విరహ వేదన తైలం గా, ఆశా జ్యోతి వెలిగించడం ఎట్లా ?
క్రితం టపాలలో, ప్రేమించడం ఎట్లాగో వివరం గా తెలుసుకున్నాం కదా ! మరి పలు సందర్భాలలో , మనం ప్రేమించిన వ్యక్తులతో మనకున్న సంబంధం, అకస్మాత్తు గా చెడి పోవడం కానీ , లేదా విపరీతమైన కోరికతో, మనం కావాలనుకున్న వ్యక్తులు , మనకు దక్కక పోవడమే కాకుండా , మనలను ఏమాత్రం లెక్క చేయక పోవడం కూడా జరుగుతూ ఉంటుంది ! ఈ ‘ అనూహ్య పరిమాణాలకు తట్టుకోలేక, తల్ల డిల్లి పోతూ ఉండడం సంభవిస్తూ ఉంటుంది ! ‘ మనకు అత్యంత ఆప్తుడూ , స్నేహితుడూ అయిన మన ‘ మనసు ‘ గాడు గాయ పడతాడు ! మనలో, అనేక సంక్లిష్ట భావోద్వేగాలను సృష్టి స్తాడు ! మరి ఆ పరిణామాలను ఎట్లా తట్టుకోవాలి? మనకు మనం హాని చేసుకుంటూ , తీవ్రమైన నిరాశా నిస్పృహ లకు బానిసలమై , జీవితం ‘ అంధకారమయం చేసుకోవడం తప్ప వేరే దారి లేదా !!?? మరి పవిత్రమైన దీపావళి రోజున , ఈ నిరాశా తిమిరం తో, మన జ్ఞాన దీపం తో సమరం చేయడమూ , జీవితాలను దే దీప్య మానం చేసుకోవడం గురించీ తెలుసుకుందాం !
ప్రేమ విఫలం అవడం తో మొట్ట మొదట జరిగే చర్య , అట్లా జరిగిందని అంగీక రించే స్థితి లో ‘ మనసు ‘ లేక పోవడం ! దానితో మనసు ‘ గాయం ‘ అవుతుంది ! ‘ నాకే ఎందుకు జరగాలి ఇట్లాగా ? అనే తీవ్రమైన ఆత్మ శోధన కలుగుతుంది ! దానితో నిద్రాహారాలు మానడమూ , తీవ్రమైన మానసిక ఆందోళన కు గురి అవడమూ కూడా జరుగుతాయి !
మరి కర్తవ్యం ఏమిటి ? :
1. నొప్పిని అంగీకరించడం : మీలో కలిగే బాధను అంగీకరించి , ఆ బాధనూ , వేదననూ, భరించాలనే నిర్ణయం తీసుకోండి ! మన శరీరం లో ఎక్కడైనా చిన్న గాయం అయినా , నొప్పి కలగడం , అత్యంత సహజమైన జీవ రసాయన చర్య ! మనం మానసికం గా ‘ గాయ ‘ పడినా , నొప్పి కలగడం సహజమే ! కాక పొతే ఆ నొప్పి , ఒక స్థానం లో , ఖచ్చితం గా కనిపించదు , మానసిక వ్యాకులత కనుక ! సామాన్యం గా చాలా మంది , ఈ మానసిక వేదనను , నిర్లక్ష్యం చేయడమే కాకుండా , మనో వేదనను ఆమోదించే పరిస్థితి లో కూడా ఉండరు !
‘ విరిగిన మనసు ‘ గత స్మృతు లను , అప్రయత్నం గానే ఆటో రీ – ప్లే చేసుకుంటూ ఉంటుంది ! తరచూ ! ఆ గత స్మృతులు , మీరు , మీ ప్రేమను తృ ణీ కరించిన వ్యక్తి తో గడిపిన ఆనంద మయ క్షణాలు కావచ్చు , లేదా కలిసి చూసిన ప్రదేశాలూ , చేసిన సంభాషణలూ , ఆరగించిన విందులూ , ఇంకా ముందుకు పోయిన సందర్భాలలో పొందిన శారీరిక , మానసిక ఆనందమూ కూడా , మన జీవ కంప్యూటర్ లో ఉన్న హార్డ్ వేర్ లోనుంచి , పదే , పదే , ఆడియో గానూ , వీడియో గానూ , రీ – ప్లే అవుతూ ఉంటాయి ! ఆ పరిస్థితిని ‘ చక్క బెట్టుకోవడం ‘ అలవాటు చేసుకోవాలి ! ఇది చెప్పినంత సులభం కాదు ! అట్లా చేయడం, మీరు, మీ ‘ మధుర స్మృతులకు ‘ విలువ కట్ట లేక పోవడమూ కాదు ! మీ (గత ) ప్రేమాను భూతులను , మీరు పట్టించుకోక పోవడమూ కాదు ! కొంత కాలం గా , మీ జీవ కంప్యూటర్ లో ఈ సంఘటనలు అన్నీ కూడా ప్రధాన మైనవి అవడం వల్ల , మీ జీవనం కూడా , ఆ సంఘటనలకూ , మీరు, తద్వారా పొందే , మధురానుభూతులకూ , అలవాటు పడడం జరిగింది ! అంటే మీ ‘ మనసు గాడు ‘ మీతో పాటు గా , ఆ యా అనుభూతులకు ప్రోగ్రాం అయ్యాడు ! మీరు, మీ ఇంద్రియాలతో , వర్తమానం లో ఉన్నా , మీ మనసు గాడు, ఆ యా ప్రదేశాలలో , మీరు తిరుగుతూ ఉంటే , అప్రయత్నం గానే , మీరు క్రితం అక్కడ ఉన్నప్పుడు మీరు పొందిన ఆనందాన్ని గుర్తు చేస్తాడు !
2. అలవాట్లు మార్చుకోవడం ! : పైన ఉదహరించిన ఈ పరిస్థితి నుంచి, క్రమ క్రమం గా మీరు దూరం అవాలంటే , మీ అలవాట్లను మార్చుకోవడం ముందుగా చేయాలి ! క్రమ క్రమం గా , ఆ ‘ గత ‘ సంఘటనలు ‘ మీలో రీ ప్లే అవుతూ ఉంటే కూడా , వాటిని పట్టించు కోకుండా , మీ వర్తమానం లో మీ మనసును , మీ శరీరం తో పాటుగా కేంద్రీకరించుకోవడం అలవాటు చేసుకోవాలి ! మీకు ఉత్సాహం కలిగించే , మీకు ఇష్టమైన, కొత్త హాబీ ను డెవలప్ చేసుకోవడం , అట్లాగే , ఒకే చోట కూర్చోకుండా , ప్రతి రోజూ శారీరిక వ్యాయామం చేయడం , కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోవడం చేయడం వల్ల , మీ మానసిక వేదనను దూరం చేసుకోవడమే కాకుండా , దాని పరిణామం గా పొంచి ఉన్న , డిప్రెషన్ ను కూడా మీరు దూరం చేసుకుంటున్నారన్న మాటే ! నిరాశా నిస్పృహ లతో , సతమత మయ్యే , జీవ కణాలకు ప్రాణ వాయువు ను సరిపడినంత గా సమకూర్చుతుంది , మీరు, రోజూ చేసే వ్యాయామం !
సూక్ష్మం గా చెప్పాలంటే , మీ గత జీవన చర్యను , మీరు మార్చుకుని , భావి జీవితం లో ఉత్సాహ భరితం గా ఉండడానికి మీరు సన్నద్ధ మవుతున్నారు పై చర్యల వల్ల ! మీ జీవ కంప్యూటర్ లో కొత్త సాఫ్ట్ వేర్ అప్ లోడ్ చేసుకోవడానికి , మీ ‘ డిస్క్ డ్రైవ్ ‘ ను క్లీన్ చేసుకుంటున్నారు ! మీరు, మీ విలువైన జీవిత కంప్యూటర్ ను, వృధా చేద్దామనుకోవడం లేదు ! అది ఎంతో ఆనంద కరమైన నిర్ణయం ! ఎందుకంటే , మీ జీవితం ఎంతో విలువైనది ! విలువ గ్రహించ లేని వారి వల్ల , మీ జీవితం విలువ కోల్పో కూడదు ! కోల్పోదు కూడా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Interesting. plz elaborate
Thanks. Please follow the posts in this series.
మానసిక వేదన నుండి బైట పడటానికి కొత్త అలవాఅట్లను చేసుకోవటం,
ఇకపొతే ఈ ప్రేమగొడవలో మునిగి మనకు శ్రేయాబిలాషులు ఎవరో వారిని దూరంగా పెట్ట్టి ఉంటాము (సహజమే ఎందుకంటే ఈ ప్రేమలూ..గట్రా వద్దని చెప్పేది వారే కదా:-))
తిరిగి వారికి దగ్గర కావటమూ చేస్తే కొంత మానసిక వ్యధ తగ్గుతుంది.
ఇప్పటి మీ పోస్ట్ ఎంతో మందికి మంచి మార్గం చూపించగలదని ఆశిస్తూ…
నిజమే ! ( వరుస టపాలు చూడండి ! )
జీవితాన్ని అలుముకున్న చీకట్లను దీపావళి నాడు తొలగించాలని చూస్తున్న మీకు జీవితమంతా శాంతి ఉండాలని ఆశిస్తూ,
ధన్యవాదాలు మెరాజ్ !