Our Health

ప్రేమించడం ఎట్లా ? 8. మంచి నేస్తం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 26, 2013 at 11:06 ఉద.

ప్రేమించడం ఎట్లా ? 8. మంచి నేస్తం !

 క్షమించడం , క్షమించ బడడం : ప్రేమ లో , ఇష్టాలూ , అయిష్టాలూ ,  పలకరింపులూ , మూతి విరుపులూ కూడా ఉంటూ ఉంటాయి , కాలాను గుణం గానూ , పరిస్థితులను బట్టీ ,  అట్లాగే , మనసు విరిచే మాటలూ , సంఘటనలూ కూడా చోటు చేసుకుంటాయి ! తప్పిదాలూ జరుగుతూ ఉంటాయి !  అవి మీ వల్ల జరిగితే , మీరు  ఆత్మ న్యూనతా భావం తో కుమిలి పోకుండా , హుందా గా మీ తప్పిదాలను అంగీకరించే పరిస్థితి లో ఉండాలి ! అట్లాగే,  మీరు ప్రేమించిన వారు కనుక తప్పిదాలు చేయడమో , లేదా మీ మనసు ‘ గాయ ‘ పరచడమో చేస్తే , మీరు అప్పుడు కూడా  ‘ క్షమా గుణం  ‘ అనే బ్యాండేజ్ వేసుకుని  గాయం మాన్చు కునే చర్యలు తీసుకోవాలి ! ఆ అనుభవాల సారాంశం , మీ భావి జీవితం లో మీరు ఉపయోగించు కోవాలి ! 
మంచికి పోటీ :  ఉన్నమైన విలువలు కలిగిన ప్రేమ లో,  పరస్పరం,  మంచికి పోటీ పడుతూ ఉంటారు !  ప్రేమికులిద్దరూ , వారి వారి ఆశయాల నూ , ఆకాంక్ష లనూ  పరస్పరం గౌరవించుకోవడమే కాకుండా , ఆ ఆశయాలూ , లక్ష్యాలూ  వారు  చేరుకోవడానికి అవతలి వారు , వారి శాయ శక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు , ప్రేమ పూర్వకం గా ! అంటే వారు పరస్పరం , తమ మంచితనాన్నంతా , వారి ప్రేమలో  పెట్టుబడి పెడతారు ! ఒకరి కన్నా ఎక్కువ గా , ఇంకొకరు తమ మంచి తనాన్ని చూపించడం లో పోటీ పడతారు !  ఈ పోటీ, కేవలం ఒకరు గెలవాలనే లక్ష్యం తో కాకుండా , వారిరువురూ , తమ  గమ్యాలూ , లక్ష్యాలూ ,  చేరుకొని , ప్రేమ మయ జీవితాలు గడపడం కోసమే !  
మంచి నేస్తం :  ప్రేమ లో  ముద్దూ మురిపాలు ముఖ్యమైనా కూడా , ఇంకో ముఖ్య విషయం , మీరు  ప్రేమించిన వారితో ఒక మంచి నేస్తం గా ఉండి పోవాలి !  సదా,వారి శ్రేయస్సు కోరే,  ఒక మంచి మిత్రులు గా ఉండాలి ! జీవితాంతం !  మీ ప్రేమ భౌతికమైనదైనా , లేదా కేవలం హృదయ స్పందన తో కూడినదైనా ( అంటే ప్లాటోనిక్ ప్రేమ ! ) అయినా , మీ ప్రేమ  సఫలం అయినా , విఫలం అయినా కూడా , మీరు ప్రేమించిన వారికి,  మీరు ఒక గొప్ప స్నేహితులు గా అవ్వాలి !  వారి కష్ట కాలం లో మీ భుజం మీద తల ఆనించి సేద తీర్చుకునే విధం గా  మీ ‘ భుజం ‘ సిద్ధం కావాలి ! ప్రేమ  విలువలు దేదీప్య మానం గా  వెలిగేది అప్పుడే ! 
ప్రేమ, అతి సులభం !  

ప్రేమ, అతి జటిలం  !
 ప్రేమ అతి సున్నితం !
ప్రేమ,అతి  మధురం ! 
ప్రేమ, విచిత్రం !
ప్రేమ, పవిత్రం ! 
ప్రేమ, సౌందర్యం ! 
ప్రేమ, జీవితం ! 
ప్రేమ, శాంతి !
ప్రేమ, కాంతి ! 
వచ్చే టపాలో కలుద్దాం ! 
  1. మది కదిలించింది మీటపా. మీరేమో సిద్ధాంతం చెబుతారు, మాకేమో జరుతున్న, జరిగిన సంఘటనలు తెలుసు. 🙂 GOOD PIC

  2. కృతఙ్ఞతలు. సిద్ధాంతాల కన్నా అనుభవాల పాఠాలు గొప్పవి కదా !

  3. డాక్టర్ గా్రు కవి కావటం ఓ అద్భుతం. మీ ప్రతిమాటా ఉన్నతమైన అంశం కావటం విశేషం

  4. సర్, మా జీవన విదానాన్ని సరిదిద్దుకోవటానికి ఇదొక వేదిక

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: