విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?3.
క్రితం టపా లో ఆలోచనా ధోరణిని ఆశావహం గా ఎట్లా మార్చుకోవచ్చో , ఎందుకు మార్చుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా ! మనం బయటి ప్రపంచాన్ని ఏ ఫ్రేం లో అవుతే చూస్తామో , ఆ ఫ్రేం ను మార్చుకోవడం వల్ల , బయటి ప్రపంచం మనకు నూతనం గా కనబడుతుంది ! మనసు ‘ విరిగి ‘ పోయి నిరాశా దృక్పధం తో మీరు చూసే ఫ్రేం ను మార్చుకుని , మీరు జీవితాన్ని ఇంకో కొత్త కోణం లో , కొత్త ఫ్రేం లో చూడగలగడం అలవాటు చేసుకుంటే , మీరు విమోచన పొందిన అనుభూతి చెందగలరు !
4. మరి, ఈ కొత్త ఫ్రేం లో నుంచి మీ జీవితాన్నీ , మీ కొత్త ప్రపంచాన్నీ చూడగలగడం ఎట్లా ?
మీ ప్రేమ , లేదా సంబంధం విఫలం అయినప్పుడు , మీరు, మీ గురించీ , మీ తో అంత వరకూ సంబంధం పెట్టుకున్న వ్యక్తి గురించీ , మీ అభిప్రాయాలేంటి ? ఈ విఫలమైన సంబంధం పర్యవసానం గా , మీ గురించీ , ఆ వ్యక్తి గురించీ మీరు ఏ యే నిర్ణయాలు చేసుకున్నారు ? అంటే, మీ గురించీ , ఆ వ్యక్తి గురించీ, మీ తీర్పు ఏమిటి ? తరువాత , మీకు అత్యంత ప్రీతి పాత్రమైన , మీరు అభిమానించే వ్యక్తి , మీరు ఉన్న పరిస్థితి లోనే ఉంటే , ఏ రకమైన నిర్ణయాలు తీసుకుని ఉండే వారో ఆలోచించండి ! ఇక చివర గా మీకూ , మీ తో సంబంధం చెడి పోయిన వ్యక్తి కీ, ఏ మాత్రం తెలియని ఒక తటస్థ వ్యక్తి , మీరున్న పరిస్థితి లో ఉంటే , ఏమి చేసే వారో , ఏ విధం గా పరిస్థితిని అంచనా వేసుకునే వారో కూడా , మీరే ఆలోచించండి ! ఇప్పుడు, ఈ మూడు రకాల ఆలోచనా తీరుల్లో కనిపించే తేడా ను గమనించండి , మీకు అత్యంత లాభదాయకమైన , అత్యంత సంతృప్తి నిచ్చిన , అభిప్రాయం ఏమిటో చూడండి ! అప్పుడు , మీకు , ఆలోచనా రీతులు , సమస్యను చూసే వ్యక్తి ఫ్రేం లో ఎట్లా మారుతాయో మీకు అవగాహన అవుతుంది ! ప్రేమ విఫలం అయినవారూ , సంబంధాలు తెగి పోయినవారూ , ఆ యా సంఘటనలను కేవలం ఒక చాలెంజ్ లా తీసుకుని , ముందుకు పోయిన వారు , వారి జీవిత పధం లో ముందుకు పోతూ ఉంటారు ! అట్లా కాక , ప్రతి తెగి పోయిన సంబంధాన్నీ , విఫలమైన ప్రేమనూ , వారి జీవితాలలో వచ్చిన , అతి ఘోరమైన దుర్ఘటన గా భావించి , కుమిలి పోయే వారు , వారు సృష్టించుకున్న అగాధం లో పడి ‘ బయటకు ‘ రాలేక , సతమత మవుతుంటారు ! ఇక ముందుకు పోయే మార్గం ఎట్లా కనిపిస్తుంది? ! నాణానికి రెండువైపులు గా ఉన్న ఈ ఆశా , నిరాశ దృక్పధాలకు తేడా ఎంతో ఉంది కదా ! ఆ దృక్పధాలు ఏర్పడడానికి , మనం చూసే ఫ్రేం మార్చుకుంటే మార్గం సుగమమవుతుంది ! ఏ ఫ్రేం లో జీవితాన్నీ , ప్రపంచాన్నీ , భవిష్యత్తు నూ , చూడాలని అనుకుంటామో , అదే ఫ్రేం లో మనకు కనిపిస్తుంది కూడా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Very good informative, suggestive. good pic
ఆలోచనలను విస్తృతం చేసుకోగలగటం ఓ కొత్త కోణం.
మంచి సూచనలతో సాగుతున్న ఈ టపా మంచిని పెంచేది అనటం లో సందేహం లేదు.