Our Health

ప్రేమించడం ఎట్లా ?.2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 12, 2013 at 3:51 సా.

ప్రేమించడం ఎట్లా ?.2. 

క్రితం టపాలో ప్రేమ స్వభావం, ప్రేమ పరిధులూ తెలుసుకున్నాం కదా ! మరి ఏది ప్రేమ కాదు ? అనే సంగతి కూడా తెలుసుకుందాం , ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే ముందు ! 
ఏది ప్రేమ కాదు ? :
1. కేవలం కామ ప్రధాన మైన సంబంధం లో ప్రేమ కొరవడుతుంది ! అంటే సామాన్యం గా , ఒక స్త్రీని, పురుషుడు కేవలం కామాతురత తోనే చూస్తూ , తమ కామ వాంఛ లను తీర్చు కోడానికి  ఎంతో అనువైన  వ్యక్తి గా చూడడం అలవరచుకున్నప్పుడు , ఆ సంబంధం  లో ముందుండేది ప్రేమ కాదు , కామ వాంఛ మాత్రమే ! అనేక సంబంధాలలో, తుఫానులు సంభవిస్తూ ,అవి  తరచూ ఆటు పోట్లకు గురి అవుతూ ఉండడానికి  ఇది ఒక ప్రధాన కారణం ! 
2. సంపూర్ణా ధిపత్యం , నియంత్రణ  అంటే డామి నెన్స్ , అండ్ కంట్రోల్ :  ఒక సంబంధం లో ఒక వ్యక్తి , ఇంకో వ్యక్తి ని పూర్తి గా తన నియంత్రణ లో ఉంచుకుని ,  తన ఆజ్ఞలు శిరసావహించే,  విధేయులైన వ్యక్తి గా మసలుకోవాలని, తన సంబంధం లో ఆశిస్తే ,  ఆ సంబంధం లో ప్రేమ లోపిస్తుంది ! ఇట్లా సర్వ సాధారణం గా పురుషుడు , తను సంబంధం ఏర్పరుచుకున్న స్త్రీ తో ప్రవర్తించడం జరుగుతుంది . కేవలం చాలా అరుదు గానే , స్త్రీ , పురుషుని మీద ఇట్లా  ఆధిపత్యం చేయడం జరుగుతుంది ! ఈ రకమైన సంబంధాలలో  ప్రేమ ‘ బూజు పట్టి ‘ ఒక మూల దాక్కుంటుంది !  ఆ సంబంధం ప్రేమమయమైన సంబంధం అనిపించుకోదు , సహజం గానే ! 
3. సంబంధం ఏర్పరుచుకున్న వ్యక్తి గురించి అదే పని గా చింతించడం అంటే వర్రీ అవడం ! :  ఇట్లా , తల్లి తన పిల్లల గురించి కానీ , లేదా భార్య , తన భర్త గురించి కానీ విపరీతం గా వర్రీ అవుతూ , వారు తమకు దూరం గా ఉన్నప్పుడు , ప్రతి క్షణమూ ,వారి గురించి ఆలోచిస్తూ , వారి క్షేమం గురించి ఆందోళన పడుతూ ఉండడం జరుగుతుంది ! ఇట్లా అబ్ సెసివ్  వ్యక్తిత్వం ఉన్న వారు , వారి సంబంధం లో ప్రేమను సమ పాళ్ళలో పొంద లేరు , పంచ లేరు కూడా ! 
4. అనవసరమైన అభద్రతా భావన , లేదా ఆత్మ న్యూ నతా భావనల తో కొనసాగుతున్న సంబంధం లో ప్రేమ ప్రవృద్ధి చెందదు ! :  ఈరకమైన మనస్తత్వం ఉన్న వారు ,  ఇతర వ్యక్తులను తమతో ,’  ప్రేమ ‘ అనే ‘ సాధనం’  తో ‘ కట్టి వేయాలని’ అనుకోవడం జరుగుతుంది ! అది కూడా పొర పాటే ! అది కూడా ప్రేమ అనిపించుకోదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

  • ఈ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్నవారు , తమ లక్షణాలను కనుక అనేక ఏళ్లు గా తమ ప్రియ సంతానం మీద కానీ , జీవిత భాగ స్వాముల మీద కానీ చూపిస్తూ ఉంటే , ఆ ప్రవర్తన మారడానికి కూడా ఎక్కువ కాలం పడుతుంది ! ముఖ్యం గా, తమ సంతానం సరిగా , అంటే తాము అనుకున్నట్టు గా కనక , జీవితం లో రాణించ లేక పొతే ,
   ఈ రకమైన వర్రీ లు అంటే ఆందోళన లు ఎక్కువ గా ఉంటాయి ! ఈ సందర్భాల లో కూడా , పెరుగుతున్న , లేదా పెరిగిన పిల్లల వ్యక్తిత్వాలను గౌరవించ కుండా, తాము ఆశించిన విధం గా పిల్లలు వృద్ధి చెంద లేదనే భావన ఉండడం వలన కూడా కలుగుతుంది !
   చికిత్స కూడా , నారింజ పండు తొక్క ఒలిచి ఒక్కో పండు భాగాన్నీ , విడదీసి , తొనలను తిన్నట్టు గానే , మనసు లోతుల్లో పాతుకు పోయిన , ఆందోళనా భావనలను క్రమ క్రమం గా తొలగించి ( తమకు తాము గానీ , సైకాలజిస్ట్ సలహాతో కానీ ) మనసు తేలిక చేసుకున్న వారు , వారి జీవితాలలో ఆందోళన లూ , చీకాకు ల ‘ తొక్క లు ‘ తొలిగించి తొనలు ‘ తిని ‘ ఆనందం పొంద గలరు !

 1. Thanks. I got the idea after viewing ( pictures in ) your posts !

 2. సుధాకర్ గారూ, ఈ అభద్రతా భావం కూడా అతి ప్రేమవల్లా కలుగుతుందేమో అనే సందేహం ఉండెది నాకు.
  కానీ మీరన్నట్లు ఆరి స్వార్ధం విపరీత దొరణే ఎదుటివారిని ఇబ్బందికి గురిచేస్తుంది.
  ఈ ప్రవర్తన ఎక్కువగా పురుషులలోనే ఉంటుంది.
  సర్, ఆలోచింపజేసే, మీ తరువాతి పోస్ట్ కోసం ఎదురుచూస్తూ… మెరాజ్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: