చదువు కోవడం ఎట్లా ? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?

పరీక్షల ముందు , తక్కువ సమయం లో ఎక్కువ పాఠాలు రివైజ్ చేయడం తో పాటుగా , బాగా గుర్తు ఉండేట్టు కూడా ఎట్లా చదవాలో, ఆ కిటుకులు కొన్ని మునుపటి టపాల లో తెలుసుకున్నాం కదా ! మరి ఇప్పుడు ఇంకొన్ని తెలుసుకుందాం !
చూడకుండా రాసి , తరువాత పోల్చడం : మీకు గుర్తు ఉండే ఉంటుంది , చిన్న తనం లో, పదాల స్పెల్లింగ్ లు నేర్చుకోవడం కోసం , ఆ పదాలను చూడకుండా , పేపర్ మీదో , పలక మీదో రాసి తరువాత ఆ రాతను ( అంటే రాత లో స్పెల్లింగ్ ను ) అసలు ప్రింటు లో ఉన్న పదాలతో పోల్చి సరిచూసుకోవడం ! పొర పాటు ఉంటే , సరి చేసుకోవడం ! అది చాలా మంచి పద్ధతే కనుక , ఆ పద్ధతిని పెద్ద క్లాసులకు వెళ్ళినా కూడా , అనుసరించ వచ్చు ! అంటే కాలేజీ లో చదువుతున్నా కూడా ! ఈ పధ్ధతి లో జరుగుతున్నది ఏమిటంటే , ఒకసారి చదువుకుని నేర్చుకున్న స్పెల్లింగ్ మన మెదడులో ‘ ముద్ర ‘ వేసిందో లేదో పరీక్షించు కోవడమన్న మాట ! మనం స్పెల్లింగ్ ను శ్రద్ధ గా నేర్చుకుంటే నే , ఆ స్పెల్లింగ్ మన మెదడు లో ముద్ర వేయ గలదు ! చదువులో పై క్లాసులకు వెళుతున్న కొద్దీ , స్పెల్లింగ్ లు వచ్చినా , ఇంకో రకం గా ఈ పధ్ధతి ని వినియోగించుకోవచ్చు ! అంటే పాఠాలలో ఉండే వివిధ నిర్వచనాలను , చూడకుండా రాసుకుని , తరువాత చూసి సరిచేసుకోవడం ! ఎందుకంటే , నిర్వచనాలు ఉన్నది ఉన్నట్టుగా పరీక్షలో పూర్తి మార్కులు వస్తాయి !
కధ చెప్పడం : అంటే స్టోరీ టెల్లింగ్ : ఈ పధ్ధతి కూడా మన జ్ఞాపక శక్తి ని చురుకు గా ఉంచే ఒక ప్రక్రియ ! తల్లి దండ్రులు చెప్పే కధలను చెవులారా ఆలకించి , శ్రద్ధగా విని ఆనందించి , ఆ కధలను జీవితాంతం గుర్తు ఉంచుకోని సంతానాన్ని వేళ్ళ మీద లెక్కించ గలమా ? అంతటి మహత్యం ఉంది కధ కు ! ఆ మాటకొస్తే , మన జీవితాలన్నీ ,అనేక కధలతో నిండి ఉంటాయి ! మన జీవితాల పెద్ద కధ లో అనేక పిట్ట కధలు ఉంటాయి ! అన్నిటినీ మనం వీలైనంత వరకూ గుర్తు ఉంచుకో గలుగు తున్నామంటే , మరి అది కధ గొప్ప తనమే కదా ! చదివే చదువు లో కూడా, వివిధ సబ్జెక్ట్ లలో , ఈ పధ్ధతి ని ఉపయోగించుకోవచ్చు , ఉత్సాహం ఉన్న విద్యార్ధులు ! వ్యక్తుల జీవిత చరిత్రలు ,కధల రూపం లో గుర్తు ఉంచుకోవచ్చు ! మిగతా పాఠాలు కూడా ! చాలా కష్టమైన పాఠాలను , కధా రూపం లో మొదటే చెప్పుకుని , ఆ కధ ను గుర్తు ఉంచుకోవచ్చు !
ప్రశ్న : నాలుగు నీటి బుగ్గలు లేదా ఫౌంటెన్లు, ఒక్కొక్కటీ పూర్తి గా నీరు వదిలితే ,ఒక పెద్ద పీపాను, ఒక రోజులోనూ , రోజులో సగం సమయం లోనూ , రోజులో మూడో భాగం లోనూ , రోజులో ఆరో భాగం లోనూ , నింప గలవు ! మరి ఆ నాలుగు ఫౌంటెన్ లూ కలిసి పూర్తిగా నీరు నింపడం మొదలెడితే , ఆ పెద్ద పీపా రోజులో ఎంత కాలం లో నిండుతుంది ? ఈ ప్రశ్న లో, గణితం లో నిష్పత్తి అంటే ఫ్రాక్షన్స్ అనే అధ్యాయం గురించినది ! కానీ చిన్న పిల్లలకు ఆసక్తి కరం గా , ఈ లెక్క ఒక కదా రూపం లో ఇవ్వ బడింది భాస్కర గణితం లో ! భాస్కర గణితం లో ఇట్లాంటి ప్రశ్నలు కోకొల్లలు ! మరి పైన ఇచ్చిన ప్రశ్న కు జవాబు చూద్దామా ?
ఒకటవ ఫౌంటెన్ ఒక రోజులో పీపాను నింప గలదు ! అంటే 1/1 రోజు
రెండవ ఫౌంటెన్, ఒక రోజులో సగం సమయం లో పీపాను నింప గలదు ! అంటే 1/2 రోజు
మూడవ ఫౌంటెన్, రోజులో మూడవ వంతు సమయం లో నింపగలదు అంటే 1/3 రోజు
నాలుగవ ఫౌంటెన్, రోజులో ఆరవ వంతు సమయం లో నింప గలదు అంటే 1/6 రోజు
మరి అన్ని ఫౌంటెన్ లనూ ఒక్క సారిగా తెరిస్తే ఆ పీపాను ఎంత సమయం లో నింప గలవు అనేది ప్రశ్న కదా ! అందుకు నాలుగు ఫౌంటెన్ లూ , విడి విడి గా ఎంత సమయం తీసు కుంటాయో , వాటన్నిటినీ కలపడమే కదా ! ఎందుకంటే అన్నీ కలిసి ఎంత సమయం లో నింప గలవు ? అనేది ప్రశ్న కాబట్టి ! అందుకు 1/1 +1/2+1/3+ 1/6 = 1/12 అంటే రోజులో పన్నెండవ వంతు రోజులో నింప గలవు అన్నీ కలిసి ! అంటే 24 గంటలలో పన్నెండవ భాగ సమయం, రెండు గంటలు ! వెయ్యి సంవత్సరాల క్రితమే , భాస్కరా చార్యుడు, గణితాన్ని,తన కుమార్తె లీలావతి కీ, ( ఇతర విద్యార్ధులకూ ) సులభం గా అర్ధమవడానికి ఎంత చక్కగా ప్రశ్నలను ఆసక్తి కరం గా ( కధా రూపం లో ) అడిగేవాడో !
వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులు !
అద్బుతమైన రీసెర్చ్ ఈ టపా చూసిన వారు (విద్యార్దులు) ధన్యులు