చుంబన రహస్యాలు. 11. ఫ్రెంచి ముద్దు ఎట్లా ?
కనులు కలిపి వలపు తెలుపు ! : కనులు కలపడం అంటే మీ కళ్ళు ‘ ఆమె ‘ కళ్ళ తో అనుసంధానం చేయాలి ! అంటే ఐ కాంటాక్ట్ చేయాలి ! మామూలు గా మనం ఎవరినైనా చూస్తున్నప్పుడు, వారి కళ్ళ లో చూస్తాము కదా మరి ఆ చూపులకూ , ప్రణయ చూపులకూ అంటే రొమాంటిక్ చూపులకూ తేడా ఏమిటి ? ప్రణయ చూపులలో , అందాలను ( కళ్ళ తో ) ప్రశంసిస్తూ కూడా , ఇంకా చిలిపి భావనలు కూడా తెలియ బరచడం ! మరి ముద్దు పెట్టుకోవాలని తెలపడం ఎట్లా ?
అందుకు మీ చూపుల రూటు : మొదట ఆమె కళ్ళతో జత కడతాయి , అక్కడ కొన్ని క్షణాలు ఉండి , నేరుగా ఆమె పెదవుల మీద పడతాయి మళ్ళీ పెదవులనుంచి రూటు నేరుగా ఆమె కళ్ళలోకి వెళతాయి మీ చూపులు ! దానితో మీ చుంబ న సందేశం , ఆమె చూపుల ద్వారా , ఆమె మనసు టపా కు చేరుకుంటుంది, మీ మెసేజ్ !
చిలిపి నవ్వు : మీకు మీ ఉద్దేశం ఆమె కు తెలియ చేయగానే , మీ మనసు ఆనంద తాండవం చేస్తుంది , ఆ తాండవం ఆమెకు మీ చిరు నవ్వు ద్వారా తెలియ చేయండి ! మీ చిలిపి నవ్వు , ఆమెకూ ఆనందం కలిగించడం తో పాటుగా , ఆమె ను రిలాక్స్ చేసి , ఆమె లో చుంబనం చేయ బోతున్నందుకు కలిగే ఆందోళనలను నివారించ డమూ , లేదా తగ్గించడమూ చేస్తుంది ! ఆమెలో కానీ , అతనిలో కానీ భద్రతా భావాన్ని కూడా కలిగిస్తుంది మీ పొందులో ! ఆ చిరునవ్వు , చిలిపి గా ఉన్నా , నిజాయితీ గా , స్వచ్ఛ మైనది గా ఉంటే , మీ చుంబనం రుచి మధురం గా ఉంటుంది ! ఆమె పాజిటివ్ గా స్పందించ గానే, మీరు మరో అంగుళం ముదుకు వెళ్ళాలి ! అంటే అతి త్వరగా కాక , మరీ అంత నిదానం గానూ కాక , ఆమె పెదవులకై మీరు చేరువ కావాలి , ఆమెకు ! అదే సమయం లో ఆమె కూడా మీ పెదవులకు చేరువ కావడం గమనించండి !
మీరు నేరుగా ఆమె పెదవుల మీదనే దృష్టి పెట్టినా కూడా , మీ ముఖం ఆమె ముఖానికి సరిగ్గా ఎదురు గా ఉంచ కూడదు ! ఎందుకంటే , మీ ఇరువురి నాసికలూ ‘ విలన్ ‘ లవుతాయి ముద్దుకు ! అంటే మీ ఇరువురి ముక్కులూ కలబడి, మీకు, ముద్దు దూరం అవుతుంది ! అందుకని, మీరు ఆమె చేరువ అవుతున్న సమయం లో నే మీ తలను, కొద్ది గా వంచాలి నలభై అయిదు డిగ్రీలు ఒక ప్రక్కకు వంచితే , సరిగ్గా మీ పెదవులు ఆమె పెదవులను చేరుకోగలవు ! మీరు ఆత్రుతగా, తొంభై డిగ్రీలు కనుక మీ తల వంచితే , మీకు ఆమె పెదవుల పట్టు దొరకక పోగా , మీ చుంబ నోద్వేగం కాస్తా చల్లారుతుంది ! ఆమె కానీ అతడు కానీ ఒక ప్రక్కకు తల వంచితే , మీరు ఆ డైరెక్షన్ కు ఆపోజిట్ అంటే , అభిముఖం గా మీ తల తిప్పాలి అప్పుడు మీ పెదవులు లంకె పడడానికి సరి అయిన పరిస్థితి ఏర్పడుతుంది !
కనులు మూసుకోవడం : మీ పెదవులు కలిసే సమయం లో మీ కనులు విశ్రాంతి తీసుకోవాలి , కను రెప్పలు మూసి ! అంటే మీరు కళ్ళు మూసుకోవడం జరగాలి ! కనులు తెరచి ముద్దు పెట్టుకోవడం , మీ నిజాయితీని శంకించే చర్య ! కనులు మూసుకుని మీరు చేసే చుంబనం మిమ్మల్ని , ఫ్లైట్ లో తీసుకు పోతుంది , ప్రణయ లోకానికి !
మీ పెదవులను చుంబన పొజిషన్ లో ఉంచడం: సామాన్యం గా బామ్మ లకు కానీ , నానమ్మ లకు కానీ ప్చ్ , ప్చ్ , ప్చ్ అని ముద్దు ఇచ్చే సమయం లో లా , పెదవులను ముడి వేసి ఉంచకూడదు ! ఎందుకంటే , నానమ్మకు ఇప్పుడు ముద్దు ఇవ్వట్లేదు కనుక ! ప్రేయసికి ముద్దు ఇచ్చే సమయం లో మీ పెదవులను ఓపెన్ గా తెరచి ఉంచాలి ! అట్లాగని మీ నోటిని పూర్తి గా తెరచి ఉంచకూడదు ! ఒక మాదిరి గా తెరిచి , పెదవులను కొద్దిగానే, బిగుతు గా ఉంచి మీ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి ఉపక్రమించాలి !
మిగతా సంగతులు వచ్చే టపాలో !