Our Health

చదువుకోడం ఎట్లా? 13. నోట్స్ ఎట్లా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 28, 2013 at 2:06 సా.

చదువుకోడం ఎట్లా? 13. నోట్స్ ఎట్లా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ? 

An Image On How To Take Good Notes In School.

నిన్నటి టపాలో నోట్స్  తీసుకోవడం ఎందుకో తెలుసుకున్నాం కదా ! మరి నోట్స్ ఎట్లా తీసుకోవాలి ?  
కావలసినవి : చిన్న క్లాసులలో : రెండో మూడో పెన్నులూ లేదా పెన్సిళ్ళూ  , ఇంకా రాసుకునేందుకు  తెల్ల కాగితాల నోటు పుస్తకం  ఇవి కనీస అవసరాలు !  పెద్ద క్లాసులు , లేదా కాలేజీ లో లెక్చర్లకు :  కూడా పెన్నులూ , నోట్ పుస్తకాల తో పాటుగా , మీరు లెక్చర్ ను కనుక టేప్ చేసుకోవాలని అనుకుంటే అదోకటీ ! కానీ ముందుగా లెక్చరర్ అనుమతి తీసుకోవాలి !   దీనివల్ల ఉపయోగం : లెక్చర్ నోట్ చేసుకొనే సమయం లో ఏమైనా  ముఖ్యమైన వివరాలు  నోట్ చేసుకోలేక పోయినా , తరువాత టేప్ విని , వాటిని మననం చేసుకోవడం కానీ , లేదా మళ్ళీ నోట్స్ లో నోట్ చేసుకోవడం కానీ చేయవచ్చు !  ఏ క్లాసు లో ఉండి చదువుకుంటున్నా , ముఖ్యం గా కావలసినది , మీ కృత నిశ్చయమూ , మీ ఏకాగ్రతా , మీ ఓపికా కూడా !  ఇంకో ముఖ్య విషయం :  క్లాసు లో చెప్పే పాఠం  వినపడక పోయినా , లేదా అర్ధం కాక పోయినా , చాలా మంది విద్యార్ధులు వారి నోట్ పుస్తకం లో,  బొమ్మలు గీస్తూ ( నేనూ చేశాను, కొన్ని క్లాసులలో ఇట్లా ! )  , లేదా అమ్మాయిలయితే , ముగ్గులు వేసుకుంటూ నో కాల యాపన చేస్తూ ఉంటారు !   కానీ అనుభవ పూర్వకం గా తెలుసుకున్నదేంటంటే , ఇది మంచి పధ్ధతి కాదు అని !   క్లాసు లో పాఠాన్ని వీలైనంత అర్ధం  చేసుకోవడానికి  అన్ని విధాలా ప్రయత్నించాలి !  కొన్ని సమయాలలో పాఠం అర్ధం కాక పోయినా , ఆ పాఠం లో మనకు కనీసం , కొత్త పదాలు తెలుస్తాయి !  
శ్రవణ కుమారులవ్వాలి, విద్యార్ధు  లందరూ ! :  అంటే మీరు చెప్పే మాటలను శ్రద్ధ గా వినడం అలవాటు చేసుకోవాలి !  ఒక తరగతి లో కానీ , లెక్చర్ హాలు లో కానీ , అనేక రకాలైన శబ్దాలు అవుతూ ఉంటాయి ! కొన్ని అనివార్యమూ , కొన్ని కావాలని చేసే శబ్దాలూ !  బోధించే వారి గొంతు నే ఏకాగ్రత తో వినడం అలవాటు చేసుకోవాలి ! మిగతా శబ్దాలను మీరు, మనసు తో ఫిల్టర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి !  ఎందుకంటే , చెవులు సహజం గానే , వినబడే శబ్దాలనన్నిటినీ , రిసీవ్ చేసుకుంటాయి !  ఈ చర్య కు కేవలం మనం చెవులప్పగించి వినడమే ! కానీ ఏ శబ్దాలను  పట్టించుకోవాలి ? ! అంటే , మనసుకు పట్టించుకోవాలి , వేటిని  పట్టించుకోకూడదు ? అనే విషయాలను మనమే నిర్ణయించుకోవాలి !  అనేక రకాల అవరోధాలు ఉన్నా కూడా , ఏకాగ్రత తో కేవలం లెక్చరర్ చెప్పేదే , లేదా టీచర్ చెప్పేదే వినే  అలవాటు చేసుకోవాలి ! అంతే కాకుండా , కేవలం బోధించేది విని , త్వర త్వర గా అంతా రాసుకోవడానికి తంటాలు పడనవసరం లేదు !  ఆ  ప్రయత్నం లో , వినడం శ్రద్ధగా వినలేక పోవచ్చు ! కానీ శ్రద్ధ గా విని , అవసరమైన పదాలనే ,లేదా వాక్యాలనే రాసుకోవాలి !  ప్రతి సబ్జెక్ట్ లోనూ కొన్ని కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి , ప్రతి విషయం లోనూ ! ఆ పదాలను తప్పని సరిగా నోట్ చేసుకోవాలి  !  
మీదైన శైలి ని  అభివృద్ధి చేసుకోండి ! ( అదరాలి మీ స్టైల్ !  )  :   నోట్స్ తీసుకోవడం ఏ ఒక్కరి ఆస్థీ  కాదు ! ఏ ఒక్కరి హక్కూ కాదు !  విద్యార్ధులు తరచు గా ‘   ఆ అమ్మాయి నోట్స్ బాగా రాస్తుంది ! అనో , లేదా , ఆ అబ్బాయి బాగా రాస్తాడు ‘ అనో  ఇతర విద్యార్ధులను  అభినందించే పని లోనే ఉంటారు , కానీ వారంతట వారే ఆ పని  చేయరు ! అది చాలా పొరపాటు ! విద్యార్ధులంతా కూడా చక్కటి నోట్స్ రాయ గలరు ! ఎందుకంటే ప్రతి ఒక్కరి కీ రెండు చక్కగా పని చేసే చెవులూ , చక్కగా రాయగలిగే ఒక చేయీ ఉన్నాయి కనుక !  వాటికి మీ మనసు ను తోడు చేస్తే,  మంచి నోట్స్ మీదే ! కొన్ని సూచనలు : నోట్స్ లో టీచర్ చెప్పే ప్రతి విషయాన్నీ రాసుకోవాలనే ప్రయత్నం చేయకండి , ఇది చాలా శ్రమ తో కూడినదే కాక ,  మీ ఏకాగ్రతను కూడా పరీక్షిస్తుంది !  2. మీ కోసమే , మీరు సంక్షిప్త పదాలను లేదా అక్షరాలను రాసుకోండి ! అంటే     భారత దేశం అని  బోధిస్తూ ఉంటే , Ind  అని నోట్ చేసుకోవచ్చు ! అట్లాగే,   విద్యార్ధులు అని బోధిస్తూ ఉంటే , stu. అని నోట్ చేసుకుని గుర్తుంచుకోండి !  ఈ రకం గా చేస్తే , మీరు విషయాలు అన్నీ నోట్ చేసుకోగలుగు తారు ! ఉన్న సమయం లో ! తక్కువ శ్రమ తో !  కానీ ఈ  సంక్షిప్త పదాలు , ఇంటికి వచ్చాక,  మీకు ఆ పదం పూర్తిగా గుర్తు వచ్చేయాలి !  ఇంకొన్ని ఉదాహరణలు : mathematics  ను maths అనీ ,  chemistry ని chem  అనీ ,  relative  density అని ఉంటే  re.d  అనీ రాసుకోవచ్చు కదా !  ఈ రకం గా, పెద్ద పెద్ద వాక్యాలకు షార్ట్ ఫాం లు మీరే ఏర్పరుచుకుని , నోట్స్ తీసుకునే సమయం లో వాటిని వాడితే ,  కాస్త మెదడు కు మేత లా ఉంటుంది !  అంతే కాకుండా , మీరు బోధించే విషయాలన్నీ కూడా గ్రహించ డానికి అవకాశం హెచ్చుతుంది ! 
 
 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. నోట్స్ చిన్నగా గుర్తుండేలా ఎలా రాసుకొవచ్చో టిప్స్ చాలా చక్కగా వివరించారు,
    డాక్టర్ గారూ ఈ సూచనలు ఉపాద్యాయులకే తెలియకపోయినా అతిశయోక్తి లేదు,
    ధన్యవాదాలు మీ సూచనలకు.

  2. తెలిసినా, తెలియక పోయినా , చాలా మంది ఉపాధ్యాయులు , కేవలం, విద్యార్ధులను పరీక్షా పత్రం లో, ప్రశ్నలు అడిగి , వారు సమాధానాలు రాయలేక , ఇబ్బంది పడుతూ ఉంటే, సరదా చూస్తూ ఉంటారు. వారికి తోచిన మార్కులు వేసి , విద్యార్ధులలో ఆత్మ న్యూనతా భావాన్ని, పండిస్తారు ! ఒక రకం గా దానిని శాడిజం అనవచ్చు !
    ప్రశ్నకు సమాధానం ఎట్లా రాయ వచ్చో , విద్యార్ధులకు వివరించడం లేదంటే అతిశయోక్తి కాదేమో !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: