Our Health

18. సేఫ్ కార్ డ్రైవింగ్. ప్రమాదం లో కర్తవ్యం ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 6, 2013 at 10:53 సా.

18. సేఫ్ కార్ డ్రైవింగ్. ప్రమాదం లో కర్తవ్యం ఏమిటి ? 

విదేశాలలో, రోడ్డు ప్రమాదాలకు ఎప్పుడూ ఇతర వాహనాలే కారణం అవననవసరం లేదనడానికి ఓ నిదర్శనం, పై చిత్రం ! 
మనం సామాన్యం గా కారు నడుపుతున్నప్పుడు , అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం కదా !  కానీ , ఈ ‘ అన్ని జాగ్రత్తలూ ‘ అనే పదం ఒక్కొక్కరి కీ ఒక్కో విధం గా ఉంటుంది !  బాగా చదువుకున్న వారు కూడా కారు విషయం లో తీసుకునే జాగ్రత్తలు సంపూర్ణం గా ఉండక పోవచ్చు . అట్లాగే  పెద్ద గా చదువు కోని వారు కూడా కారు నడపడం లో ఎక్కువ శాతం జాగ్రత్తలు తీసుకోవచ్చు !  ముఖ్యమైన విషయం : చదువు తో సంబంధం లేకుండా , కారు కు సంబంధించిన అన్ని విషయాలూ తెలుసుకోవడం , కారు నడిపే ప్రతి వారికీ అతి ముఖ్యం. క్రితం టపాలలో చెప్పుకున్నట్టు , కారు నడపడం అనేక  పరిస్థితు ల మీద ఆధార పడి ఉంటుంది ! వాటిలో కారు కు సంబంధించినవి ముఖ్యమైనవయితే , కారు నడిపే వారికి సంబంధించినవి అతి ముఖ్యమైనవి. కారు నడిపే వారికి కారు మీదా , వారు నడిపే రోడ్డు మీదా వారికి ఉన్న అవగాహన తో పాటుగా , వారి శారీరిక స్థితీ , మానసిక స్థితీ కూడా అతి ముఖ్యమైనవే ! ప్రత్యేకించి , కారు నడిపే సమయం లో వారి శారీరిక , మానసిక స్థితులు , వారి రోజు వారీ కార్యక్రమాలలో జరిగిన సంఘటనల వల్ల ప్రభావితం అయినప్పటికీ ,  ఆ ప్రభావం ఎట్టి పరిస్థితుల లోనూ , కారు నడిపే సమయం లో కనిపించ కూడదు. ఎందుకంటే కారు కేవలం అనేక మీటలూ , అంటే స్విచ్ లూ , గేర్ లూ , చక్రాలూ , మొదలైన పరికరాలు అమర్చి ఉన్న ఒక యంత్రం ! ఆ యంత్రం కేవలం ,ఆ యంత్రం లో వివిధ రకాల స్విచ్ లు ఏ విధమైన చర్యల కోసం అమర్చ బడి ఉన్నాయో , ఆ యా  చర్యలే చేస్తుంది !  ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , ఆ యంత్రాన్ని నడిపే మనకు వివిధ రకాల శారీరిక అలసట లు కానీ , మానసిక చీకాకు లు కానీ ఉన్నాయని ‘ తెలుసుకుని ‘ సురక్షితం గా ప్రయాణం సాగించదు ! అట్లాగే కారు నడిపే మనం , నిద్ర పోతూ ఉంటేనో ,లేదా ‘ మందు ‘ సేవించి , కారు నడుపుతూ ఉంటేనో , ‘ కారు యజమాని బాగా అలసి పోయి నిద్ర పోతున్నారు ‘ అనుకుని కానీ , లేదా  కారు యజమాని తీవ్రమైన మానసిక వత్తిడి కలిగి , మద్యం తాగి , కారు నడుపుతున్నారని కానీ , అనుకుని , ‘ వారిని సురక్షితం గా ఇంటికి చేరుద్దాం అని ‘ ఆలోచించదు ‘ ఆ యంత్రం ! అందువల్ల , కారు నడిపే అన్ని వేళలలోనూ , అత్యంత అప్రమత్తత తో నడిపితేనే , ప్రయాణం సురక్షితం అవుతుంది ! మన గమ్యం కూడా సునాయాసం గా చేరుకుంటాం ! 
కానీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి !  మరి అట్లా ప్రమాదం సంభవించినప్పుడు మన  కర్తవ్యం ఏమిటి ?  ప్రమాదం లో మనం చిక్కు కోక పోయినా కూడా , కొన్ని సమయాలలో , మన కళ్ళ ఎదురు గానే ప్రమాదం సంభవించ వచ్చు !  మనం తరచూ టెలి విజన్ లో చూస్తూ ఉంటాం ! ప్రమాదం జరిగినప్పుడు కానీ , లేదా  మనుషులు పొడుచు కుంటున్నప్పుడు కానీ మన దేశం లో ప్రజలు ఎక్కడ లేని వైరాగ్యం ప్రదర్శించి , తమకు ఈ భవ బంధాలు ఏవీ పట్టనట్టు , ఏమాత్రం విచారించ కుండా, తప్పుకుని పోతూ ఉంటారు , కళ్ళ  ఎదురు గానే అనేక అకృత్యాలు జరుగుతున్నా కూడా ! ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం లో పాల్గొని తిరిగి వచ్చిన బ్రిటిష్ సైనికుడు ఒకడిని నడి రోడ్డుమీదే ఇద్దరు హంతకులు హతమార్చారు గొంతు కోసి ! ఆ సందర్భం లో అక్కడే ఉన్న ఇద్దరు స్త్రీలు, ఆ హంతకుల తో మాట్లాడుతూ , వారిని ఎంగేజ్ చేస్తూ , వారిని  ఇతరుల మీద దాడి చేయకుండా , ధైర్యం గా నివారించ గలిగారు ! కేవలం ఇద్దరు స్త్రీలు ! 
ప్రమాద సమయాలలో ఖచ్చితం గా మాట్లాడాలంటే , దేశ ప్రజల బాధ్యత ఏమీ లేక పోయినప్పటికీ , ఆ యా సమయాలలో అక్కడ ఉండడం వల్ల సాటి మనిషి ఆపద లో ఉంటే , సహాయం చేయడం కనీస మానవ ధర్మం కదా !  సామాన్యం గా, ఏ ప్రమాదం జరిగినా కూడా , అందులో గాయ పడిన వారికి , ప్రమాదం జరిగిన తరువాతి గంటలో అందే సహాయం అత్యంత ముఖ్యమైనది ,  వారికి జీవం పోసేదీ అవుతుందని అనేక శాస్త్రీయ పరిశీలనల వల్ల స్పష్టమైనది ! అందువల్ల కారు నడిపే అందరికీ , ప్రధమ చికిత్స లో ట్రైనింగ్ ఇవ్వడమూ , తీసుకోవడమూ కూడా ముఖ్యమే ! ఎందుకంటే , వారు కానీ , ఇతరులు కానీ ప్రమాదం లో తీవ్రం గా కానీ / స్వల్పం గా కానీ గాయ పడితే ,వారు నేర్చుకున్న ప్రధమ చికిత్స ఎంత గానో ఉపయోగకరం గా ఉంటుంది !  ఎమర్జన్సీ సర్విస్ వారు వచ్చే లోగా ! 
1. ప్రమాద స్థలం నుంచి , యాక్సిడెంట్ రిస్కు ఉన్న వారినందరినీ  సురక్షిత ప్రాంతానికి చేర్చాలి. 
2. కారు  నుంచి డేంజర్ సిగ్నల్ ను అందరికీ కనిపించేట్టు ఆన్ చేయాలి . ( హజార్డ్ లైట్ లను ఆన్ చేయాలి ) 
3. అది మిగతా వాహన దారులకు వార్నింగ్ అవుతుంది. 
4. అమ్ బ్యులెన్స్ వారికి ఫోన్ చేసి అన్ని వివరాలు స్పష్టం గా ఇవ్వాలి ! 
ఒక వేళ మీరే కనక ప్రమాదం లో చిక్కుకుంటే , మీ ప్రమాదానికి కారణమైన ఇతర వాహన వివరాలను నోట్ చేసుకోవడం , వీలయితే కనీసం సెల్ ఫోన్ తో నైనా కొన్ని కోణాలలో ప్రమాద దృశ్యాలను ఫోటో తీసుకోవడం చాలా ఉపయోగ కరం , ఉత్తరో త్తరా , ఇన్స్యురెన్స్ క్లెయిమ్ ల కోసం కూడా ! ఎందుకంటే , భారత దేశం లో ( కొన్ని ఇతర దేశాలలో కూడా నేమో నాకు తెలియదు ! )  ప్రతి వాహన దారుడూ , ప్రమాదం సంభవించి నప్పుడు , తప్పని సరిగా , తనది ఏమీ తప్పు లేదనీ , తప్పంతా ఇతర వాహన దారులదే ననీ వాదిస్తాడు , వీలయితే వారి మీద చేయి చేసుకుంటాడు కూడా ( నోటి తో పాటు గా ! ) ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 
  1. మంచి అవగాహనతో కూడిన సందేశాన్ని ఇచ్హారు, బొమ్మద్వారా కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయో చెప్పకనే చె ప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: