చదువుకోడం ఎట్లా? 6.

ఆలస్యం, అమృతం విషం ! : ( దీని అర్ధం , ఆలస్యం అమృతమూ ,విషమూ కూడా అని కాదు , ఆలస్యం చేస్తే , అమృతం కూడా విషం అవుతుంది అని ! ) చదువుకునే విద్యార్ధులకు సమయ పాలన గురించి , వారికి తెలిసినా , తెలియక పోయినా , తెలియ చేయ వలసిన బాధ్యత , బోధించే గురువుల మీద ఉంది ! సామాన్యం గా , బడికి వెళ్ళే విద్యార్ధులను ‘ చిన్న క్లాసులే కదా ‘ చిన్న పిల్లలు కదా ‘ కిండర్ గార్టెన్ ‘ చదువులే కదా ! అనే ఒక రకమైన ముద్దూ , ఇంకో రకమైన నిర్లిప్తతనూ, తల్లి దండ్రులూ , ఇతర పెద్దలూ , ఏర్పరుచుకుంటారు ( ఉపాధ్యాయులు కూడా! ) ఒక రకం గా, ఆ భావనలన్నీ యదార్ధాలే ! కేవలం ఆకారణం చేత , వారికి సమయం యొక్క ప్రాముఖ్యతా , సమయ పాలనా , నేర్పించడం మానకూడదు ! సమయ పాలన తో ముఖ్యం గా అలవాడే ఒక గుణం , క్రమ శిక్షణ ! మనం దైనందిన జీవితాలలో , సమయానికి పనులు చేయక పొతే , పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఊహించుకోండి ! ఈ సమయ పాలన, చిన్న తనం నుంచీ , బాల బాలికలకు ఒక ముఖ్య విధి గా నేర్పించాలి ! సమయ పాలనకూ, క్రమ శిక్షణ కూ, ప్రతి విద్యార్ధీ , అలవాటు పడాలి , లేదా ప్రతి అధ్యాపకుడూ , వారికి ఆ గుణం అలవాటు చేయాలి ఎందుకంటే , మానవుల కందరికీ , ప్రతి రోజు లోనూ ఉండేవి 24 గంటలే !
మరి చదువు లోనూ , పరీక్షలకు సిద్దమవడం లోనూ , ఈ సమయ పాలన ప్రాముఖ్యం ఏమిటి ? : చిన్న తనంలో, తల్లి దండ్రులు తరచూ తమ సంతానానికి చెప్పే మాటలు, ” ఏరోజు పాఠాలు, ఆ రోజే నేర్చుకో ” అని ! ఇది చాలా చిన్న సలహా అయినా , ఎంతో విలువైన సలహా ! ఈ సలహాలో నిగూఢ మైన అర్ధం , ‘ ఆలస్యం చేయవద్దు’ అని ! ఒక క్రమమైన పద్ధతిలో, రోజూ కొంత సమయం కేటాయించి , చదువుకుంటే , చదివినది అర్ధం అవడమే కాక , మస్తిష్కం , అంటే మెదడు లోకి ‘ ఎక్కుతుంది ‘ ఈ మెదడు లోకి ఎక్కడం అంటే ఏమిటి ? : మన జ్ఞాపక శక్తి నిలువ లోకి , చదివినది వెళుతుంది ! అంటే జ్ఞాపక శక్తి స్టోర్ అన్న మాట ! ఈ ‘ స్టోర్’ లోకి వెళ్ళిన విషయాలు ఒక పట్టాన ‘ చెరిగి పోవు ‘ ! ( మనం, ముందు ముందు , మనం చదివింది, బాగా మెదడులో ‘ ముద్రింప ‘ బడడానికి ఏం చేయాలో ( అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ చేసుకోడానికి ఏం చేయాలో ) కూడా తెలుసుకుందాం ! )
ఇక పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ , ఒక్కో విద్యార్ధీ , త్వర త్వరగా , రెండు వారాలలో చదవ వలసినది , ఒక వారం రోజుల లోనో , లేదా నెల లో చదవ వలసినది , రెండు వారాల లోనో చదివేసి ‘ తమ పని పూర్తి ‘ అయిందనిపించుకుంటారు ! కానీ వారు చేస్తున్నది, వారికి మానసికం గా తృప్తి ఇస్తుందేమో కానీ , చదివిన సంగతులు మాత్రం , మెదడు లో ఎక్కువ కాలం నిలువవు ! తీరా పరీక్ష రోజున , చదివిన విషయాలన్నీ కూడా స్పష్టత లోపించి , దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆకాశం లా అవుతుంది పరిస్థితి ! పరీక్ష సరిగా రాయకుండా , ఆ తరువాత వారి కన్నీరు ‘ వర్షించి నా ‘ కూడా వారికి మార్కులు ఎక్కువ రావు కదా ! ఫలితం , విఫలమవడమో ( అంటే ఫెయిల్ అవడమో ) లేదా చాలా తక్కువ మార్కులు రావడమో జరుగుతుంది కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
సర్, సమయపాలన గూర్చి చాలా బాగా చెప్పారు, మీరన్నట్లు ఇది చిన్న పిల్లల్లో అవసరం లేదనుకుంటారు కానీ వారికే అవసరం లేకుంటే వారికి టైం విలువ తెలీదు.
నేను ప్రతి రోజూ ప్రేయర్ లో ఓ చిన్న్ని కథ చెప్తాను, అది మిస్ కాకూడదని చిన్న పిల్లలు తల్లిని తొందరపెట్టి స్కూల్కి టైం కి వస్తారు.