చదువుకోవడం ఎట్లా? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?

క్రితం టపాలో , పద చిత్ర గురించి తెలుసుకున్నాం కదా , అది ఎట్లా మీకు ఉపయోగ పడుతుందో ఇక మీరే, అనుభవం మీద చెప్పాలి, మిగతా వారికి ! తరువాతి కిటుకు గురించి తెలుసుకుందాం ఇప్పుడు !
సంక్షిప్తాక్షరాలూ , పొట్టి పదాలు : దీనినే ఆంగ్లం లో నెమొనిక్స్ , యాక్రోనిమ్స్ అని కూడా అంటారు ! అంటే పొడవైన పదాలను , ఎక్కువ గా ఉన్న వాటిని కుదించి , చిన్న చిన్న అక్షరాలూ , పదాలు గా రాసుకోవడం ! ఈ పధ్ధతి , చాలా మంది విద్యార్ధులు , చాలా తరచు గా ఉపయోగించే పద్ధతే !
కాకపొతే , చాలా మంది విద్యార్ధులు , ఈ పధ్ధతి ని సంపూర్ణం గా ఉపయోగించుకోరు ! సరి అయిన పధ్ధతి లో ఈ పధ్ధతి ని ఉపయోగించుకుంటే , వాటి లాభాలు చాలా ఉంటాయి ! ఈ పధ్ధతి గురించి వివరం గా తెలుసు కుందామిప్పుడు !
ఉదాహరణలు :
వార్తలను ఆంగ్లం లో NEWS అని అంటారు ఎందుకో తెలుసా ? ఉత్తర , తూర్పు , పడమర , దక్షిణ దిక్కులనుంచి వచ్చే సమాచారాన్ని వార్త అంటారు కనుక అందుకు నాలుగు ప్రధాన దిక్కుల మొదటి అక్షరాలను కలిపి NEWS అనే ఒక పదం ఏర్పాటు చేశారు ! మనం త్వరగా ఒక పనిని చేయమని ఎవరికైనా రాత పూర్వకం గా చెప్పడానికి , ASAP అని రాస్తాము కదా ! అంటే As Soon As Possible అనే వాక్యం లో పదాల మొదటి అక్షరాలు !
అట్లాగే U.S. అంటే యునైటెడ్ స్టేట్స్ అని కదా ! ఇట్లా ఇంకొన్ని చూద్దాం ! ఇంధ్ర ధనుస్సు లో సప్త వర్ణాలనూ , VIBGYOR అని అంటారు, సులభం గా గుర్తు ఉంచుకోవడానికి . దానినే విబ్ జియార్ అని గుర్తు ఉంచుకోవచ్చు ! మరి వాటికీ ఇంధ్ర ధనుస్సు లో రంగులకూ , సంబంధం ఏమిటి ?
V అంటే వయోలెట్ రంగు I అంటే ఇండిగో రంగు , B అంటే బ్లూ రంగు , Y అంటే ఎల్లో రంగు , O అంటే ఆరెంజ్ రంగు , ఇక చివరగా R అంటే రెడ్ రంగు ! చూశారా ఒక్క VIBGYOR అనే పదాన్ని గుర్తు ఉంచుకుంటే , అన్ని రంగులూ మీకు గుర్తు ఉన్నట్టే కదా !
ఇక కాస్త పెద్ద క్లాసులలో పాఠాల నెమొనిక్స్ కొన్ని చూద్దాం :
My Very Easy Method Shows Us Just Nine Planets అనే వాక్యం గుర్తుంచుకునారనుకోండి ! మీకు సూర్యుడి చుట్టూ తిరిగే నవగ్రహాల పేర్లు తెలిసి పోయినట్టే ! అది ఎట్లా గంటే , My లో మొదటి అక్షరం Mercury , Very లో మొదటి అక్షరం Venus ,Easy లో మొదటి అక్షరం Earth, Method లో మొదటి అక్షరం Mars , Shows లో మొదటి అక్షరం Saturn ,Us లో మొదటి అక్షరం Uranus , Just లో మొదటి అక్షరం Jupiter , Nine లో మొదటి అక్షరం Neptune , Planets లో మొదటి అక్షరం Pluto ! ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ వాక్యం మొదట సూర్యుడు ఉన్నట్టు మనం ఊహించుకుంటే , గ్రహాలన్నీ కూడా పదాల క్రమం లోనే కక్ష్యల లో ఉంటాయి !
జీవ శాస్త్రం అంటే బయాలజీ లో వర్గీకరణ క్రమం గుర్తు పెట్టుకోవాలంటే , Don King Plays Chess On Friday , Generally Speaking ‘ అనే వాక్యం మీరు గుర్తు ఉంచుకుంటే , మీకు తెలిసిపోయినట్టే ! Don లో మొదటి అక్షరం Domain , King లో మొదటి అక్షరం Kingdom , Plays లో మొదటి అక్షరం phylum , Chess లో మొదటి అక్షరం Class , On లో మొదటి అక్షరం Order , Friday లో మొదటి అక్షరం Family , Generally లో మొదటి అక్షరం Genus , Speaking లో మొదటి అక్షరం Species అనీ గుర్తు పెట్టుకోవాలి !
పైన చెప్పిన విధం గా వివిధ సబ్జెక్ట్ లలో ముఖ్యమైన పదాలనూ , మీకు ఇష్టమైన రీతి లో నెమొనిక్స్ అంటే క్లుప్త పదాలుగానూ , అక్షరాలు గానూ మీరు పాఠం లో ఆ పదాలు చదువుతున్నప్పుడే , ఏర్పరుచుకుంటే , మీకు ఎక్కువ విషయాలు గుర్తుంటాయి , ఎక్కువ కాలం ! ముఖ్యమైన విషయం ఏమిటంటే , మీరు ఇట్లా క్లుప్త పదాలు ఏర్పరుచు కున్నప్పుడు , మళ్ళీ మళ్ళీ మీకై మీరే పరీక్ష చేసుకుంటూ ఉండాలి అవి పూర్తి గా మీకు వచ్చే వరకూ !
వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులు !
Interesting series
నేను మీ పోస్ట్ కొసం ఎదురుచూస్తూ ఉంటాను,
గొప్పగా ఉంటుంది మీ వివరణ. సుదాకర్ సర్.