Our Health

చుంబన రహస్యాలు.2. అధర బంధాలు , విడతీయలేని అనుబంధాలు !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 13, 2013 at 7:50 సా.

చుంబన రహస్యాలు.2. అధర బంధాలు , విడతీయలేని అనుబంధాలు ! :  

 
చుంబనం, మానవ కామ కేళీ విలాసాలకు ప్రధాన ద్వారం ! ఈ ద్వారం గుండా ప్రయాణిస్తూ , అసలు సిసలైన  అనుభూతులను ఆస్వాదించగలుగుతాము ! అంతే  కాకుండా , ముద్దులు,  మానవులను ఒకే మూసలో పోసిన వారిలా కాకుండా నవ్యానుభూతుల ప్రాంగణానికి ఆహ్వానిస్తాయి !
హెలెన్ ఫిషర్ అనే శాస్త్ర వేత్త, కేవలం మానవులే కాక, సృష్టి లో అనేక ఇతర జీవాలు కూడా ముద్దులు కురిపిస్తూ ఉంటాయని తెలియ చేశాడు  ! 
తోలి ముద్దు పెట్టగానే , మీరు మీ భాగస్వామి పర్సనల్ స్పేస్ ను అతిక్రమించారన్న మాటే ! అంటే, మీరు చుంబించిన వారిని నమ్ముతున్నారన్న మాటే ! అంతే కాకుండా, మీరు వారిని తాకడమూ , వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడమూ , వారి శ్వాస లో మీ శ్వాస తీసుకోవడమూ , వారి మనసు తెలుసు కోడానికి ప్రయత్నం చేయడమూ కూడా  చేస్తారు ! 
 అధరాల నుంచి, అనేక వందల రిసెప్టార్ లు మన మెదడు కు  సంధానం అయి ఉంటాయి ! అంతే కాకుండా, పెదిమల నుంచి పంపే సంకేతాలను గుర్తించడానికి మెదడులోని సెన్సరీ కార్టెక్స్ లో ఒక పెద్ద భాగం ( అంటే, ఒక ప్రత్యేకమైన డిపార్ట్ మెంట్ అని చెప్పుకోవచ్చు ) కేటాయింప బడింది ! స్త్రీ లోలురైన  చాలామంది పురుషులు , తాము స్త్రీతో కామ క్రీడల లో , ముద్దాడడం కన్నా , కామ క్రీడలో పాల్గొన డానికే సుముఖం గా ఉంటారుట , కారణం , తదేకం గా వనితను ముద్దాడితే , తీక్షణమైన ఆ ముద్దుల వలలో విల విల లాడి , ఉక్కిరి బిక్కిరి అయి తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారుట ! అంతటి ప్రభావం ఉంది ముద్దు కు !  
తీక్షణం గా స్త్రీ పురుషులిద్దరూ, నాలుకలు మెలికలు వేసుకుని పెట్టుకునే ముద్దులు , శరీరాలలో , అనేక రకాల జీవ (రస మయ ) రసాయనిక చర్యల ను రగిలించి ,  రోగ నిరోధక శక్తి ని  ఎక్కువ చేస్తాయని పరిశోధనల వల్ల విశదం అయింది ! ( ప్రేయసీ ప్రియులిద్దరూ ఏ రకమైన అంటు వ్యాధులూ లేకుండా ఉంటేనే ! ) 
అధర బంధాలు , విడతీయలేని అనుబంధాలు ! :  ఆప్యాయతా , అనురాగాలతో చేసే స్పర్శ , స్త్రీలలో ఆక్సీ టోసిన్  అనే జీవ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆక్సీ టోసిన్  శరీరాన్నీ , మనసునూ ప్రశాంత పరిచి , స్వాంతన చేకూరిస్తుంది !  ఒక రకం గా ఆక్సీ టోసిన్ ను ప్రశాంత హార్మోన్ అనుకోవచ్చు !  కానీ  పెదవులతో  బంధం వేసి చేసే స్పర్శ , అత్యంత సున్నితమైనది గా మెదడు లోని న్యురాన్ లను, అంటే నాడీ కణాలను శక్తి వంతం చేసి ఉత్తేజ పరుస్తుంది ! ఈ రకమైన అధర స్పర్శ ,  విడదీయ లేని అనుబంధం గా పరిణమిస్తుంది, ప్రేయసీ ప్రియుల జీవితం లో !  అంటే చుంబనం, ప్రేమ వర్ధనం చేసే,  సహజ ఫెవి కాల్  ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. बहुत षुक्रिया बडी मेहर्बानी

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: