చదవడం ఎట్లా? 1.
అవకాశాలు శూన్యమైనా, చదువుతారు కొందరు !
అవకాశాలు ఎన్నో ఉన్నా, చదువుకోరు కొందరు !
అవకాశాలు కల్పించుకుని చదివేది ,కొందరు !
చదువు లేక, అవకాశాలు అందుకోనిది ఎందరో !
చదువు ! ప్రతి విద్యార్ధి మనసులో మెదిలే పదం ! ప్రతి తల్లిదండ్రి ఆకాంక్ష , ప్రతి యువతీ యువకుల ఆశయం , చదువుకోవాలనీ , బాగా చదువుకోవాలనీ , ఆ చదువు తో జీవితం లో ముందుకు పోవాలనీ ! చదువు ప్రతి మానవుడికీ ప్రాధమిక హక్కు కూడా, ఆరోగ్యం తో పాటుగా !
ఇంత అమూల్యమైన విద్యార్జన, చేసే సమయం లో చాలా మంది విద్యార్ధులు , ఏ రకమైన పధకమూ లేకుండా , చదువుతారు ! వారిలో చదవాలనే కాంక్ష , పట్టుదల ఉన్నా కూడా , సరిఅయిన అవగాహన లేకుండా , చదువుతూ , అత్యంత శ్రమ పడుతూ , ‘ బండ చదువు ‘ చదువుతూ ఉంటారు ! తమ అమూల్యమైన సమయం వెచ్చిస్తూ కూడా , పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోలేక , బాధ పడుతూ ఉంటారు , తమ శ్రమ కు తగ్గ ఫలితం దక్క లేదనే , విచారం తో కొందరు విద్యార్ధులు , చదువంటే విరక్తి కూడా చెందుతారు ! ఇక విద్యార్ధుల తల్లి దండ్రులు కూడా , ప్రత్యేకించి , వారు పెద్దగా చదువుకున్న వారు కానట్టయితే , అనేక శ్రమల కోర్చి , తమ ఆదాయం లో అధిక భాగాన్ని , తమ పిల్లల చదువులకై వెచ్చించి , చదివిస్తూ ఉంటారు ! కానీ చదివే పద్ధతులు అవగాహన చేసుకోక పోవడం వలన , తమ సంతానానికి , ఒక పధ్ధతి లో చదువు చెప్ప లేక పోతారు ! తాము, తమ సంతానం తో ఎక్కువ సమయం ఇంటి వద్ద గడుపుతున్నా కూడా ! అట్లాంటి విద్యార్ధులకూ , తల్లిదండ్రులకూ , కొద్దిగానైనా ఉపయోగ పడాలనే ఉద్దేశం తో , ఈ టపాలను వేయడం జరుగుతుంది ! ఈ రోజుల్లో ,వయోజన విద్య కూడా చాలా ప్రాచుర్యం పొందింది ! ఎందరో ఉద్యోగులు కూడా తమ తమ వృత్తిలోనూ , ఉద్యోగాలలోనూ , ఇంకా పురోగమించాలని , చదువు కొనసాగిస్తూ ఉన్నారు కదా ! అట్లాగే ,అనేకమంది ఉపాధ్యాయులు కూడా , కేవలం బోధనే పరమార్ధం గా పెట్టుకున్నా , విద్యార్ధులకు ఏ విధం గా తమ బోధనను వారి మెదడులో కలకాలం ఉండేట్టు చేయాలో తెలియక , బోధన తో తమ పని అయిపోయినట్టు ప్రవర్తిస్తారు ! వారికీ ఈ టపాలు ఉపయోగ కరం గా ఉంటాయని ఆశిస్తున్నా !
ఇంకొన్ని సంగతులు వచ్చే టపాలో !
చాలా మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారండి. అందరికీ ఎంతో ఉపయోగకరమైన విషయం. అభినందనలు.
చాలా మంచి సబ్జక్ట్ , మీ ప్రతి పలుకూ పనికి వస్తుంది,
మీరు ఒక ఉత్తమ ఉపాధ్యాయిని అనుకుంటున్నాను ! మీ అమూల్యమైన సూచనలూ , సలహాలూ
తెలుపుతూ ఉండండి !
నేను మంచి ఉపాద్యాయనినే అది నేను నమ్ముతాను కానీ మీకు చెప్పెంత ఎదగలేదు.
కానీ నేను , నా టపాల మీద, మీరు చేసే , విమర్శలనూ , సలహాలనూ , సహృదయత తో
తీసుకునేంత ఒదగ గలను లేండి !