Our Health

చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 29, 2013 at 5:50 సా.

చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ?  

పోలికలు మంచిదే ! :
క్రితం టపాలో, నోట్సు ఎట్లా తీసుకోవాలనే విషయం చాలా వరకూ తెలుసుకున్నాం కదా !   విద్యార్ధులు, కేవలం వారి కోసమై నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నా , ఇంకొన్ని ముఖ్యమైన విషయాల మీద కూడా దృష్టి పెడితే , వారు రాసుకున్న నోట్సు తో అత్యధికం గా లాభం పొందుతారు ! ఆ విషయాల లో ఒకటి ,  తాము రాసిన నోట్సు ను , తోటి విద్యార్ధుల నోట్సు తో పోల్చుకోవడం. ఇట్లా చేయడం వల్ల అనేకమైన ఉపయోగాలున్నాయి ! సామాన్యం గా , ఒక విద్యార్ధి , కేవలం తను ఒక రోజో లేదా కొన్ని రోజులో , స్కూలు కు కానీ , కాలేజీ కి కానీ వెళ్లక పోవడం వల్లనే , ఇతర స్నేహితుల వద్దనుంచీ , తోటి విద్యార్ధుల నుంచీ ,నోట్సు తీసుకుంటారు !  కానీ ఈ అలవాటును ఒక క్రమ పధ్ధతి లో చేస్తే , అంటే ,  ప్రతి వారమూ , తోటి విద్యార్ధుల నుంచి నోట్సు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి !  ఈ పధ్ధతి తో , తాము మిస్ అయిన ముఖ్యమైన విషయాలను ఇతర విద్యార్ధుల నోట్సు తో  పోల్చుకుని , ఆ పాయింట్స్ కూడా  తమ నోట్సు లో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ! ముఖ్యం గా, తోటి విద్యార్ధులు ఆ పాఠాన్ని ఎట్లా అర్ధం చేసుకుంటున్నారు ? , తమ కన్నా భిన్నం గా ? అని ఒక అంచనా కూడా వేసుకోవచ్చు !  తమ నోట్సు ను ఆ రకం గా ఇంకా బాగా రాసుకోవడం చేయవచ్చు !  వారు పాఠాన్ని వినే సమయం లో ఇంకేవైనా విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలా లేదా అన్న విషయం కూడా వారికి బోధ పడుతుంది , ఇతర విద్యార్ధుల నోట్స్ తో వారి నోట్స్ ను పోల్చుకుంటే !  వారిలో స్నేహ భావం కూడా అలవడుతుంది ! పోటీ స్వభావం కూడా పెంపొందుతుంది !  ఈ పోటీ , కేవలం ఒక ఆరోగ్యదాయకమైన పోటీ గానే ఉండాలి కానీ , అసూయా ద్వేషాలకు  అవకాశం ఇవ్వ కూడదు ! 
సమీక్షించడం ( రివ్యూ ) , మళ్ళీ మళ్ళీ రాసుకోవడం ! మెరుగులు దిద్దడం : 
ఒక సారి,  ప్రతి పాఠం చెప్పే సమయం లోనూ నోట్సు రాసుకోవడం అలవాటు చేసుకున్నాక ,  ఇంకో అతి ముఖ్యమైన విషయం కూడా విద్యార్ధులు ఎప్పుడూ గుర్తు ఉంచుకోవాలి !  అది, నోట్సు రాసుకోవడం  అనేది ఒక్క సారి చేశాక , మీ పని అయి పోయిందని , చేతులు దులుపు కో కూడదు ! అంటే ఒక సారి రాసిన నోట్సు , ఫైనల్ కాకూడదు !   ఇంటికి వచ్చాక , ఆ నోట్సు ను అనేక సార్లు సమీక్షించుకోవాలి ! అంటే , ఆ విషయం మీద, మీరు రాసుకున్న నోట్సు , సంపూర్ణం గా ఉందో లేదో , తరచి చూసుకుంటూ ఉండాలి !  ఇట్లా చూసుకోవడం, అనేక మార్లు చేయాలి , అవసరమైతే !   ఈ చర్యలో పైన ఉదహరించిన , ఇతర విద్యార్ధుల నోట్సు తో పోలికే కాక ,ఒక పాఠ్య పుస్తకం నుంచి కూడా రిఫర్ చేసి  కొన్ని ముఖ్యమైన  విషయాలను , నోట్సు లో రాసుకోవచ్చు ! అంతే కాక , మీరు రాసుకున్న విషయాలను ఒక  పధ్ధతి లో  ఆర్గనైజ్ చేసుకోవాలి మీరు మీ నోట్సు లో !  ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే , మీరు రాసుకున్న నోట్సు సులభం గా అర్ధం అవుతుంది !   కొన్ని సమయాలలో మీరు కొన్ని పటాలు కూడా చేర్చు కోవలసిన అవసరం ఉండ వచ్చు , మీ నోట్సు లో !   మీరు, మళ్ళీ ,మళ్ళీ, నోట్సు ను రివైజ్ చేసి, కుదించి , మెరుగులు దిద్దుతూ ఉండడం వల్ల , మీకు   మీరు రాసుకున్న నోట్సు లో ఉన్న విషయాలు చాలా వరకు అర్ధం కావడమే కాక , మీరు ఎక్కువ కాలం గుర్తు ఉంచుకో గలుగుతారు కూడా  !  ఇట్లా చేయడం అలవాటు చేసుకుంటే , విద్యార్ధులకు చిన్న తనం నుంచే , తాము ( పాఠం లో ) గ్రహిస్తున్న విషయాలను , తరచి చూసి , సునిశితం గా పరిశీలించే , పరిశీలనా జ్ఞానం కూడా పెంపొందుతుంది !  చదివే ఏ చదువు లక్ష్యం అయినా అదే కదా !   చివరగా , ఇట్లా  మీరు శ్రమ పడి , అనేక రకాలు గా విషయాలను సేకరించి , రాసుకున్న నోట్సు ను  జాగ్రత్తగా , ఒక ఫైల్ లో నో ఫోల్డర్ లోనో  , బైండర్ లోనో పెట్టుకోండి !
నోట్సు   తీసుకోవడం ఎప్పుడూ, ఒక పధ్ధతి గా ఎట్లా చేయాలో సులభం గా గుర్తుంచు కోవడానికి    5R లు అంటే అయిదు R లు :  Record,Reduce, Recite, Reflect, and Review  ఉపయోగ పడతాయి , విద్యార్ధి జీవితం లో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. I m late u know the reason. A very good and interesting series.
    స్పర్ధయా వర్ధతే విద్యా!

  2. ఈ పద్దతిని అనుసరించేందుకు నేను ఒకరి బుక్ ఇంకొకరు చదివే అవకాశం వారిని ఒకసారి కల్పిస్తాను, ముఖ్యంగా 5 వ తరగతి పిల్లలు తమ చేతి వ్రాతని మెరుగుపరచుకొనేందుకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఎదుటి విద్యార్ది తమ రాత అర్దం కాక మాటిమాటికీ టీచర్ దగ్గరికి పోవటం ఈతడు అవమానంగా భావిస్తాడు. ఇదంతా స్నేహభావం తోనే జరగాలి.
    మీరు చెప్పిన నోట్స్ వివరాలు మా పిల్లలకి నేర్పించాను,
    సర్, మీ సేవకి నా ధన్యవాధాలు

  3. టపాలు ఉపయోగ పడుతున్నందుకు సంతోషం ! కేవలం నోట్సు రాయడం గురించే , విద్యార్ధులకు ఒక వారం రోజులు ప్రావీణ్యత ఇచ్చినా , అది ఎంతో ఉపయోగకరం !
    ఆ తరువాత , వారు , ఆ పద్ధతిని అనుసరిస్తున్నారో లేదో , తరచూ గమనిస్తూ , సలహా ఇస్తుంటే , ఇట్టే , అందుకోగలుగుతారు ! లాభం పొంద గలుగుతారు !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: