Our Health

చదవడం ఎట్లా ? 9. సమయ పాలన ! ( టైం మేనేజ్ మెంట్ )

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 22, 2013 at 8:27 సా.

చదవడం ఎట్లా ? 9. సమయ పాలన ! ( టైం మేనేజ్ మెంట్ ) 

క్రితం టపాలో చదువుకోవడానికి టైం చార్ట్ లు వేసుకోవడం, విద్యార్ధికి  ఎంత ఉపయోగ కరం గా ఉంటుందో తెలుసుకున్నాం కదా !  ఈ టైం చార్ట్ వేసుకోవడం , బాల బాలికల బాల్యం నుంచీ , నేర్పించాలి తప్పని సరిగా , వారి తల్లి దండ్రులు , కేవలం పరీక్ష ల ముందు రోజుల్లో కాక !   అట్లా చేస్తే , కేవలం చదువు కే కాక , బాల బాలికలు , వారి జీవితం లో చేయ బోయే ప్రతి పనినీ ఆలోచించి, తదనుగుణం గా ఒక ప్లాన్ లేదా పధకం వేసుకుని , దానిని ఆచరించడానికి అలవాటు పడతారు !  అంటే ,  వారు మూడు చేపల కధ లో దీర్ఘ దర్శులవుతారు ! (  మూడు చేపల కధ తెలియని వారికి :   ఒక చెరువులో ఒక మూడు చేపలు చాలా స్నేహం గా ఉంటాయి ! ఆడుతూ పాడుతూ హాయిగా కాలం గడుపుతూ ఉంటాయి !  ఆ ఏడాది వానలు పడలేదు ! చెరువు ఎండడం మొదలు పెట్టింది !   ఆ మూడు చేపలలో ఒక చేప దీర్ఘ దర్శి  , మిగతా చేపలతో  ‘  మనం ఇంత కాలం సఖ్యత తో  ఆడుతూ పాడుతూ , ఈ చెరువులో ఆనందం గా గడుపుతున్నాం ,  మీరు గమనించారో లేదో , ఈ ఏడాది , వానలు సరిగా పడక పోగా, ఎండలు కూడా మండి పోతున్నాయ్ ! తిండి లేక ఎక్కువ మంది  బెస్త వారు మన చెరువు కే వస్తున్నారు మనల్ని పట్టుకోవడానికి , తేలిక గా దొరుకుతామని ! ఈ  పరిస్థితి విషమించే లోగా మనం, ఇంకో లోతైన చెరువు కు మనమంతా ఇప్పుడే వెళ్ళక పొతే , మన మనుగడ కష్టం ‘ అని ప్రబోధం చేసింది !  మిగతా రెండు చేపలూ అందుకు ఒప్పుకోలేదు !  రెండో చేప ‘ ప్రాప్త కాలజ్ఞుడు ‘  ,  ‘ ఆ పరిస్థితి వస్తే అప్పుడు చూసుకుందాం లే ‘ ! అని ధీమా చూపింది !  ఇక మూడో చేప, ‘  హ్రస్వ దృష్టి ‘  ‘ నీవు చెప్పేది నాకు నమ్మ దగ్గది గా అనిపించట్లేదు ‘ !  అని ఇంకా ధీమా గా,  ఒక్క  ఎగురు ఎగిరింది  ఆ చేరువులోనే !  దీర్ఘ దర్శి ,  మిగతా చేపలతో ఇక పెట్టుకోకుండా ,  పక్క చెరువులోకి  చేరుకుంది !  కొన్ని రోజులయ్యాక , బెస్త వారు ఆ చెరువు మీద వలలతో దండెత్తారు !    మొదట, నిర్ణయం తీసుకోకుండా  వాయిదా వేసిన  ‘ ప్రాప్త కాలజ్ఞుడు ‘ ,  చెరువులో అలల మీద బెస్త వారి వలలు చేసే సందడి కి అప్రమత్తమై ,  వలలో చిక్కుకోక ముందే , వల నుంచి చెంగున ,  ప్రక్కన ఉన్న చెరువు లో దూకింది !   ఇక చెరువులో వేసవి ఎండలకు , చెరువు అడుగుకు చేరుకొని , ఆద మరచి,  సేద తీరుతున్న  ఉన్న హ్రస్వ దృష్టి , అప్పనం గా వలలో ఊయల ఊగుతూ , బెస్తవారి కి,  ఆ పూటకు ఆహారం అయింది ! ) చిన్న కధే అయినా , సమయ పాలన ప్రాముఖ్యత ను చక్కగా వివరిస్తుంది కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. ఇలాంటి కథలు పిల్లలకి సమయ విలువ గూర్చి చెప్పటానికి పనికొస్తాయి.
    మీ అమూల్యమైన టపాకి అభినందనలు.

  2. Good story from Bhaaratam. I v given this story in detail in my blog

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: