చుంబన రహస్యాలు.10. ఫ్రెంచి ముద్దు మనకు కాదా ?
ఫ్రెంచి ముద్దు !
తెంచు, ప్రేమ సరిహద్దు !
రేగు కోరికలు, ఉవ్వెత్తు !
చేయు ప్రియులను , ఉన్మత్తు !
అనేక సినిమాలలో చూసి ఉంటాము ! ఫ్రెంచి ముద్దు ! స్త్రీ పురుష రమణీయ ప్రేమకు సయ్యాట ! చిరకాలం నుంచీ ప్రసిద్ధి చెందినది ! ఆ ముద్దు , కేవలం ఫ్రెంచి వారి ఆస్తి కాదు ! ప్రేమికులందరిదీ ! మరి ముద్దులలో రకాలు ఏమిటి? ఫ్రెంచి ముద్దు లో తేడా ఏమిటి ? ఈ క్రింద స్టెప్పులు పరిశీలిస్తే, తెలుస్తాయి వివరాలు !
1. ముందు గా మీ పెదవుల తడి ఆరనీయకండి !: పొడి గా ఉన్న పెదవులతో చుంబనం , దాహాన్నే తెలియ చేస్తుంది కానీ , ప్రేమనూ మొహాన్నీ కాదు ! అప్పుడు ప్రేమ కూడా పొడి పొడి గా కనబడుతుంది ! పెదవులను తడి ఆరకుండా చేయ వలసినది, డీ హైడ్రేట్ అవకుండా రోజులో క్రమం గా నీరు త్రాగడం ! కావాలనుకుని డీ హైడ్రేట్ అవక పోయినా , చదువు , పని , లేదా ప్రయాణ వత్తిడి లో రోజూ అవసరమయే రెండు మూడు లీటర్ల నీరు ( ఎండాకాలం లో ఇంకా ఎక్కువ గా ! ) త్రాగక పోవడం వల్లనే , తెలియకుండా డీ హైడ్రేట్ అవడం జరుగుతుంది. పెదవులు తడి ఆరడానికి ఒక ప్రధాన కారణం , డీ హైడ్రేషన్ ! ఆ తరువాత , మీకు ఇష్టమనిపిస్తే , పెదవుల మీద , మార్కెట్ లో లభ్యం అయే ఒక మంచి బామ్ పూసుకుంటే కూడా ముద్దు ‘ రుచి ‘ పెరుగుతుంది ! పెదవులను , నాలుక ద్వారా , లాలా జాలం తో తడి గా ఉంచితే , ముద్దు ‘ రస మయం ‘ గా ఉంటుంది !
2. తాజా శ్వాస ! : స్వచ్ఛ మైన గాలిని పీల్చిన శ్వాస , మీ ప్రేమ స్వచ్ఛతను కూడా తెలియచేస్తుంది ‘ ఆమెకు ‘ ! జర్దా నమిలిన శ్వాసా , ధూమ పానం చేసిన శ్వాసా , బాగా మసాలాలు దట్టించిన ఆహారం తిన్న తరువాత శ్వాసా , ఉల్లి పాయలో,వెల్లుల్లో వేసిన ఆహారం తిన్న శ్వాసా , ఆల్కహాలు ( ఏరూపం లో నైనా , అంటే బీరు కానీ , వైన్ కానీ , విస్కీ కానీ ), కాఫీ కూడా , తాగిన తరువాత శ్వాసా , ఇవన్నీ ముద్దును ‘ కలుషితం’ చేస్తాయి ! ఆ పరిస్తితులలో ‘ ఆమె ‘ కు పెట్టే ముద్దు , ఒక మరపు రాని అనుభూతి అవ్వదు ! ‘ ముద్దు ‘ ను ఆమె కు ‘ బలవంతం ‘ గా ‘రుద్దుతున్నట్టు ‘ అవుతుంది ! పైన చెప్పినవి కొన్నీ కానీ , అన్నీ కానీ చేస్తున్న వారు , ముద్దు పెట్టాలని అనుకుంటే , ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ! వాటిని తినడం , తాగడం చేశాక , దంత ధావనం చేసుకోవాలి , పలు మార్లు నోటిలో నీటి తో రిన్స్ చేసుకోవాలి, పళ్ళు బ్రష్ చేసుకున్నాక ! నోటిలో ఎప్పుడూ ఫ్రెష్ మింట్ ను చప్పరించడం చేయాలి !
3. సుముహూర్తం : ఫ్రెంచి ముద్దు , మది లో మెదిలే తీవ్ర ప్రేమోద్వేగాన్ని ప్రేయసి కి తెలిపే చర్యలో పరాకాష్ట గా చెప్పుకో బడుతుంది ! అంటే, ముద్దులలో బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు ! మరి ‘ అంతటి ‘ విలువైన’ బ్రహ్మాస్త్రాన్ని సమయం సందర్భం లేకుండా ‘విడుదల ‘ చేస్తే , ఆ ముద్దు శక్తి ని మీరు పూర్తి గా పొంద లేరు ! మీకు ఆమె తో కానీ అతనితో కానీ పరిచయం బాగా పెరిగినప్పుడు , ఆమె కానీ, అతడు కానీ, మీకు చాలా చేరువలో ఎక్కువ సమయం ఏకాంతం గా గడుపుతున్నప్పుడు కానీ , ఆమె దేహ భాష ను గమనించి, మీరు ‘ ముందడుగు ‘ వేసే సుమూహూర్తం మీరే నిర్ణయించు కోవాలి , ( ప్రేమ ) పురోహితులను సంప్రదిస్తే , విలువైన దక్షిణ సమర్పించుకోవాల్సి ఉంటుంది ! మీకు అనుమానం గా ఉంటే , ఆమెనే , మీ బిడియం వదిలి అడిగితే ఉత్తమం !
మిగతా ముద్దు, వచ్చే టపాలో !