Our Health

చదువుకోడం ఎట్లా? 5.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 16, 2013 at 9:43 సా.

చదువుకోడం ఎట్లా? 5. 
 ( ‘ విజయం సాధించాలనే తపన నాలో బలం గా ఉంటే , అపజయం నన్ను ఎప్పుడూ  ఓడించ లేదు ! ‘ ) 
స్వీయ విమర్శ ,నిర్మాణాత్మకం గా ఉండాలి ! :  క్రితం టపాలో మనం తెలుసుకున్నాం , విద్యార్ధి ఎప్పుడూ , తన చదువు విషయం లో ఆశావహ దృక్పధం తో  ఎందుకు  ఉండాలో !  తెలియని సంగతులు తెలుసుకోవడం తప్పు కాదు !  పాఠాలు త్వరగా గ్రహించ లేక పోవడమూ తప్పు కాదు !  కానీ , చదివిన విషయాలు అర్ధం కావడం లో జాప్యం జరుగుతూ ఉంటే , అందుకు తమను తాము నిందించు కోవడమూ ,  ‘తమకు ఎప్పుడూ చదువు అబ్బదు ‘ అనే  నిరుత్సాహ పూరితమైన ‘ ముద్ర ‘ వేసుకోవడం తప్పు !  మనకు మన మా తృ భాష లో( ఆ మాటకొస్తే , ఏ భాష లోనైనా ) ఒక వాక్యం రాయాలంటే , ముందు గా చేయవలసినది , ఆ భాష లో ఉన్న అక్షరాలను తెలుసుకోవాలి ! ఆ తరువాత , ఆ అక్షరాలతో , పదాలు రాయడం నేర్చు కోవాలి ! ఆ తరువాత , ఆ పదాలతో వాక్యాలు రాయడం  నేర్చుకోవాలి ! ఇట్లా, ప్రతి  సబ్జెక్ట్ లోనూ , ఆ సబ్జెక్ట్ కు చెందిన భాష ఉంటుంది ! అది,  అక్షరాలకు బదులు గా పదాలు , అంటే, సాంకేతిక పదాలు గా ఉంటుంది !  ఆ పదాలను తెలుసుకోకుండా , ఆ సబ్జెక్ట్ ను  పూర్తి గా అర్ధం చేసుకోవడం కష్టమే మరి !  పైన ఉన్న ఉదాహరణలు ఎందుకు రాయడం జరుగుతుందంటే ,  నేర్చుకోవడం అనేది,  అనేక దశలు గా జరుగుతుంది ! ప్రతి దశా అతి ముఖ్యమైనదే !  విద్యార్ధులు , కేవలం వారిని వారు నిందించు కోకుండా , ఏ దశ లో పొరపాట్లు జరుగుతున్నాయో గ్రహించాలి ! అంతే కానీ,  వారు  ‘ నాకు ఇక చదువు రాదు ‘  అనే విపరీతమైన నిరాశా  ఫలితాలు, వ్యాఖ్యానాలూ , ఆపాదించుకో కూడదు ! 
లోపాలు, పొరపాట్లు , శాశ్వతం కాదు ! : చాలా మంది విద్యార్ధుల లో తరచూ కలిగే ఇంకో సాధారణ అభిప్రాయం  :  కొన్ని వారాల లో పరీక్ష ఉంటే  ‘ నా పరిస్థితి అధ్వాన్నం గా ఉంది ఇప్పుడు , నాకు చదవడానికి టైం లేదు ఇప్పుడు , పరీక్షలు దగ్గర పడుతున్నాయి, నేను అందుకోలేను , పరీక్ష సరిగా రాయ లేను ‘ అని  ,  పూర్తి గా నిరాశా దృక్పధం తో , మిగతా సమయాన్ని కూడా , చదవ కుండా , దుర్వినియోగం చేస్తారు !  ఈ మానసిక పరిస్థితి నుంచి జరిగి, ‘ నేను కాస్త ఆలస్యం గా మొదలు పెడుతున్నాను , పరీక్షలకు చదవడం , అందువల్ల నేను ఇంకా జాగ్రత్త గా చదువుకోవాలి , నాకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ‘ అనే ఆశావహ దృక్పధం తో ఇంకొద్దిగా శ్రమ పడడానికి పూనుకోవాలి !  ఒక వేళ ,  బాగా శ్రమ పడ్డా , పరీక్ష లో ఫలితాలు సరిగా రాక పొతే  ‘ నేను ఎప్పుడూ ఇంతే !  పరీక్ష లు చెడ గొడతాను ‘ అనే శాశ్వత నిరాశా ఫలితాల ముద్ర తమంత తామే వేసుకోకూడదు !  నింపాది గా, జరిగిన సంఘటనను విశ్లేషించుకుని , అవసరమైతే , తల్లి దండ్రులతో నో , లేదా ఉపాధ్యాయులతోనో , చర్చించి ,  ‘ ఆ లోపాలు ఉండడం వల్ల , నేను అనుకున్నంత బాగా చేయలేక పోయాను పరీక్షలో ‘  ఆ లోపాలు సరి దిద్దుకోవడం , నా చేతుల్లోనే ఉంది, ఈ సారి ఇంకా ఎక్కువ దీక్షతో ప్రయత్నిస్తాను’  ! అని  ప్రతిజ్ఞ పట్టాలి ! విద్యా సరస్వతి, చేరదీసి, ఆదరించిన వారెవరి దగ్గరకైనా వస్తుంది ! ధనికులూ , పేదలూ అనే తారతమ్యం లేదు ఆమెకు !  ‘ నేను ఎప్పుడూ ఇంతే , సరిగా చదవను ‘  అని,  తమకు తామే తీర్పు ఇచ్చుకున్న  వారు కేవలం,  ఆ సరస్వతీ దేవిని ‘ నా దగ్గరకు రావద్దు తల్లీ ‘ అంటున్నట్టే  కదా !  
పోలికలు, ఆరోగ్యకరం , ప్రమాద కరం కూడా ! :   చదువు కు పోటీ ఉండడం మంచిదే , అది ఒక ఆరోగ్య కరమైన పరిస్థితి !  పోటీ ఉంటే , చదువు కోవాలనీ , బాగా చదువుకోవాలనీ , ఉత్తేజం కలుగుతుంది !  మిగతా పరిస్థితులన్నీ , సమానం గా లేక పోయినా , చిన్న వయసులో , తన ఈడు వారు చదువు కుంటూ ఉంటే , ఎట్లాగైనా తామూ చదువుకుని , వృద్ధి లోకి రావాలనే తాపత్రయం , పట్టుదలా వస్తాయి , పెరుగుతాయి కూడా ! కానీ, ఈ పోటీ ఎప్పుడూ , ఇంకా ,ఇంకా పట్టు దలతో , చదువు కోవాలనే దీక్ష ను శక్తి వంతం చేయాలి. ఉత్సాహాన్ని నీరు కారుస్తూ , నిరాశా దృక్పధం లోకి నెడుతూ , ఆత్మ న్యూనతా భావాన్ని కలుగ చేయకూడదు !  అంటే,  పోటీ, విద్యార్ధులలో, పట్టుదలను పెంచేది గా ఉండాలి కానీ  చదువు మీద తమ ‘ పట్టు ‘ సడలించి , పలాయనం చిత్తగింప చేసేది గా ఉండ కూడదు ! అందుకే , ఎక్కువ శ్రమ పడి చదువు తున్నప్పుడు , ఇతర విద్యార్ధులతో , పోల్చు కోకూడదు ! తమ ఏకాగ్రత అంతా, చదువు మీదా వచ్చే పరీక్ష మీదా మాత్రమే కేంద్రీకరించాలి !   
‘ నా శక్తులన్నీ ఉపయోగించి , వీలైనంత బాగా చేస్తాను నేను , చదువు లోనూ , పరీక్ష లోనూ ‘ అనే కృత  నిశ్చయమే  ఎప్పుడూ విద్యార్ధి మనసులో ఉండాలి , ఒక మంత్రం లా !   ఆ మంత్రం , ఎంతో శక్తి వంతం గా వారికి మేలు చేస్తుంది ! వారి జీవితాంతం ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 1. పోటీ చదువులో ఎలా ఉండాలో, ఎప్పుడు ఉండాలో చక్కగా వివరించారు.
  ఇప్పటివరకూ నాఅకు తెలిసిన పరిగ్నానంతో నా పిల్లలకు (నా విద్యార్ధులకు) సలహా ఇచ్హేదాన్ని, ఇక ముందు మీ వంటి వారి సలహాలనే వారికి ఉపయోగ పడేలా చూస్తాను.

  • టీచర్లను విద్యార్ధులు , బోధకులు గానూ, తల్లి దండ్రులు గానూ , స్నేహితులు గానూ చూస్తారు ! ఆయా పాత్రలలో కూడా ‘ జీవించి ‘ బోధన చేయడం, టీచర్ల నైపుణ్యం మీదే ఉంటుంది ! మీ సలహాలనే , మీ ( మంచి ) బోధన తో కలగలిపితే ఫలితాలు బాగా ఉంటాయి !

 2. ఇష్టపడి చదువుకుంటే సమస్యలేదు కష్టపడి చదువుకుంటేనే సమస్య.

 3. సర్, నా పిల్లలు నన్ను అమ్మగా చూస్తారు, వారి పరిసరాలలో, పరిధిలో ఉన్న ప్రతి ప్రాణి గూర్చి వారికి అవగాహన కలిగిస్తాను. ముఖ్యంగా నాకు కావల్సింది వారు దయాగుణం కలిగి ఉండటం.
  దానికోసం మొదటగా నేను ప్రయోగించిన బాణం ” సిద్దార్ధుని హంస”, సిబి చక్రవర్తి ” వంటి కథలు.
  మా కాలనీలో పక్షులకూ, కుక్కలకూ, ఎవరైనా హానీ కలిగిస్తే వీళ్ళు వారిస్తారు, వీలుకాని పక్షము లో నా దగ్గరికి వస్తారు,

  మీ పోస్ట్స్ చూసిన తరువాత నేను వారికి నేర్పాల్సింది చాలా ఉందని తెల్సింది, (ముందుగా నేను తెలుసుకున్నాను).

  మీ టపాలు నేను చదివి అవగాహన చేసుకొని, ఏ విదంగా చెప్తే వారిని ఆ మాటలు ఆకర్షిస్తాయో ఆ శైలిలో వారికి వివరిస్తున్నాను.
  మీ టపా నుండి చాలా విషయాలు ఉపయోగించుకుంటున్నాను అనటం అతిశయోక్తి కాదు,
  నా బిడ్డల (విద్యార్ధుల) తరపున మీకు ధన్యవాదాలు.

  • మీ కృషి అభినందనీయం ! టపాలు ఉపయోగ పడుతున్నందుకు సంతోషం ! వివిధ వయసుల
   విద్యార్ధులకు , ప్రత్యేకం గా టపాలు వేయడం కష్టమైన పని ! ప్రత్యేకం గా ఏవైనా
   సూచనలూ , సలహాలూ ఉంటే , తెలియ చేస్తూ ఉండండి , సమయానుకూలం గా ప్రయత్నిస్తాను
   .

 4. సర్, మీ టపాలలోనే నాకు కావలసిన సమాచారాన్ని సేకరించుకోగలుగుతున్నాను,
  మరీ చిన్న పిల్లలకు (నర్సరీ) ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అభినయంతో కలిపి చెప్తాను , జంతువులూ, తిండి పదార్దాలూ పాత్రలుగా సృష్టించి చెప్తాను.
  నాకు ఎలాంటి సందేహాలు వచ్చినా అడుగుతాను, మీ సహకారానికి మరోమారు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: