చుంబన రహస్యాలు.3. ప్రేమ , ప్రణయం , కామం లో, చుంబన తీవ్రత ఎందుకు మారుతుంది ?
మానవులు, తమలో ఎగసి పడే, అనేక రకాల అనుభూతులను, తమ చుంబనం ద్వారా తెలియ చేస్తారు ! ఈ చుంబనం కేవలం నాలుగు పెదిమలు పెనవేసుకోవడమే అయినా కూడా , స్వీకరిస్తున్న వారు, ఆ ముద్దును విశ్లేషణ చేయగలరు ! కానీ అందరూ కాదు ! మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది ?
అని విశ్లేషిస్తే , జీవ పరిణామ రీత్యా , ముద్దు ప్రేయసీ ప్రియుల మధ్యా , తల్లీ శిశువుల మధ్యా ఒక చక్కని అనుబంధానికి పునాది అవుతూ వస్తుంది ! అందువల్లనే , మానవులలో , శిశువు , తన పెదిమలతో తల్లి స్థన కుచాలను ( అంటే నిపుల్స్ ను ) స్పృ శించ గానే , ఆప్యాయతా , అనురాగాలకు మూలమైన ఆక్సీ టోసిన్ అనే జీవ రసాయనం విడుదల అవుతుంది ! ( హార్మోనులు అని అంటారు వాటిని , ఈ హార్మోనుల గురించి వివరం గా ‘బాగు ‘ మునుపటి టపాలలో వివరించడం జరిగింది , ఉత్సాహం ఉన్న వారు చూడగలరు ) ఈ ఆక్సీ టోసిన్, తల్లి లో, తన శిశువు పట్ల ఒక విడదీయ రాని బంధం ఏర్పరుస్తుంది ! ప్రేమానురాగాల తో పాటుగా , అనుబంధం , వాత్సల్యం కూడా ! అదే తల్లి ప్రేమ ! అత్భుతం కదా సృష్టి !
అదే కారణం చేత , ప్రేయసీ ప్రియులు పరస్పరం చుంబించు కున్నా , గాఢమైన చుంబనాలలో , అంటే భావానుభూతుల దొంతరాలలో ఒదిగి పోతూ , పట్టు వంటి అతి మెత్తని , అతి సున్నితమైన పెద బంధాలలో , అనేక జీవ రసాయనాలు ప్రవహిస్తాయి ! ఆ జీవ రసాయనాలు అతి తక్కువ పరిమాణం లో ఉన్నా కూడా , ఉత్తుంగ తరంగ జలపాతం లా, అత్యంత అందమైన అనుభూతులను, శరీరం లో ప్రవహింప చేస్తాయి ! అపుడే , తనువు , అణువణువునా కంపిస్తూ ఉంటుంది ! ఫిషర్ అనే శాస్త్రవేత్త , దీనికి కారణం , ప్రధానం గా ‘ డోపమిన్ ఇంకా నారెపినెఫ్రిన్ ‘ అని అంటారు ! ఆమె మాటల్లోనే ‘ ఈ డోపమిన్ ,నారెపినెఫ్రిన్ అనే రసాయనాల విడుదల , ప్రత్యేకించి , ప్రేయసీ ప్రియుల తొలి కలయిక లో, అంటే ఒక నూతన సందర్భం ( నావెల్ సిచు యే షన్ ) లో నే జరుగుతుంది ! ఇట్లా జరిగినప్పుడు, ప్రేయసీ ప్రియులలో ( అంటే, కల్ల బొల్లి ప్రేమ కాక , నిజం గా ప్రేమలో ‘ పడ్డ ‘ వారు ! ) నాలుగు రకాల అనుభూతుల అలలు చెలరేగుతాయి:
1. కామ వాంఛ : విపరీతమైన కామ వాంఛ లు ఉత్పన్నం అవుతాయి ! అనేక మంది ప్రేయసీ ప్రియులు , ఈ కామ వాంఛ ల అలలో ‘ కొట్టుకు ‘ పోతారు కూడా !
2. ప్రణయ భావన : ఈ పరిస్థితి లో , కళ్ళు బరువు గా ఉండడం , శరీరం ఎంతో తేలిక అయిపోయిన అనుభూతి కలగడమూ , ఆకలి తగ్గి పోవడమూ , నిద్ర పోవాలని అనిపించక పోవడం , అంటే నిద్ర రాక పోవడం కూడా జరుగుతుంది. కామ వాంఛల అలలో కొట్టుకు పోయిన వారు, ప్రణయ తీరం చేరి, కళ్ళు తెరిచి చూసే సరికి, ఒకరిమీద ఒకరికి తీవ్రమైన ప్రణయ భావనలు , ఆరాధనా భావనలూ కూడా ఉదయిస్తాయి ! !
3. ప్రేమ : వారిరువురి మధ్యా ప్రేమ చిగురిస్తుంది !
4.అనుబంధం : ప్రేయసీ ప్రియులలో అనుబంధం పెనవేసుకుంటుంది , ఆ చిగురించిన ప్రేమకు ఆలంబన గా ! దానితో ఒకరి మీద ఒకరికి భద్రతా భావం కలుగుతుంది ! అంటే ‘ సెన్స్ ఆఫ్ సెక్యురిటీ ‘ ! సృష్టి విచిత్రం ఏమిటంటే , పైన తెలిపిన నాలుగు రకాల అనుభూతులూ కూడా నాలుగు రకాలైన జీవ రసాయనాల వల్లనే !
కామ వాంఛ, టె స్టో స్టిరాన్ అనే హార్మోను వల్ల ( స్త్రీల లోనూ , పురుషుల లోనూ కూడా ! ) ప్రేమా ప్రణయాలు , డోపమిన్ , నారెపినెఫ్రిన్ అనే జీవ రసాయనాల పుణ్యం ! ఇక అనుబంధం , ఒకరి ‘ ఒడి ‘ లో ఇంకొకరు స్వాంతన , శాంతీ , ప్రశాంతతా పొందు తున్న అనుభూతులన్నీ కూడా ఆక్సీ టోసిన్ మహిమే ! మీరు ప్రేమ లో పడి పిచ్చి గా పదే , పదే , మీ ప్రేయసిని కలవరిస్తూ , వరించినట్టు కలలు కంటూ ఉంటే , అది కేవలం మీ డోపమిన్ మహిమే ! అట్లా కాక , మీరు ‘ ఆ ‘ యువతిని కామా తృత తో చూస్తూ , శృంగార కామ కేళీ విలాసాలు జరుపుతున్నట్టు కలలు కంటుంటే, అది టె స్టో స్టిరాన్ అనే హార్మోను పనే ! మీ తప్పు కాదు ! కాక పొతే, ఆ టె స్టో స్టిరాన్ హార్మోను మీ దే ! అని ఆమె అన్నారు !
వచ్చే టపా లో ఇంకొన్ని చుంబన రహస్యాలు !
Good going ,continue