చుంబన రహస్యాలు.7. సరస సంభాషణం ……

ప్రపంచం లో ప్రతి వారూ , ప్రశంసా పాత్రులే ! అందుకు యువతులు మినహాయింపు కాదు ! చక్కని ప్రశంస లు, యువతులు మీ మీద మక్కువ పడే లా చేయగలిగే మంత్ర దండాలు !
మరి ఆ ప్రశంస లు ఎట్లా చేయాలి ?
ప్రశంస ఎప్పుడూ కృత్రిమం గా ఉండకూడదు ! మీకు ‘ ఆమె ‘ లో నిజం గానే నచ్చిన విషయాన్ని తీసుకోండి ! ఆమె లో ఉన్న ఆ లక్షణం, మీకు నిజం గానే, బాగా నచ్చి ఉండాలి ! ఉత్తుత్త గా కాదు ! ఆ ప్రత్యేకత ఆమె లోనే మీకు కనబడాలి ! మీ ఇరువురికీ పరిచయమున్న ఇతర అమ్మాయిల తో పోలిస్తే ! అట్లాంటి ప్రశంస , సహజం గానే బాగుంటుంది ! మీరు, ఆమెను పొగడడానికై చేసిన ప్రశంస లా ఉండదు ! ప్రశంసించే సమయం లో చేయ కూడనివి :ఆమె వక్షోజాలను కానీ , ఆమె ఫిగర్ ను కానీ , లేదా ఆమె బరువు ను కానీ , ప్రశంసించడం చేయకూడదు ! మీరు ఆమె చూపుల గురించి కనుక ప్రశంసిద్దామని అనుకుంటే , మీరు ఫోకస్ చేయ వలసినది , కేవలం ఆమె కళ్ళూ , కేశాలూ , ఇంకా ఆమె చిరు నవ్వు మాత్రమే , మిగతా డిపార్ట్ మెంట్ ల వైపు మీ దృష్టి మరల్చ కండి ! మీ ప్రశంస కేవలం , కొన్ని పదాలతోనే ఏమాత్రం ( ఆమె ) గుర్తు ఉంచుకోవడానికి వీలు లేనిది గానో , లేదా త్వరగా మరిచి పోయేది గానో ఉంటే , ఉపయోగం ఏముంటుంది ? నీ చిరునవ్వు తళ తళా వెన్నెల లా మెరిసి పోతున్నాయి ! అని కానీ , నీ నవ్వు ప్రపంచం లోనే నాకు అతి ఇష్టమైన శబ్దం ! అని కానీ , నిజం గానే నా జీవితం లో ఇప్పటి వరకూ నీ అంత అందమైన సృష్టి ని చూడలేదు ! అని కానీ ! అంటే , ఆమె పెదవులు, మీ పెదవులలో చాక్లెట్ లా కరిగిపోవాలని పరవశిస్తాయి ! అంతే కాక , ఆమె చాలా కాలం మీ ప్రశంస లను గుర్తు పెట్టుకుంటుంది కూడా !
మరి పై ప్రశంసలు ఏ టోన్ లో చెప్పాలి ?
‘ అహో అమ్మాయీ , నీ చిరు నవ్వులు తళ తళా వెన్నెల లా మెరిసి పోవుచున్నవి ఎందువలన వనితా ? ‘ అని ఏ ఇంద్రలోకం లో ఇంద్రుడు అన్నట్టు అంటే ఊహించుకోండి , ఆ సందర్భం ఎట్లా ఉంటుందో ! లేదా ‘ నిజం గానే నా జీవితం లో ఇప్పటి వరకూ నీ అంత అత్భుతమైన సృష్టి ని చూడలేదు ‘ అని చక చకా , పరీక్షలో, పాఠం వల్లించినట్టు చెబితే , ఎట్లా ఉంటుంది ! బాగానే ఉంటుందేమో కానీ , ప్రేమ పరీక్ష లో పాసవడం మాత్రం జరగదు ! అందుకే , చెప్పే మూడు మాటలూ , ప్రేమ మయం గానూ , రమణీయం గానూ చెప్ప డానికి ప్రయత్నించండి ! కొద్దిగా స్వరం తగ్గించి చెప్పడం మంచిదంటారు ! అట్లాగే కొద్దిగా ‘ ఆమె వైపు వంగి చెప్పడం కూడా మంచిదంటారు ! ఇంకా కొద్ది గా ముందుకు పోయి , ఆమె ప్రక్కకు వంగి , ఆమె చెవి దగ్గరగా తగ్గు స్వరం తో చెబితే కూడా , ఆ విషయం , వ్యక్తి గతం గా అంటే ప్రైవేట్ గా ఉండడమే కాకుండా , మీరు ఆమె కు ఇష్టమో లేదో కూడా ఇట్టే తెలిసి పోతుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Good example