17. సేఫ్ కార్ డ్రైవింగ్.కారు బ్రేక్ డౌన్ లో ఏం చేయాలి ?

మనం కారు లో కూర్చున్నంత సేపూ , సురక్షితం గా ప్రయాణం చేసి , ఇంటికి ఎప్పుడు చేరుతామా అనే ఆలోచిస్తూ ఉంటాము. అంటే , ఏ ప్రమాదాలూ లేకుండా, అది సహజమే కదా ! కానీ కారు అకస్మాత్తు గా రోడ్డు మీద బ్రేక్ డౌన్ అవుతే మన కర్తవ్యం ఏమిటి ? అనే విషయం అంత సీరియస్ గా పట్టించు కోము కదా ! మరి ఆ విషయాలు కూడా ముందే తెలుసుకుంటే , ప్రయాణం సురక్షితం అవడమే కాకుండా , సకాలం లో సహాయం అంది , మన ‘ గూళ్ళ ‘ కు చేరుకోగలం కూడా ! ఉన్నట్టుండి కారు రోడ్డు మీద బ్రేక్ డౌన్ అవుతే , రెండు రకాలు గా ప్రమాదాలు సంభవించ వచ్చు ! ఒకటి మన కారు మోటారు వే మీద కనుక బ్రేక్ డౌన్ అవుతే , ఇతర వాహనాలు అది గమనించ కుండా , నేరు గా, వేగం గా వచ్చి గుద్దు కోవడం వల్ల ! రెండు ఆ సమయం లో మనకే కాకుండా , ఇతర వాహన దారులు కూడా ప్రమాదాల బారిన పడడం !
వెంటనే చేయవలసినదేంటి ?
కారు సడన్ గా బ్రేక్ డౌన్ అవగానే విపరీతం గా ఆందోళన చెంది , ఒక్క సారిగా కారు బ్రేక్ మీద, గట్టిగా కాలు ( పాదం ) పెట్టి , బ్రేక్ వేయ కూడదు. అవును , బ్రేక్ సడన్ గా వేయకూడదు. స్టీరింగ్ ను కంట్రోలు చేస్తూ కారును రోడ్డు మీద ఒక సరళ రేఖ లోనే నడుపుతూ , వేగాన్ని నియంత్రించు కుంటూ , వీలైనంత త్వర గా కారును రోడ్డుకు ఎడమ ప్రక్కకు తీసుకు పోవాలి ( అంటే నడపాలి ). ఇట్లా చేయడం వల్ల , కారు ను మనం మనకు వీలైనంత తక్కువ అవ కాశం కలిగిస్తాము , ఇతర వాహనాలతో గుద్దు కోడానికి ! మోటారు వే మీద కారు బ్రేక్ డౌన్ అయినా కూడా కారును ఇదే విధం గా , రోడ్డుకు వీలైనంత ఎడమ వైపు కు తీసుకు వెళ్ళాలి , ( విదేశాలలో , సామాన్యం గా, ఈ ఎడమ ప్రక్క ప్రదేశాన్ని హార్డ్ షోల్డర్ అంటారు , మరి భారత దేశం లో రోడ్ల మీద కూడా ఇవి ఉండి తీరాలి, ఎవరూ ఆక్రమించు కోకుండా ఉంటే ! )
a హజార్డ్ లైట్ లను ఆన్ చేయాలి
b . బయట చీకటి గా ఉంటే , కారు సైడ్ లైట్ లను కూడా ఆన్ చేయాలి !
c. కారు లోంచి వీలైనంత త్వరగా బయటకు రావాలి , సైడ్ డోర్ ను ఓపెన్ చేసి. మిగతా వాహనాలు వేగం గా వెళుతున్న సైడ్ నుంచి ఎప్పుడూ బయటకు రాకూడదు ! కారణం వివరించ నవసరం లేదు కదా !
d. పెంపుడు జంతువులను కార్ లోనే ఉంచడం శ్రేయస్కరం !
e. మన తో పాటు గా మన కారులో ప్రయాణం చేస్తున్న ఇతర ప్రయాణీకులు కూడా హార్డ్ షోల్డర్ కు వీలైనంత దూరం గా అంటే రోడ్డుకు వీలైనంత దూరం లో నిలబడడం క్షేమ దాయకం !
వెంటనే ఎమర్జెన్సీ సర్విస్ వారికి ( బ్రేక్ డౌన్ సర్విస్ ) ఫోను చేయాలి. విదేశాలలో ప్రత్యేకించి ఈ అవసరానికే , మోటార్ వే ల మీద అక్కడక్కడా ఫోన్ లు అమర్చి ఉంటాయి ! వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే , మనం ఆ ఫోన్ లనుంచి ఫోన్ చేయగానే , ఎమర్జన్సీ సర్విస్ వారికి తెలిసి పోతుంది , ఖచ్చితం గా మనం మోటార్ వే మీద ఎక్కడ ( అంటే ఎన్ని మైళ్ళ దూరం లో ) ఉన్నామో ! భారత దేశం లో ఇట్లాంటి ఎమర్జెన్సీ ఫోన్ లు నాకు తెలిసినంత వరకూ అమర్చ లేదు ! ఒక వేళ అమర్చినా , ఆ ఫోన్ బాక్స్ లు ఖాళీ అయి పోతాయి అమర్చిన కొద్ది క్షణాల లోనే , ఎవరైనా ఫోన్ చేసినా , ఎమర్జెన్సీ సర్విస్ వారు , ఆ ఫోన్ ను అనేక మైళ్ళ దూరం లో , ఉండే ఇళ్ళలో లోకేట్ చేస్తారు ! అందువల్ల మొబైల్ ( సెల్ ) ఫోన్ ను ఎప్పుడూ పని చేసే కండిషన్ లో ( చార్జ్ చేసుకుని ) ఉంచు కోవడం క్షేమ దాయకం , ప్రత్యేకించి , వాహనాలు నడిపే వారు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
very good.I follow even though i wont drive and v car