చుంబన రహస్యాలు !
చుంబనం !
ప్రేయసీ ప్రియుల వందనం !
ప్రణయ జీవితాల్లో అది చందనం !
రసమయ జీవన పారిజాతం !
అధర సంధి లో పొంగి , పారే ‘వల’పాతం !
మానవులకు ప్రకృతి ప్రసాదించిన ఒక అమూల్యమైన వరం, చుంబనం ! స్త్రీ పురుష సంబంధాలకు అతి ముఖ్యమైన వారధి ! ప్రేమ మయ జీవితాలకు పునాది ! మరి మానవులంతా ఈ విషయం తెలిసినా , చుంబనాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు ! అట్లాగని , సత్సంబంధాల కోసం, కనపడిన వారినల్లా ముద్దు పెట్టుకోమని కాదు ! ఒక పురుషుడు , ఒకే స్త్రీ తో కూడా బంధాల విషయం లో కూడా , ఈ చుంబనం అనే ‘ ప్రేమ పరికరాన్ని ‘ సవ్యం గా వినియోగించుకోలేక పోతున్నారు , కారణాలు అనేకమైనప్పటికీ ! ఈ విషయం మీద అనేకమైన పరిశోధనలూ , పరిశీలనలూ , జరిగాయి , జరుగుతున్నాయి కూడా ! మరి శతాబ్దాలుగా అంతు చిక్కని రహస్యం గా ఉండి పోయిన ఈ చుంబన రహస్యాలను , వచ్చే టపా నుంచి తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం !
ప్రేమ దరఖాస్తు మొదలెడతారనమాట.
ఆట పట్టిస్తున్నారు నన్ను !
ఆట పట్టించటం కాదండి, నిజం. ముద్దు ప్రేమకి దరఖాస్తు అన్నారండి.