16.సేఫ్ కార్ డ్రైవింగ్. సదా కారు సురక్షితం గా నడపాలంటే పధకం ఏమిటి ?
( పైన ఉన్న చిత్రం హైదరాబాదు లో రోడ్డు మీద ట్రాఫిక్ ! ) ప్రతి వారూ అర్జంట్ గా వెళ్ళాలి ! ఎక్కడికి ?
కారున్న ప్రతి వారూ, ఎప్పడూ, కారు సురక్షితం గానే నడుపుదామనుకుంటారు కదా ! మరి మనకు ఏమైనా పధకం ఉందా ,అట్లా సురక్షితం గా నడప డానికి ? అని ఆలోచించుకుంటే కొన్ని ముఖ్య విషయాలు గోచరిస్తాయి !
1. సరి అయిన గేరు
2. సరి అయిన వేగం
3. సరి అయిన స్థానం.
మనం కారు నడిపే సమయం లో అత్యంత సురక్షితం గా నడపాలంటే ఎప్పుడూ, పైన సూచించిన లక్షణాలు దృష్టి లో పెట్టుకునే డ్రైవ్ చేయాలి ! మనం ఎప్పుడూ , కారును సరైన గేరు లోనే పోనిస్తూ , కారు వేగాన్ని ఎప్పుడూ మన నియంత్రణ లోనే ఉంచుకోవాలి ! అట్లాగే రోడ్డు మీద మన స్థానాన్ని ఎప్పుడూ సురక్షితమైన స్థానం గానే చూసుకోవాలి ! ఉదా : ఒక లారీ నిండా ఇటుకలు ఉంటే, త్వరగా ఆఫీసు కు వెళ్లాలని , ఆ లారీ ను అతుక్కుని డ్రైవింగ్ చేసినట్టు గా , ఏమాత్రం మధ్య స్పేస్ ఉంచకుండా , ఆ లారీ బ్రేక్ వేస్తే, తగిలేంత దూరం లో కారును నడుపుతుంటే , వేగం గా పోతున్న ఆ లారీ డ్రైవరు , ముందు అడ్డం వచ్చిన సైకిలిస్ట్ ను తప్పించ తప్పించ డానికి , సడన్ గా బ్రేక్ వేశాడనుకోండి ! అప్పుడు జరిగేది ? : మనం నడుపుతున్న కారు మీద ఇటుకల వర్షం ! ( ఎందుకంటే ఇటుకలు న్యూటన్ మొదటి సూత్రం పాటిస్తాయి కనుక ! ) ఆ వెంటనే మన కారు గ్యారేజీ సూత్రం పాటిస్తుంది ! మన అదృష్టం బాగుంటే , మనం హాస్పిటల్ సూత్రం నుంచి తప్పించు కుంటామేమో ! ఇదే పరిస్థితి , మనం నడిపే కారుకూ , ముందు వెళ్ళే లారీ కీ, మూడు నాలుగు కార్ల ఎడం ఉంచి ఊహించుకుంటే , ఎంత సురక్షితం అవుతుందో కదా ! లారీ , కారూ రెండూ సడన్ బ్రేక్ వేసినా కూడా ! పైన చెప్పినవే కాక , ఈ క్రింది లక్షణాలు కూడా , మన డ్రైవింగ్ ను ఎంతో సురక్షితం చేస్తాయి.
1. బాధ్యత : కారు ను రోడ్డు మీద బాధ్యతా యుతం గా నడపాలి ! మనం భారత దేశం లో చూసే అతి సాధారణ దృశ్యం , వాహనం పెద్దదవుతున్న కొద్దీ బాధ్యతా రాహిత్యం ఎక్కువ అవుతూ ఉంటుంది ! లారీలకు వ్యాన్లూ , వ్యాన్లకు , కార్లూ , కార్లకు మోటార్ సైకిలిస్ట్ లూ , వాళ్లకు సైకిలిస్ట్ లూ ! ఇట్లా ప్రతి పెద్ద వాహనానికీ , చిన్న వాహనదారులు తేలిక భావం ! రోడ్డు మీద పెద్ద వాహనాలు పోతుంటే మిగతా వారు తప్పుకోవాలి , వారిది ఏ తప్పూ లేక పోయినా కూడా ! రోడ్డు ఉపయోగిస్తున్న ప్రతి వారూ రోడ్డు టాక్స్ కడుతున్నప్పటికీ ! ఈ ప్రవృత్తి చాలా అనర్ధ దాయకం , ప్రమాద కరం కూడా ! ప్రతి వాహన దారుడూ అత్యంత బాధ్యతా యుతం గా కారు నడపాలి !
2. జాగ్రత్త : అప్రమత్తతా, జాగ్రత్తా కూడా చాలా ముఖ్యమైన లక్షణాలు , కారు నడిపే ప్రతి వారికీ ఉండవలసినవే ! ( ఆమాటకొస్తే , ప్రతి వాహనదారుకూ ఉండవలసిన లక్షణాలు ! )
3. మర్యాద లేదా సౌజన్యం : ప్రయాణాలు , దూరాలూ, ఇతర వాహనదారులతో మర్యాదా , సౌజన్యం తో ప్రవర్తిస్తే , తక్కువ టెన్షన్ తో , ఎక్కువ తృప్తి కరం గా సాగుతాయి ! రెక్ లెస్ గా ఇతర వాహన దారులను ఏమాత్రం పట్టించుకో కుండా ! ( హైదరాబాదు లో ) ఆటో డ్రైవర్ ల లా డ్రైవింగ్ చేయ కూడదు !
4. దూరం : ఖచ్చితం గా చెప్పుకోవాలంటే , మనం కారు లో ప్రయాణం చేస్తున్నప్పుడు , అంటే, కారు నడుపుతున్నప్పుడు , ఇతర వాహనాలకూ , మనకూ ఎప్పుడూ తగినంత దూరం ఉంచుకునే డ్రైవింగ్ చేస్తూ ఉండాలి ! అంటే, ఏ సమయం లోనైనా మన ముందు వాహనాలకూ , మన కారుకూ కనీసం రెండు మూడు కార్లు పట్టే దూరం ఉండాలి ! హైదరాబాదు , ముంబాయి , మద్రాసు , ఢిల్లీ వాసులంతా , నేను తల తిక్క గా మాట్లాడుతున్నానాను కుంటారు కదా ! కానీ ఇట్లా, రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి వాహనదారుడూ అనుకుని డ్రైవ్ చేస్తే ఎంత హాయి గా ఉంటుందో ! ఎందుకంటే, ఈ చెప్పిన పట్టణాలలో , కేవలం రైలు పట్టాలు ఉన్న చోట తప్పించి ఇంకెక్కడా గేట్లు మూసి వేయరు కదా ! మరి ఎందుకు ముందున్న వాహనం ‘ మీద పడడం ‘ ? ?? రెండు మూడు కార్ల ఎడం ఉంటే ఎంత ఆలస్యం అవుతుంది ప్రయాణం ???

పైన ఉన్న చిత్రం, కాలిఫోర్నియా లో రోడ్డు మీద ట్రాఫిక్ ! ఇక్కడా, ప్రతి వారూ అర్జంట్ గా వెళ్ళాలి ? అందుకే, క్రమ శిక్షణ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
All ur posts on car driving r a good guide
Thanks.
nice photoes
Thanks.
కనీసం కొందరు ఈ రూల్స్ పాటించినా ట్రాఫిక్ బెటర్ అవుతుంది. appreciated keeping good info in one place..