చుంబన రహస్యాలు.12. ఫ్రెంచి ముద్దు ప్రేమైకం !
మీ పెదవులతో, ఆమె పెదవులను నెమలి ఈకతో తాకినట్టు తాకడం : మీ ఇరువురి పెదవులూ చేరువ అయిన తరువాత , మీ పెదవులతో, ఆమె పెదవుల మీద అతి సున్నితం గా తగలాలి ! ఆ టచ్, కేవలం, మీరు ఒక నెమలి ఈక తో ఆమె పెదవులు తాకు తున్నంత సుకుమారం గా ఉండాలి ! ఎందుకు అట్లా ? పెదవుల లో అనేక వందల నాడీ తంత్రులు గజిబిజి గా అల్లుకుని ఉంటాయి ! ఆ నాడీ తంత్రులు , అతి సున్నితమైన స్పర్శకు కూడా తక్షణమే స్పందించే ధర్మం కలిగి ఉంటాయి ! మీ పెదవుల నెమలి ఈకలు ఆమె పెదవులను తాకగానే , ఆమె లో నూ , తద్వారా ఆమె పెదవులలోనూ , విపరీతమైన యాంటిసిపేషన్ , ఎగ్జైట్ మెంట్ , కలుగుతాయి. అంటే ఆమె పెదవులు , మీ పెదవుల స్పర్శ తో ఉత్తేజం చెందడమే కాకుండా , మీ పెదవులతో బంధం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కూడా ! ఈ దశలో , పూర్తి ముద్దు కోసం కాదు ఆ ఎదురు చూపు ! ఈ పరిస్థితి లో, మీరు విపరీతం గా ఉద్రేక పడి పోకుండా , మీకు ఇప్పుడు ప్రపంచం లో ఉన్న సమయం అంతా , మీ ఆధీనం లోనే ఉన్నట్టు భావించి , అతి నిదానం గా నింపాది గా మీ నెమలీక స్పర్శ , ఆమె పెదవులకు కలిగించాలి !
ఈ విధం గా కొంత సేపు ( ఎంతో సేపు ) చేసిన తరువాత , మీ ఉద్దేశం తెలియ చేయండి , ఫ్రెంచి ముద్దు కోసం ! అందుకు మీ సన్నద్ధత ను కూడా ఈపాటికి తెలియ చేసే ఉంటారు ! ఇప్పుడు, మీ నోరు విశాలం గా తెరచి , ఆమె కింది పెదవిని , మీ రెండు పెదవులతో లాక్ చేయండి అంటే బంధించడం ! ఆ తరువాత మీ నాలుక తో ఆమె క్రింది పెదవిని ఇక్క సారిగా కేవలం కొన్ని క్షణాల పాటు స్వీప్ చేయండి , అంటే ఆమె క్రింది పెదవి మీద , మీ నాలుకతో వెన్న పూస్తున్నట్టు తాకడం ! ఆమెకు మీ చర్య ఇష్టం అవుతే , ఆమె నాలుక కూడా క్రియా శీలం అవుతుంది అంటే యాక్టివ్ గా మీ పెదవుల కోసం సాగుతుంది ! లేక , ఆమెకు ఇష్టం లేక పొతే మీరు ఏ చర్యనూ ఫీల్ అవరు ! అప్పుడు , మీ ప్రయత్నం తాత్కాలికం గా విరమించుకుంటే మంచిది !
ఆమె ఉత్సాహం చూపుతూ ఉంటే , మీ నాలుకకు పని పెట్టడం మీ తరువాతి కార్యక్రమం ! ఆమె నాలుకను మీ నాలుక తో తడిమి ( రుచి ) చూడడం , కొద్దిగా ఆమె నాలుకను తాకి , మళ్ళీ మీ నాలుక వెనుకకు పొతే , ఆమె దానిని అందుకోడానికి తన నాలుకను సాగ దీయడం , నోటి లో ఒక ప్రేమాట లా ఉంటుంది ! ఆనంద దాయకం గా , చిలిపి గానూ ఉంటుంది ! గుర్తు ఉంచుకోవలసినది, నాలుకను ఎప్పుడూ సాఫ్ట్ గానే ఉంచాలి ! దృఢ మైన కండరం గా చేయకూడదు ! అంతే కాకుండా , అత్యుత్సాహం తో మీ నాలుకను వీలైనంత పొడవు గా చాచి ఆమె గొంతు కు అడ్డం గా పోనీయ కూడదు ! అప్పుడు ఆమె ఉత్సాహం నీరు కార్చిన వారవుతారు మీరు !
మరి ఈ ఫ్రెంచ్ చుంబన కార్యక్రమం ఎక్కువ సమయం సాగుతుంటే , మీ రిరువురూ శ్వాస తీసుకోవడం మరచి పోకూడదు ! మొహమాట పడకుండా , తరచూ శ్వాస తీసుకుంటూ ఉండాలి కూడా ! సరిపడినంత ఆక్సిజన్ అందితే , మీ మెదడు తో పాటుగా , మీ పెదవులూ , నాలుకా కూడా ఉత్సాహం తో ‘ పని చేసి ‘ మీకు అధిక ఆనందాన్ని కలుగచేస్తాయి !
ఈ ఫ్రెంచి ముద్దులో కూడా కొన్ని అడ్వాన్స్ డ్ టెక్నిక్ లు ఉన్నాయి ! వాటి గురించి వచ్చే టపాలో !