమే కాకుండా , ఆ మూల సూత్రాలు , కాలానుగుణం గా ఎట్లా మారుతున్నాయో , అంటే అవి పరిణామం చెందే విధానమూ , జీవులలో కానీ , వస్తువులలో కానీ , అనే విషయం మీద శ్రద్ధ పెట్టడం మీదే ఉంటుంది !
ఉదాహరణకు , స్మోకింగ్ క్యాన్సర్ తో , జ్వరం – ఇన్ఫెక్షన్ తో ముడి పడి ఉంటాయి ! ఈ పోలికలు లేదా సామ్యాలు అనేక రకాలు గా ఉంటాయి ఈ క్రింద వివరం గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే, ఈ సామ్యాలు పోలికలు లేదా ఎనాలజీ ఎన్ని రకాలు గా చేసుకోవచ్చో తెలుసుకుంటే , వాటిలో అవసరమూ , సందర్భానుసారమూ అయిన వాటిని , ప్రతి విద్యార్ధీ పాటిస్తే , వారికి ఆ యా సబ్జెక్ట్ లు చాలా సులభం అవుతాయి ! వ్యతిరేక పదాలూ అంటే ఆంటోనిమ్స్ : పైనా – క్రిందా ,, సారూప్య పదాలూ అంటే సినానిమ్స్ : గొప్పగా ఉంది – అత్భుతం గా ఉంది !, ఒక వస్తువూ , దాని ఉపయోగమూ ( టూల్ అండ్ యాక్షన్ ) ఉదా : పెన్ను – వ్రాత ,ఒక భాగమూ , పూర్తి గా ఉదా ( పార్ట్ అండ్ హోల్ ) :ఉదా : స్కూలు – క్లాస్ రూం , క్యాటగిరి – ఉదాహరణ : ( కాట గిరి – ఎగ్జాంపుల్ ) ఉదా :కుక్క – ఆల్సేషియన్ ,కారణమూ – పరిణామమూ ( కాజ్ అండ్ ఎఫెక్ట్ ) ఉదా: సాధన అంటే ప్రాక్టిస్ – పెంపొందించు కోవడం లేదా ఇంప్రూవ్ చేసుకోవడం !, భావ తీవ్రత ( ఇంటెన్సిటీ ) : ఉదాహరణ: విచారం గా ఉండడం , కుమిలి పోవడం , ఆనందం గా ఉండడం , పులకితమవడం ! ,నామమూ – గుణమూ :ఉదా: ఏనుగు : పేరు గుర్తు కు రాగానే భారీ గా ఉండే జంతువని !
పదే పదే వల్లె వేయడం అంటే రిపిటీషన్ : ఈ పధ్ధతి చాలా మంది విద్యార్ధులు చాలా తరచు గా ఉపయోగించే పధ్ధతి ! ఈ పధ్ధతి లో ఒక సారి చదివిన పాఠాన్ని పదే పదే చదువుతూ , ఆ పాఠం పూర్తి గా కంఠ తా పట్టడం ! భారతీయ విద్యా విధానం లో ఈ పధ్ధతి చాలా సామాన్యం గా ఉపయోగించడం జరుగుతుంది ! కానీ పాశ్చాత్య విద్యా విధానం లో ఈ కంఠతా పట్టడమూ , బట్టీ పట్టడమూ , ఈ పద్ధతులను ఎందుకో ప్రోత్సహించరు ! కానీ అవసరమైన పాఠాలనూ , లేదా అవసరమైన సమాచారాన్నీ , కంఠతా వచ్చేట్టు నేర్చుకోవడం లో ఏమీ తప్పు లేదు ! ఈ రకం గా చేయడం వల్ల , మెమరీ హార్డ్ డ్రైవ్ అంటే మన మెదడు లో శాశ్వత మైన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయ బడుతుంది ! మూల సూత్రాలు మెదడులో శాశ్వతం గా స్టోర్ చేసుకోవడం లో తప్పు లేదు కదా ! ప్రత్యేకించి ఫార్ములాలూ , నిర్వచనాలూ , ఈ రకం గా నేర్చుకుంటే , ఉపయోగ కరం !
ఏ పధ్ధతి ఉపయోగించాలి ? : మనం, ఇప్పటి వరకూ, కనీసం అయిదు పద్ధతుల గురించి తెలుసుకున్నాం కదా , మరి ఏ పధ్ధతి ఉపయోగించాలి ? ఈ విషయం విద్యార్ధులే నిర్ణయించుకోవాలి ! ఎందుకంటే , పద్ధతులు అనేకం ఉన్నా , ఏ పధ్ధతి తో నేర్చుకుంటే , బాగా ఉపయోగ కరం గా ఉంటుందో , అంటే పాఠాలు బాగా అర్ధమయి , ‘ ఆవిరి ‘ కాకుండా ఉంటాయో , ఆ పద్ధతే వారు అనుసరించాలి ! నేర్చుకోవడం ప్రధాన లక్ష్యం అయినప్పుడు , అనేక సమయాలలో అనేక పద్ధతులు ఉపయోగించ వలసిన అవసరం ఉన్నా , సందేహం లేకుండా , ఆ పద్ధతులను అనుసరించ వచ్చు ! మనం , ఒక గమ్యాన్ని ఒక నిర్ణీత సమయం లో వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే , మొదట గా అతి సులువైన , అతి త్వరగా, ఆ గమ్యానికి చేర్చే ప్రయాణ సాధనాన్ని వాడుకొంటాము కదా ! లేదా ఆ ప్రయాణం లో, ఎక్కువ దూరం సులభం గా వెళ్ళ గలిగే వాహనాన్ని ఉపయోగించు కుని , మిగతా దూరం , ఇంకో వాహనాన్ని ఉపయోగించడం కూడా జరుగుతుంది కదా ! ఇక్కడ మనం చేస్తున్నది , లక్ష్యం మీద దృష్టి పెట్టడం !
అదే విధం గా చదువులోనూ , లక్ష్యం : నేర్చుకోవడం , పరీక్షలలో అత్యున్నత మార్కులు సాధించడం మీదనే విద్యార్ధి దృష్టి ఎప్పుడూ కేంద్రీకరించాలి ! ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి , తనకు ఏ పధ్ధతి వీలు అయితే దానిని అనుసరించ వచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Good series, informative,suggestive
కృతఙ్ఞతలు !
మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి రాసే ఈ టపాలో ఎన్నో అమూల్యమైన విషయాలున్నాయి,
ముఖ్యంగా మీ శైలి అద్భుతం సుదాకర్జి
కృతఙ్ఞతలు మెరాజ్ !