చదువుకోవడం ఎట్లా ? 17. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
మునుపటి టపాలలో , చదువు కోవడం ఎట్లాగో తెలుసుకోవడం లో భాగం గా , క్లాసులో నోట్సు తీసుకుంటే ఉండే ప్రయోజనాలూ , పాఠ్య పుస్తకాలు చదివే తీరూ , పాఠాలు సులువుగా నేర్చుకునే కిటుకులూ , తెలుసుకున్నాం కదా ! మరి పరీక్షలు కొద్ది నెలలో , కొన్ని వారాలో ఉన్నప్పుడు ఎట్లా చదవాలి ?
ఈ సందేహం అనేక మంది విద్యార్ధులలో కలుగుతుంది ! అది సహజమే ! అందుకే ‘ ఫియర్ ఈజ్ ద కీ ‘ అని అంటారు ! అన్నిటికీ, భయం కీలకం ! అంటే, మనం చదువు అంటే కొంతైనా భయం కలిగి ఉండాలి ! శాస్త్రీయం గా కూడా , మనం ఏపనైనా చేసేందుకు , మనకు వత్తిడి అంటే టెన్షన్ ఉంటే , ఆ పనిని ఎక్కువ సమర్ధ వంతం గా నూ ,ఏకాగ్రత తోనూ చేయగలం ! గమనించ వలసినది , ఈ టెన్షన్ సమ పాళ్ళలో నే ఉండాలి ! అంటే అతి గా ఉండకూడదు ! అవసరమైనంతే ఉండాలి ! మరీ ఏ టెన్ష నూ లేకుండా ఉంటే , పూర్తి గా యాదాలాపం గా ఆ పనిని చేసి , ఏదో చేశామనిపించుకుంటాం కదా !
మరి పరీక్షలు ముందుకు వస్తుంటే , అప్పుడు సమయాన్ని వృధా చేయకుండా , చదువుకోవాలి , కానీ ఆ సమయం లో కూడా , తీరిక గా ఒక్కో పేజీ చదువుతూ ఉంటే , సమయం చాలదు కదా ! అప్పుడు మనం మన గేరు మార్చాలి ! గమనించారో లేదో , కారు మొదలు చేసే ముందు , అంటే స్టార్ట్ చేశాక రోడ్డు మీదకు వెళ్ళే వరకూ, తక్కువ గేర్ లలో నే కారు ను నడపాలి ! ఎందుకంటే , తక్కువ గేర్ లో ఇంజన్ ఎక్కువ పని చేస్తుంది ! ఒక సారి కారు రోడ్డు మీదకు వచ్చి ఒక నియమిత వేగం పుంజు కున్నాక , కారు స్మూత్ గా వేగం అందుకుని పోడానికి , గేర్ ను మార్చి ఎక్కువ గేర్ లో పెట్టడం జరుగుతుంది కదా ! అదే విధం గా , మొదట్లో , ఏరోజు చెప్పిన పాఠం , ఆరోజు చదువు కునే సమయం లో కాస్త ఎక్కువ శ్రమ పడడం జరుగుతుంది ! ఇక పరీక్షల ముందు గేర్ మార్చి వేగం గా పునశ్చరణం చేయడం అంటే రివైజ్ చేయడం ఎంతగానో ఉపయోగ పడుతుంది ! మరి దానికి కిటుకు లేంటి ?
1. పద-చిత్రాల జత : అంటే ఇమేజ్ -వర్డ్ అసోసియేషన్ : ఈ పధ్ధతి లో మీరు, పాఠ్య పుస్తకం లో చదివే కొత్త పదాలను, మీకు అంతకు ముందే తెలిసి ఉన్న చిత్రాలతో లింకు వేసు కుంటారన్న మాట ! అప్పుడు , మీరు గుర్తుకు తెచ్చుకోవాలనుకున్న కొత్త పదం వెంటనే గుర్తు కు రాక పోయినా కూడా ,
మీరు జత చేసిన చిత్రం గుర్తుకు వచ్చి , దాని ద్వారా మీకు ఆ పదం కూడా గుర్తుకు వస్తుంది వెంటనే ! అందువల్లనే దీనిని పద – చిత్రాల జత అనవచ్చు ! ప్రముఖ భాషా శాస్త్రజ్ఞుడు కృశ్చెవ్ స్కీ ఇట్లా తెలిపాడు, ప్రతి పదమూ , కొన్ని ప్రత్యేకమైన సూత్రాల వలన , మన మెదడు లో, అదే రకమైన పదాలను ప్రేరేపిస్తుంది ! కొన్ని ఉదాహరణలు:
మీకు సైన్స్ లో , జీవ కణం లో ప్రధానమైన భాగమైన , మై టో ఖాండ్రి యా అనే పదం వస్తే దానిని పవర్ హౌస్ అఫ్ ది సెల్ అని గుర్తు ఉంచుకోవడం లేదా ఎలెక్ట్రిక్ పవర్ స్టేషన్ గుర్తుకు తెచ్చుకోవాలి ! ఎందుకంటే , మై టో ఖాండ్రి యా లోనే మన శరీరానికి కావలసిన శక్తి దాచ బడి ఉంటుంది !
అట్లాగే , లెక్కలలో పైథాగరస్ అనే గణిత శాస్త్రజ్ఞుడి పేరు గుర్తు కు రావాలంటే పైథాన్ ను గుర్తుకు తెచ్చుకోవడం ! ఇట్లా , ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు , తమకు కష్టం గా ఉన్న పదాలను , వారికి అంతకు ముందే తెలిసి ఉన్న చిత్రాలతో కానీ , ఫోటోలతో కానీ లింకు చేసుకుని ఉండాలి ! అంతే కాకుండా , వాటిని పరీక్షలకు ముందే తరచూ పోల్చి చూసుకుంటూ ఉండాలి ! అంటే పరీక్షా సమయం లో రెండూ మరచి పోయే పరిస్థితి తెచ్చుకో కూడదు ! ఈ టపా చదివాక , మీరు ఒక పాఠం సెలెక్ట్ చేసుకుని అందులో కష్టం గా ఉన్న పదాలను , పైన చెప్పిన విధం గా లింకు చేసుకోడానికి ప్రయత్నించండి ! అది సరదా గా ఉండడమే కాకుండా , ఆ పదాలన్నీ కూడా , మీకు గుర్తుండి పోతాయి ! కొన్ని సమయాలలో , మీ స్నేహితులతో కూర్చుని , ఆ పదాలన్నీ కూడా ఒక దాని తరువాత ఒకటి టిక్ చేసుకుంటూ , మరచి పోయే వాటిని , అందరూ కలిసి అందరికీ గుర్తుకు వచ్చే ఒక చిత్రం తో లింకు చేసుకోవడం కూడా సరదా గా ఉంటుంది ! సరదా తో పాటుగా , మీకు పాఠం కూడా చాలా వరకూ గుర్తుండి పోతుంది ! పరీక్షల లో కూడా ! ( పైన ఉన్న చిత్రం లో పదాలు ఎట్లా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయో చూడండి ! మనం చేయ వలసినదల్లా , ఆ లింకులను అర్ధం చేసుకుని , గుర్తు తెచ్చుకోవడం ప్రాక్టీస్ చేయడమే !
వచ్చే టపాలో ఇంకొన్ని పద్ధతులు, పరీక్షల ముందు ఉపయోగ పడేవి , తెలుసుకుందాం !
ఈ టపాలో మీరు చెప్పిన చిన్ని చిత్రాల తో గుర్తు పెట్టుకొవటం నేనూ పిల్లలకి నేర్పుతాను. వాళ్ళు పరీక్షా సమ్యమ్లో కూడా రఫ్గా ఆ చిత్రాలను గీసి గ్నాపకం తెచ్చుకొవటం నేను చూస్తుంటాను.
అద్భుతమైన మీ భోధనను మెచ్చుకొనే అంతటి స్థాయి నాకు లేదేమో..
ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండీ , ( వివిధ సైట్ లలోనుంచి ) సేకరించిన విషయాలు టపా వేస్తున్నాను, మన తెలుగులో !