చదువుకోడం ఎట్లా ? 3.
( పైన ఉన్న చిత్రం లో , తల క్రిందులు గా ఫుట్ బాల్ ను కిక్ చేస్తున్నది , ప్రఖ్యాత బ్రెజిలియన్ ఆట గాడు , పెలె ! తను సృష్టించిన ఈ ‘ బైసికిల్ కిక్ ‘ తో అనేక గోల్స్ చేశాడు ! ఈ కిక్ ప్రత్యేకకత ఏమిటంటే, గాలి లో ఎగురుతున్న బాల్ ను అలవోక గా , ఒక్క ఎగురు ఎగిరి , కాళ్ళ తోనే తన్ని , గోల్ సాధించడమే కాకుండా , ఆ కిక్ చేసిన తరువాత , ఏ మాత్రమూ గాయ పడకుండా , గాలి లో నే ఒక పల్టీ కొట్టి మళ్ళీ గ్రౌండ్ మీద కాళ్ళు ఆనించ గలడం ! ఆ పని కేవలం పెలె మాత్రమే చేయ గలిగాడు ! అందుకే పెలె ను ఫుట్ బాల్ మాంత్రికుడు అని కూడా పిలుస్తారు ! తన టీం తో ఫుట్ బాల్ ప్రపంచ కప్ కూడా సాధించాడు ! మీకు ఉత్సాహం ఉంటే , ఈ బైసికిల్ కిక్ , పెలె ఎట్లా చేశాడో , యూ ట్యూబ్ లో చూడండి ! )
స్థానం : చదివే స్థానం , ప్రశాంతం గానూ , శబ్ద కాలుష్యం లేకుండా ఉంటే, చదువు మీద మనసు లగ్నం చేసి , పాఠాలను గ్రహించడానికి తక్కువ సమయం పడుతుంది ! ప్రచార సాధనాలకు దూరం గా ఉంటే ఉత్తమం ! అంటే రేడియో , టీవీ , టెలి ఫోను , మ్యూజిక్ సిస్టం , వీటికి ! మరీ పిన్ డ్రాప్ సైలెన్స్ అవసరం లేదు ! కావలసినది , ఇంద్రియాలకు , అంటే, చూసే కళ్ళకూ , వినే చెవులకూ , కూడా ఇతరత్రా ప్రేరణ లు అంటే స్టిమ్యులస్ లు ( బహు వచనం లో స్టిమ్యులై అని అంటారు, ఖచ్చితం గా చెప్పుకోవాలంటే ! ) లేకుండా ఉంటే , ( చదువు మీద ) ఏకాగ్రత హెచ్చుతుంది ! ఏకాగ్రత తో, తక్కువ సమయం లోనే, ఎక్కువ విషయాలు గ్రహించ వచ్చు ! కాస్త పెరుగుతున్న కొద్దీ , మీ మీ ప్రత్యేకత లతో , అంటే మీకు ఎక్కడ కూర్చుని చదువుకుంటే , బాగా అనుకూలం గా ఉంటుందో , మీరే నిర్ణయించుకుని , ఆ ఏర్పాట్లు చూసుకోవచ్చు !
అన్ని సౌకర్యాలూ ఉన్నవారు : ప్రత్యేకమైన గది లోనో , లేక ప్రశాంతం గా ఉండే ఇంకో గది లోనో , కూర్చుని చదువు కోవచ్చు ! కుటుంబం లో జరుగుతున్న రోజు వారీ సంఘటనలకు , ‘ దూరం ‘ గా !
సౌకర్యాలు తక్కువ ఉన్న వారు : వీరు కూడా , తగిన ప్రశాంత వాతావరణం చూసుకోవడం మంచిది ! సామాన్యం గా , ఇంట్లో అయితే , నిశ్శబ్ద వాతావరణం లోనో , లేదా స్కూల్ / కాలేజీ లైబ్రరీ లోనో ఒక స్థానం చూసుకుని , చదువు కొనసాగించడం మంచిది ! కాస్త పెరిగిన విద్యార్దులైతే , ఇంటికి దగ్గరలో ఉన్న , రద్దీగా లేనీ కాఫీ హోటల్ లో ఒక మూల కూర్చుని కానీ , ఇంటి దగ్గర లో ఉన్న పబ్లిక్ పార్క్ లో కానీ , చదువు కోవచ్చు ! చాలా సమయాలలో , సౌకర్యాలు తక్కువ గా ఉంటే , ఏకాగ్రత ఎక్కువ గా ఉండ వచ్చు , వారి దిశా నిర్దేశనం సరిగా వారికి అర్ధం అయి ఉంటే ! కాదేదీ చదువు కనర్హం , ఔనౌను చదువు అమూల్యం ! కుటుంబానికంతా , ఒక్క గదే ఉంటే , చదువు కు ప్రాముఖ్యం , ఇస్తూ , తల్లి దండ్రులు , తగ్గు స్వరం లో మాట్లాడడమూ , వాదోప వాదాలను ( అవి అవసరం అనుకునే సందర్భాలలో ! ) ‘ వాయిదా ‘ వేసుకోవడమూ చేయాలి , వారి భవిష్యత్తు కోసమూ , వారి పిల్లల భవిష్యత్తు కోసమూ !
సమయం : మిగతా పనులు ఏవి చేసినా సమయం సందర్భం చూసుకుని , చేసినట్టే , చదువు కు కూడా, ఒక నియమిత మైన సమయం నిర్ణయించుకుని , క్రమ పధ్ధతి లో చదువుతూ ఉంటే , ఎక్కువ నేర్చుకో గలుగుతాము ! వారం లో ఏడు రోజులూ , లేదా అయిదు రోజులూ , రోజుకు మూడు గంటలో , ఆరు గంటలో , చదువు కు కేటాయించడం మంచిది ! ఈ సమయం , స్కూలు , కాలేజీ లో చదివే సమయం కాకుండా ! అక్కడ చదివే పాఠాల వివరాలు నోట్ చేసుకున్నట్టు గానే , ఇంటి దగ్గర చదువుకునే పాఠాలను కూడా ఒక క్రమ పధ్ధతి లో నోట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే , ఉపయోగ కరం గా ఉంటుంది ! ఏక బిగిన మూడు నాలుగు గంటలు చదవడం చేయకుండా , ఒక గంటకో , ముప్పావు గంటకో , ఒక చిన్న బ్రేక్ , అంటే విరామం తీసుకుంటే , అది లాభ దాయకం ! ఒకటి : మనం దృష్టి పెట్టి తదేకం గా పుస్తకాలను చూస్తున్నా కూడా , ప్రతి పది , పదిహేను నిమిషాలకొక సారి , ఒక ( కంటి కి ) ఆహ్లాద కరమైన ఆకు పచ్చని పచ్చిక బయలు ప్రదేశాన్ని కానీ , లేదా నీలి రంగులో ఉన్న ఆకాశాన్ని కానీ చూస్తూ ఉండడం అలవాటు చేసుకుంటే , చూపు దెబ్బ తిని , కళ్ళద్దాలు రాకుండా , నివారించు కోవచ్చు ! అట్లాగే , విరామం లో , మీకు నచ్చిన చిరు తిళ్ళు ( నియమితం గా ) తినడం వలన, ఎప్పటికప్పుడు , శక్తి కలిగి ఉండి , ఎక్కువ విషయాలను , సరిగా ఆకళింపు చేసుకోవడం జరుగుతుంది !
చాలా సమయాలలో కడుపు మాడుతూ ఉన్నా కూడా , కృత నిశ్చయం తో చదివే వారు కూడా అనూహ్యం గా, ఎక్కువ విషయాలు ఆకళింపు చేసుకో గలుగుతారు !
తరువాతి టపాలో ఇంకొన్ని సంగతులు !
చాలా సందర్బాలలో విద్యార్దులు ఆకలి కడుపుతో చదవటం జరుగుతుంది, వారి మనస్సు కేవలం చదువు పై లగ్నం అయి ఉంటే వారికి ఆకలి తెలీదు,
కానీ అన్నాహారాలు మాని చదివితే మాత్రమే చదువు వంట పడుతుంది అనే అపోహ చామందిలో ఉంది, ఇది నేను కొంత మందిలో తొలగించగలిగాను,
సర్, చదువుకూ, మూడనమ్మకాలకూ ముడిపెట్టి విద్యార్ధులను దిస్టర్బ్ చేసే తల్లితండ్రులూ ఉన్నారు,
మీరు ఎప్పుడైనా ఈ కోణం లో కూడా రాయగలిగితే… బాగుంటుంది (ఇది నా అభ్యర్దన మాత్రమే)
మూఢ నమ్మకాలు తొలగించి చిన్నారుల విద్య కోసం మీరు చేస్తున్న కృషి సదా
అభినందనీయం ! ఆ చిన్నారుల విద్యావకాశాలకున్న అవరోధాల గురించి కూడా
తెలుసుకుందాం, ముందు ముందు ! మీ సలహా ఉత్తమమైనది !
నా అబ్యర్దనను స్వీకరించిన మీ తీరు చాలా ఉన్నతమైనది, ధన్యవాదాలు.