Our Health

చుంబన రహస్యాలు. 13. అడ్వాన్స్ డ్ కిటుకులు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 29, 2013 at 1:49 సా.

చుంబన రహస్యాలు. 13. అడ్వాన్స్ డ్  కిటుకులు !   

కలగలుపు ! : అంటే,  మిక్స్ అండ్ మ్యాచ్ !  ముద్దులు మంచు పూవుల లాంటివి ! అంటే , ఏ ఒక్క మంచు పూవూ ఇంకో దానిని పోలి ఉండదు ! కానీ అన్నీ మంచు పూవులే ! ఒక మారు, మీరు ఫ్రెంచ్ కిస్ ( ఇవ్వడానికీ , తీసుకో డానికీ ) కు కనుక అలవాటు పడితే , మళ్ళీ , మళ్ళీ అదే ఫ్రెంచి ముద్దు పెడదామని తహ తహలాడడం సహజమే !  వేగం మారుస్తూ , ఆమెలో  కామాతురత కు కళ్ళెం వేస్తూ  ముందుకు సాగడం !  మీరు ఇప్పుడు నిదానం గా ఫ్రెంచి ముద్దు ఇవ్వడం తెలుసుకున్నాక ,  ‘సమయానుకూలం ‘ గా మీ చుంబన వేగం మారుస్తూ , వివిధ వేగాలతో ముద్దులు ‘గుప్పిస్తూ ‘ ఉంటే ,  ఆ చేసే పని లో కాస్త  వెరైటీ వస్తుంది ! ఉద్వేగం వేస్తుంది , ఇరువురిలోనూ ! 
లోతు గా :  కొంత సేపు పై పై ముద్దులు ఇచ్చాక , చిలిపి గా  డీప్ కిసెస్ , అంటే గాఢమైన ముద్దులు ఇవ్వడం చేస్తే , మీ ప్రేమ రస పాకం లో పడుతుంది ! 
వత్తిడి గా : మీ ప్రేయసి తో పరిచయం పెరుగుతున్న కొద్దీ , మీ ముద్దులలో గాఢ త కూడా పెంచితే మీ తప్పు ఏమీ ఉండదు !  మీరిరువురూ ,  ఒకరి పొందులో ఇంకొకరు స్వాంతన పొందే స్థితికి వచ్చే ఉంటారు కదా  , ఈపాటికి !  దానితో లోతైన ముద్దులతో పాటుగా , ఆముద్దులను  శక్తి వంత మైనవి గా కూడా మీరు మార్చవచ్చు  , కాస్త వత్తిడి పెంచి !  కానీ మీ నాలుక ను ఆమెలో మెది లించడం మాత్రం మాన కూడదు ! 
దంత స్పర్శ :  కేవలం ఆమె పెదవులే కాకుండా , ఆమె దంతాలను కూడా మీ నాలుకతో  తాకవచ్చు ! అది కూడా ఒకరకమైన చక్కిలి గింతలు కలిగిస్తుంది మీ నెచ్చెలి లో ! 
చేతులతో !:  మొదటి ముద్దు సమయం లో, మీ చేతులను బుద్ధిగా మీకు ఇరు ప్రక్కలా ఉంచడమే శ్రేయస్కరం అంటారు !  మరి ఆ ముద్దు మొదటిది కానప్పుడు , మీ చేతులకు  పని కల్పించడం మీ బాధ్యత !  ప్రేయసి చెక్కిలి మీదనో , లేదా ఆమె శిరోజాలను సుకుమారం గా దువ్వుతోనో , లేదా ఆమెను మీ కౌగిలి లో ‘ బంధించో ‘  మీ ముద్దును ఆస్వాదించ వచ్చు , ఆమెతో కూడా ! 
దేహ భాష ! :  ముద్దులకు విశ్వ వ్యాప్త వైవిధ్యం ఉంది ! అంటే , ప్రపంచం లో ఏ ఒక్క ముద్దూ , ఒకే రుచి తో ఉండదు ! దానికి కారణాలు అనేకం ! దానిలో ముఖ్యమైనది , మనుషులంతా ఒక్కటే కాదు కదా ! అదే విధం గా,  ఏ ప్రేయసీ ఎప్పుడూ , ఒకే లా చుంబించ బడాలని అనుకోదు ! అంటే, వారికి కూడా వైవిధ్యం కావాలి !  ఏ ముద్దు ఆమెకు , ఇష్టమో , ఏ ముద్దు ఇష్టం లేదో  తెలుసుకోవడం ఒక కళ ! ఇంకో వంద టపాలు రాసినా , అది తెలుసుకోవడం సాధ్యపడదు !  కేవలం ,  ఆ ముద్దు పెట్టే వారి సమయ స్ఫూర్తి , వివేకం తోనే , అది సాధ్యం అవుతుంది !  కానీ ‘ సాధనమున పనులు సమకూరు ధరలోన !’  అనే సూక్తి ని , ‘  సాధనమున పనులు సమకూరు అధరాన ‘ అని గుర్తుంచుకుంటే !  మీరు విజయులే !  అప్పుడు మీకు , ‘ ఆమె ‘ ముద్దు మురిపాల తీరు తెన్నులు బాగా తెలుస్తాయి !  ప్రాక్టిస్ మేక్స్  పర్ఫెక్ట్ ! 
కమ్యునికేషన్ ! :  మీ ఇరువురి మధ్యా , పరిచయమూ , చనువు ఎక్కువ అవుతూ  ఉంటే , ముద్దు కూడా మురిపెం గా  అవుతూ ఉంటుంది !  ఆ స్థితి లో  అతడి ముద్దు మీకు నచ్చితే , ఆ సంగతి అతనితో చెబితే , మీ ఆనందం అధికం అవుతుంది ! ఒక వేళ ‘  ఆ ముద్దు’  నచ్చక పోయినా ,  మీ మనసులు కలిస్తే ,  మీరిరువురూ, సరదాగా ,  హాయి గా నవ్వుకుని,  మలి ప్రయత్నం చేయవచ్చు ! అందుకే ,   ప్రాక్టిస్ !  — — !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: