Our Health

చదవడం ఎట్లా ? 16. పాఠ్య పుస్తకాలు, సులభం గా అర్ధం చేసుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 1, 2013 at 2:55 ఉద.

చదవడం ఎట్లా ? 16. పాఠ్య పుస్తకాలు  సులభం గా అర్ధం చేసుకోవడం ఎట్లా ? 

 
S Q R 4. ( R4= RRRR )
 
క్రితం టపా లో మనం, S  అంటే సర్వే అనీ , Q  అంటే , చదివే సమయం లో  వేసుకునే ప్రశ్నలు అంటే , what , where ,when,how , who ,why  అనే ప్రశ్నలు ప్రతి పాఠం లోనూ మీ అంతట మీరే ప్రశ్నలు వేసుకుని , వాటికి సమాధానాలు రాబట్టు కోవడానికి , శ్రమ పడితే ,  పాఠం  మీకు ఎంత త్వరగా అర్ధం అవుతుందో కూడా తెలుసుకున్నాం కదా ! మరి ఇప్పుడు R 4 అంటే ఏమిటో చూద్దాం ! R 4 అంటే నాలుగు R లు ( Read , Recite , Record , Review  )  అంటే రీడ్ , రిసైట్ , రికార్డ్ , రివ్యూ  అని ! 
మరి చదివే సమయం లో, ఈ నాలుగు R లూ ఎట్లా ఉపయోగ పడతాయి ?  ( R4= RRRR )
Read :  మొదటి దశలో మీరు సర్వే చేశాక , ప్రశ్నించు కోవడం కూడా చేశాక , ఆ పాఠాన్ని జాగ్రత్త గా చదవడం చేయాలి ! ఈ సారి చదివే సమయం లో కేవలం పై పైన సర్వే చేయడం కాక , పాఠం లో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ! అంటే పాఠం , కూలంక షం గా చదవాలి ! అంటే అన్ని వివరాలూ చదువుతూ , ఏవి ముఖ్య విషయాలో , వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి ! ఒక వేళ , ఆ పాఠం  లో కనుక మీకు పరీక్ష ఉంటే , ఏ రకాలైన ప్రశ్నలు అడగ వచ్చు ? అనే విషయం కూడా మీరు మనసు లోనే ఆలోచించి , వాటికి సమాధానం మీకు తెలుసో లేదో కూడా , చదివే సమయం లోనే  మీరు అంచనా వేసుకుంటూ ఉండాలి ! 
Recite : రిసైట్ చేయడం అంటే, వల్లె వేయడం.  అంటే , మీరు చదివిన పాఠాన్ని ,  రెండో మారు మననం చేసుకోవడం , అంటే, ఈ సారి మీరు పాఠ్య పుస్తకం లో పాఠం చూడకుండా ,  మీరు చదివినది గుర్తు కు తెచ్చుకోవడం !   ఈ చర్యలో, మీరు చదివిన పాఠాన్ని, ఉన్నది ఉన్నట్టు , గుర్తు తెచ్చుకో నవసరం లేదు !   చదివినది , క్లుప్తం గా గుర్తుకు తెచ్చుకుంటే , మంచిది ! పాఠం లో ఉన్న పదాలే ఖచ్చితం గా మళ్ళీ గుర్తుకు తెచ్చు కోవలసిన అవసరం కూడా లేదు  !  మీ స్వంత పదాలు కూడా ఉపయోగించ వచ్చు ! ( కానీ పాఠం లో ఉన్న కొత్త సాంకేతిక పదాలనే వాడితే , పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తాయి ! ) ఈ రిసైట్ చేయడం లో  మీరు వేసుకోవలసిన ప్రశ్నలు ( పైన చెప్పినవి ) మళ్ళీ వేసుకుని , ఆ ప్రశ్నలకు సమాధానాలు మీరు చదివి , మననం చేసుకున్న పాఠం  లో ఉన్నాయా? లేదా? అని సరి చూసుకోవాలి !  ఈ సరి చూసుకోవడం , మీరు   విశ్వసనీయం గా అంటే సిన్సియర్ గా చేసుకోవాలి ! అంటే ,విషయాలన్నీ గుర్తుకు రాకపోయినా కూడా మీరు , ‘ బాగా చదివేశాను లే ‘ అని  ప్రశంసించు కోకూడదు !  మీరు , గుర్తు చేసుకున్న పాఠం  లో విషయాలన్నీ కూడా సంపూర్ణం గా లేదని మీకు అనిపించినా , లేదా మీకు తృప్తి గా లేక పోయినా కూడా , పాఠాన్ని మళ్ళీ అంటే రెండో సారి , అవసరం అవుతే , మూడో సారీ  చదవడానికి వెనుకాడ కూడదు !  ప్రతి సారీ చదివాక , మీరు చేయవలసినది, మొదట చేసినదే , అంటే  మళ్ళీ పాఠాన్ని మననం చేసుకోవడం ,  ఆరు ప్రశ్నల సహాయం తో (  what , where ,when,how , who ,why ) ! 
Record : పై విధం గా మీరు మననం చేసుకుని , మీ స్వంత పదాలతో గుర్తు కు తెచ్చుకున్న పాఠాన్ని , నోట్స్ లో రాసుకోవడం ! అంటే  మీరు పరీక్ష లో రాసినట్టు రాసుకుంటున్నారన్న  మాట ! కాక పొతే, మీ నోట్స్ లో !  ఈ నోట్స్ కేవలం, మీరు చదివినది రికార్డ్ చేయడం కోసమే !  ఈ రికార్డ్ చేసుకోవడం అంటే నోట్స్ ఎట్లా రాసుకోవాలో ,మీరు ఇప్పటికే తెలుసుకున్నారు కదా !  ఆ పధ్ధతి ని అనుసరించడమే ! పాఠం లో వచ్చే , ముఖ్యమైన ( సాంకేతిక )  పదాలను కూడా,  మర్చి పోకుండా రాసుకోండి !  
Review : ఇక నాలుగో R  అంటే రివ్యూ చేసుకోవడం : అంటే  పునశ్చరణం చేసుకోవడం ! ఈ దశలో , మీరు నోట్స్ లో రాసుకున్న పాఠం  లోని విషయాలను ఒక సారి చూసుకోవడం చేయాలి !   మీరు చదివిన పాఠానికీ , మీరు రాసుకున్న నోట్స్ కూ , పొంతన ఉందా లేదా అని సరి చూసుకోవాలి ! అంటే , పాఠం లో ఉన్న అన్ని ముఖ్య విషయాలూ , నోట్స్ లో  మీరు ఒక పధ్ధతి లో రాసుకున్నారా లేదా అని చూసుకోవడం !  ఏవైనా ఇంకా ఆ నోట్స్ లో చేర్చాలా ? అనే విషయం కూడా అప్పుడు నిర్ణయించు కోవాలి ! మీ నోట్స్ కేవలం ముఖ్యమైన విషయాలు క్లుప్తం గా రాయబడి , మీరు తరువాత సులభం గా గుర్తు తెచ్చుకోడానికి  అనుకూలం గా ఉండాలే కానీ , చాలా వివరం గా   ప్రింటు లో కాక , చేతి రాత తో రాసిన పాఠ్య పుస్తకం లా ఉండ కూడదు !  
మొదట్లో , పైన వివరించిన విధం గా చదవడం , కొద్దిగా శ్రమ గా నే అనిపించ వచ్చు !   కానీ మీరు ఒకే పధ్ధతి S Q R 4.  ( ఈ పద్ధతే  కూడా అవసరం లేదు ! ) అలవాటు చేసుకుని , దానినే ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటే , మీకు పాఠాలు నేర్చుకోవడం అతి సులభం అవుతుంది !  విజయం  కూడా మీదే అవుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: