Our Health

ప్రేమించడం ఎట్లా ? 6. ప్రతి వారినీ గౌరవించడం.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 20, 2013 at 9:54 ఉద.

ప్రేమించడం ఎట్లా ? 6. ప్రతి వారినీ గౌరవించడం. 

ప్రతి వారినీ గౌరవించడం :  సాంకేతికత పెరిగి , ప్రపంచం లో  మానవ సంబంధాలు  కేవలం  వివిధ గాడ్జెట్ లతో  కొన సాగుతున్నాయి !  కానీ  ఎంతో లాభాలతో , ముందుకు దూసుకు పోతున్న కంపెనీలన్నీ కూడా మానవ సంబంధాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి, వ్యాపార ప్రకటనల తో పాటు గా ! 
ప్రతి వ్యక్తి  కూడా, ప్రేమ ప్రేమ మయ జీవితం గడపాలంటే , ప్రతి ఇతర వ్యక్తి నీ , వారి  పుట్టుక, కులం  , పెరుగుదల , వారి విద్య,  ఉద్యోగం , తాహతు , వారి సంపాదనా , ఈ విషయాలతో ప్రమేయం లేకుండా , కేవలం, వారిని తోటి మానవులలాగా గౌరవించడం  అలవాటు చేసుకోవాలి ! ఈ విధం గా, చాలా మంది అనుకుంటున్నట్టు , కేవలం సాధువులూ సన్యాసులు మాత్రమే  కాదు  ! ఎవరైనా చేయ గలరు !  మనం , దేశాలూ , ఖండాలూ ,  ఈ నాగరికతలూ , మతాలూ ,  సామాజిక వ్యత్యాసాలూ , భౌతిక అవసరాలూ , ఇవన్నీ ఒక్క క్షణం మనసులో కి రానీయకుండా , కేవలం ఈ భూలోకం లో ఉంటున్న ఒక ‘ గ్రహ వాసులు ‘ గా అనుకుంటే , కేవలం ఇతర మానవులను గౌరవించమా ?  ! కానీ యదార్ధం అందుకు భిన్నం గా ఉంది ! ఈ భూగోళం లో ఉన్న మానవులందరి మధ్యా ,  భౌతికం గా కనిపించక పోయినా కూడా ,   దుర్భేద్యమైన  అంతరాలూ ,  పరిధులూ , పరిమితులూ ఉన్నాయి !  దానికి అనుగుణం గానే , ప్రేమ కూడా  పరిణామం చెందింది !  అంటే  మానవులు కొందరినే , ప్రేమించడం , గౌరవించడం  మొదలు పెట్టారు. ఒక వ్యక్తి  , ఇంకొకరి మీద   గౌరవం  చూపించడం , వారు చూపించే ప్రేమ లో ఒక అతి ముఖ్యమైన లక్షణం !  మనం గౌరవించ లేని వారిని   ప్రేమించ   లేము కూడా !   ఇతరుల మీద గౌరవం , వారితో మన అనుభవాల బట్టీ ,  అభిప్రాయాల బట్టీ  ఏర్పడుతుంది !   వాటి పర్యవ సానం గా , మనం ఇతర వ్యక్తుల  విలువ గ్రహించ గలుగు తాము ! ప్రతి జీవితమూ , ఈ ప్రపంచం లో విలువైనదే !  అట్లాగే మానవులంతా కూడా విలువైన వారే ! మనలో ఉన్నట్టే , ఇతర మానవులందరి లోనూ , అనుభూతులూ , కోరికలూ , వాంఛ లూ , ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం  – ఈ లక్షణాలన్నీ ఉంటాయి. మీరు ప్రేమించే ప్రతి వ్యక్తి లోనూ ఉంటాయి .  ఈ సత్యాన్ని , మనం మన చేతలలో కూడా చూపిస్తే , ప్రేమ , ఒక  నిశ్చల ప్రవాహం లా మనలో ప్రవహిస్తూ ఉంటుంది,  తెలియకుండానే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. ఒరు లేవి యొనరించిన నరవర…..
    so as to sow so as to reap. good post

  2. మీరన్నట్లు ఇతరులను మనం మన్నించటానికి వారితో మనకున్న అభిప్రాయాలూ, అనుభవాలూ నిజమే,
    కానీ అందరినీ ఉన్నతంగా ఊహించి లేని గొప్పతనం అపాదించటం ఒక్కోసారి అనర్దాలకు దారి తీస్తుందని అనిపిస్తుంది, అంటే అందరూ అర్హులు కారేమో…

  3. అప్పుడు దానిని ‘ పొగడడం’ అంటాం కదా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: