చదువుకోడం ఎట్లా ? 4.
( పైన ఉన్న చిత్రం పరిశీలించండి : బీహారు లో ఒక గ్రామం లో , ఒక నిరు పేద కుటుంబం లో , బాలుడూ, బాలికలు , అమర్చిన అక్క లైటు వెలుతురు లో , ఒకే మంచం మీద ముగ్గురూ , ఎంత దీక్షతో చదువుకుంటున్నారో ! చదువుకోవాలనే వారి సంకల్పం ముందు , చదివే స్థానమూ , చదివే సమయమూ , పట్టించు కొనవసరం లేదు కదా ! వారిని చూస్తూ , అంత పేదరికం లోనూ , వారి తండ్రి పొందుతున్న ఆనందం ఎంత స్వ చ్చం గా ఉందో ! )
క్రితం టపాలలో చదువు కోడానికి అనుకూలమైన సమయం, స్థానం గురించి తెలుసుకున్నాం కదా ! అవి సామాన్యమైన అనుకూల సమయాలూ , స్థానాలూ ! కానీ భౌతిక శాస్త్రం లో ఎన్నో నూతన ఆవిష్కరణలకు కారకుడైన మైకేల్ ఫారడే , తాను పని చేసే పుస్తకాల దుకాణం లో ఉన్న పుస్తకాలను ఔపోసన పట్టేశాడు ! స్థానం అనుకూలం గా లేక పోయినా, జిజ్ఞాస బలం గొప్పది అయి , పురోగమింప చేసింది , ఫారడే ను ! మరి మనకు తెలిసిన ఇటీవలి విద్యా భగీ రధుల గురించి మనం తరచూ , వార్తా పత్రికలలో చదువుతూనే ఉంటాము ! ఉదాహరణకు కొన్ని : 1. పదిహేనేళ్ళ అమ్మాయి , మన ఆంధ్ర ప్రదేశ్ లో , ఒక జిల్లాలో , తండ్రికి ఒకతే కూతురు ! తండ్రి కి సహాయం చేస్తూ , పొలం లో అరక దున్నుతూ చదువుకుని , పదవ తరగతిలో స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంది ! ఐ ఏ ఎస్ టాపర్ ఒక అమ్మాయి కూడా , తన తండ్రి మరణించిన పదో రోజు కూడా ఐ ఏ ఎస్ మెయిన్స్ పరీక్షలు రాసి దేశం మొత్తం మీద టాపర్ గా విజయం సాధించింది ! చదివి, సాధించాలనే , కృత నిశ్చయం ముందు , సమయాలూ , స్థానాలూ దిగదుడుపే , అంటే , ఏ సమయమూ , ఏ స్థానమూ అనే విషయాలు పెద్దగా పరిగణన లోకి రావు !
ఇక చదువుకోడానికి కావలసిన కనీస వస్తు సామగ్రి ఏమిటి ? : ముఖ్యం గా అవసరమైన పుస్తకాలు , నోట్ బుక్స్ , పెన్నులు మొదలైనవి ! ఏకాగ్రత కు భంగం కలిగించే , సెల్ ఫోనులూ , మ్యూజిక్ సిస్టం లూ , కంప్యూటర్ లూ , చదివే సమయం లో దూరం గా ఉంచడం మంచిది ! కనీసం మిగతా వ్యాపకాల వైపు దృష్టి మళ్ళించ నంత వరకూ ! ప్రత్యేకించి , క్రింది తరగతులు చదివే విద్యార్ధులకు , కనీస అవసరాలు సరిపోతాయి ! ముందు ముందు , చిన్న తరగతుల నుంచీ కూడా అధునాతన సాంకేతిక సామగ్రి ని ఉపయోగించడం సాధారణ మూ , తప్పని సరీ అవుతుంది ! అప్పుడు విద్యార్ధులు కేవలం చదువుకోడానికే , ఆ గ్యాడ్ జెట్ లను ఉపయోగించు కోవడం అలవాటు చేసుకోవాలి ! కనీసం చదుకు కునే సమయం లో !
ఆశావహ దృక్పధం ! : చదువు ,విద్యార్ధికి శాపం అవకూడదు ! తెలియనివి తెలుసుకోవడమే చదువు ! అందుకు విద్యార్ధి మానసికం గా సిద్ధ మయి ఉండాలి ! అంటే , చదువును ఒక గుది బండ లా భావించకుండా , ఆశావాద దృక్పధం తో అంటే పాజిటివ్ యాటి ట్యూ డ్ కలిగి ఉండాలి ! చదువుతున్నంత కాలమూ ! ప్రత్యేకించి , కష్టమనిపించిన సబ్జెక్ట్ లు చదువుతున్నప్పుడు , ఈ ఆశావాద దృక్పధం ఎంతగానో తోడ్పడుతుంది ! ఈ దృక్పధం తో అనేక మెళుకువలు తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది ! దానితో అతి కష్టమైన సబ్జెక్ట్ లు కూడా సులభం అవుతాయి ! నిరాశ గా చదివే విషయాన్ని యాదాలాపం గా చదువుతూ ఉంటే , ఆ చదువు వంట బట్టక పోగా , రాను రాను ,ఇంకా కష్ట మవుతుంది, నేర్చుకోవడం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
చాలా మంది విద్యార్దులలో చదువు మీద విపరీతమైన ఇష్టం ఉండీ, చదవలేకపోతున్నారు,
వారిని పరిశీలించినప్పుడు్, ఇంటి వాతావరణం ఒక కారణం గా అనిపించింది నాకు, ( ఇంట్లో వ్యక్తులు)
వారి చదువు మీద జోక్స్ వేయటమూ, వారి భవిత మీద సందేహాన్ని వెలిబుచ్చటమూ( ముందు, ముందు చదువు చాలా ఖరీదైనదిగా మారుతుంది కనుక ఎంత చదివినా నీకు విద్యాఅవకాశాలు తక్కువే అనే నిరాశా భావన వారిలో కలిగించటమూ.. వగైరా)
సర్, వీరికి నేనిచ్చిన సలహా, తోటి విద్యార్దులతో కలసి కంబైండ్ స్టడీస్ చేయమనీ..,
తోటి విద్యార్ది ధనవంతుడు అయి, డల్ స్టూడెంట్ అయితే ఆతని చదువుకు సహాయపడి, ఆతని నుండి ఆర్దిక సహాయం పొందమనీ,(ఇలా అరేంజ్ చేశాను కూడా.)
సర్, మీ పోస్ట్ వల్లా నాకు మంచి చేయగలిగే అవకాశం దొరుకుతుంది ధన్యవాదాలు.
విజ్ఞానం అనేది ఒక సముద్రం ! ఎంత తెలుసుకున్నా , తెలుసుకోవలసినది ఎంతో ఉంటుంది !
సజ్జన సాంగత్యం , సద్గ్రంధ పఠ నం అని అందుకే అంటారు ! అంటే విజ్ఞాన వంతులవడానికి మంచి స్నేహితులూ , మంచి గ్రంధాలూ , రెండూ ఎంతో ఉపకరిస్తాయి ! ప్రత్యేకించి , చదువుకోడానికి , అవకాశాలు పరిమితమైన వారికి !
చక్కటి సలహా మీది ! ఒక్కొక్కరికీ మీరు చేసే సహాయం , వారి జీవితాలనే ఉజ్వలం చేస్తుంది ! అభినందనలు ! చదువుకోడానికి కలిగే అనేక రకాల అవరోధాల గురించి కూడా ముందు ముందు టపాల లో తెలుసుకుందాం !