Our Health

ప్రేమ తో ఆరోగ్యం. మిగతా లాభాలు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 5, 2013 at 6:29 సా.

ప్రేమ తో ఆరోగ్యం. మిగతా లాభాలు. 

ప్రేమ తో  సౌందర్యం :  ప్రేమ మయమైన జీవితాలు గడిపితే , చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది !   ఊక దంపుడు  మాటలు అనుకుంటున్నారు కదూ ! కాదు యదార్ధమే !  ప్రేమ , మానసిక వత్తిడిని అనేక విధాలు గా తక్కువ చేస్తుంది,  దానితో , తీవ్రమైన మానసిక వత్తిడి కలిగినప్పుడు,  మన దేహం లో విడుదల అయే  కార్టి సోల్ అనే స్టీరాయిడ్ హార్మోనులు తక్కువ గా విడుదల అవుతాయి ! శాస్త్రీయం గా  ఈ కార్టి సోల్ హార్మోనులు  ముఖం మీద మొటిమ లకు కారణం !    ఎక్కువ వత్తిడి తో ఎక్కువ మొటిమలు , తక్కువ వత్తిడి తో తక్కువ గా మొటిమలు ! ఆ కారణం గానే, చర్మం నవ నవ లాడుతూ ఉంటుంది, ఏ క్రీమూ పట్టించక పోయినా ! 
హృదయం లో ప్రేమ నిండితే , గుండె ఆరోగ్యం పదిలం :   హృదయాన్ని కేవలం రక్త నాళాల తోనూ ,  రక్తం తోనూ నింపి ఉంచితే ,  ఆ గుండె బరువవుతుంది ! గుండె జబ్బులు రావడానికి అవకాశం హెచ్చుతుంది !   ప్రేమ ను గుండె నిండా నింపితే , ఆ గుండె తేలిక అవుతుంది !  దీనికి కూడా శాస్త్రీయం గా రుజువులు ఉన్నాయి ! ప్రేమ నిండిన హృదయాలు , తక్కువ వత్తిడి తో పని చేస్తూ ఉంటాయి ! అందువల్ల   మతలబు కేవలం లబ్ , డబ్ అనే శబ్దాలతోనే  కొట్టుకుంటూ ఉంటుంది !   అదే  ప్రేమ వెలితి అయిన గుండె డబ డబా ,  డబ డబా ,  డబ డబా , దడ  దడా , దడ  దడా,  కొట్టుకుంటూ , ఆందోళన లో డోల లాడుతూ , మనలను కూడా ఆందోళనల లో పడేస్తుంది ! 
ప్రేమ తో నొప్పి  తక్కువ : ఒక పరిశోధన లో ,   రెండు ప్రేమించే హృదయాలు,   వారి వారి చేతులను పరస్పరం పెనవేసుకుని , ఎలెక్ట్రిక్ షాక్ కనుక ఎదుర్కుంటే ( అంటే మన ఇళ్ళలో లా గా ప్రమాదకరమైన ఓల్టేజి కాదు ! )  వారిరువురిలోనూ ఆ ఎలెక్ట్రిక్ షాకు ను తట్టుకో గలిగే ఓరిమి ఎక్కువగా ఉండడమే కాకుండా , దానివలన వారు అనుభవించే నొప్పి కూడా తక్కువ అయిందిట ! 
ప్రేమ తో  ఋతు స్రావం సవ్యం :   యుక్త వయసు వచ్చిన యువతులు కూడా , ప్రేమ ను పొందుతూ ,  మానసిక ప్రశాంతత తో జీవనం గడుపుతూ ఉంటే , వారి నెల వారీ ఋతు స్రావం , ఏ ఒడు దుడుకులూ లేకుండా , సవ్యం గానూ , సహజం గానూ జరుగుతుందని  పరిశోధనల వల్ల తెలుసుకోవడం జరిగింది !  తీవ్రమైన మానసిక వత్తిడి తో పాటుగా , ప్రేమ కొర వడిన  స్త్రీలలో వారి గర్భం కూడా ఆ బాధను అనుభవిస్తూ ,  పర్యవసానాలు ,  అధిక ఋతు స్రావం అవడమూ , ఎక్కువ రోజులు అవడమూ జరుగుతుంది. అంతే కాకుండా , కనీసం వారానికి ఒకసారి రతి లో పాల్గొనే స్త్రీలలో , ఋతు స్రావం సరళం గా సామాన్య పరిమాణం లోనే అవుతుందని స్పష్టమయింది !  కారణం, వారి లో సహజ ఋతు స్రావానికి అవసరమయే , ఈ స్ట్రో జెన్ హార్మోను  సమ పాళ్ళ లో విడుదల అవుతూ ఉంటుంది ! 
ప్రేమతో మానసిక శాంతి ! : ప్రేమ వలలో చిక్కుకుని , పరస్పరం ఇరుక్కున్న వారి మనసులు విశాలం గా ఉండడమే కాకుండా ,  గాఢమైన వారి ప్రేమ , వారి మెదడు లో కూడా అనేక రకాలైన ఆరోగ్య కరమైన  జీవ రసాయనాలను ప్రేరేపిస్తూ , డోపమిన్  అనే అతి ముఖ్య మైన రసాయనాన్ని విడుదల చేస్తూ , వారిని , జీవితం లో ఎక్కువ శక్తి వంతం గానూ , ఎక్కువ ఆశావాద దృక్పధం తోనూ , అంటే పాజిటివ్ గా ఆలోచింప చేస్తూ , డిప్రెషన్ కు దూరం గా ఉంచుతుంది ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 
  1. ప్రేమ ఆరోగ్యానికి మంచిదంటారు, ప్రేమించేద్దాం 🙂

  2. చదివించే,చదవాలనిపించే ఈ ఫొస్ట్స్ కామెంట్ పెట్టించుకోవు ఎందుకో,
    బహుశా ఇలాంటివాటికి స్త్రీలు స్పందించటం తప్పూ అనే సంశయం కావచ్హు. కానీ మీరాతల్లో అస్లీలత ఉండదు.

kastephaleకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: