1. రక్షిత కారు చోదకం ( సేఫ్ గా కారు నడపడం) ఎట్లా ?
కారు సేఫ్ గా నడపడానికి ప్ర ప్రధమం గా కావలసినది ,( right attitude ) రైట్ యాటి ట్యూ డ్, అంటే సరి అయిన ప్రవృత్తి . మోటు గా , ఓపిక కోల్పోయి , బాధ్యతా రహితం గా కారు నడిపితే , నడిపే వారే కాక , ఆ కారులో ప్రయాణిస్తున్న వారితో పాటుగా , రోడ్డును ఉపయోగిస్తున్న ఇతర ప్రయాణికుల భద్రతా , పాద చారుల భద్రతా కూడా అపాయం లో పడుతుంది. ఈ రైట్ యాటి ట్యూ డ్, అనేక శారీరిక , మానసిక పరిస్థితుల మీద ఆధార పడి ఉంటుంది. ముఖ్యం గా, సరిపడినంత నిద్ర లేకపోవడమూ , విపరీతం గా అలసి పోయి ఉండడమూ , లేదా మద్యం , ఇతర మాదక ద్రవ్యాలు తీసుకుని ఉండడమూ , లేదా తీవ్రమైన మనస్తాపం చెందుతూ ఉండడమూ , అంటే తీవ్రమైన మానసిక వత్తిడి తో ఉండడమూ – లేదా ఆహారం కానీ పానీయాలు కానీ చాలా సమయం వరకూ తీసుకోకుండా , డ్రైవ్ చేయడమూ – ఈ కారణాలన్నీ కూడా రైట్ యాటి ట్యూ డ్ ను తీవ్రం గా ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితులలో , ఓపిక నశించి డ్రైవింగ్ పొరపాట్లు చేసే రిస్కు ఎక్కువ అవుతుంది !
నిద్ర లేక పోవడం , అప్రమత్తత ను తక్కువ చేస్తుంది, అట్లాగే మద్యం సేవించడం వల్ల కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది కానీ ఆ కాన్ఫిడెన్స్ కేవలం ఫాల్స్ కాన్ఫిడెన్స్ మాత్రమే ! అంటే ( తాగి ) డ్రైవింగ్ చేస్తున్న వారు , తాము వంద మైళ్ళ వేగం తో డ్రైవింగ్ చేస్తున్నా కూడా చాలా సురక్షితం గా డ్రైవ్ చేస్తున్నామనే ఆత్మ విశ్వాసం తో ఉంటారు, యాక్సిడెంట్ అయ్యే కొద్ది క్షణాల ముందు వరకూ కూడా ! అందుకని మద్యం తాగి కారు నడపడం నిషిద్ధం ! వారు టాక్సీ లో బార్ కు కానీ పబ్ కు కానీ వెళ్లి , ఇంటికి కూడా టాక్సీ లో వెళ్ళడమే ఉత్తమం , ఎందుకంటే , కనీసం , రోడ్డు మీద ఉన్న ఇతర ప్రయాణికులు సురక్షితం గా ఉంటారు , అట్లా చేస్తే ! ( ఈ సలహా తో , మద్యం తాగడాన్ని ప్రోత్స హిస్తున్నట్టు కాదు ! )
ఈ క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే , భారత దేశం లో 2010 లో రోడ్డు ప్రమాదాల వివరాలు గమనించ వచ్చు ! అందులో కనీసం నలభై శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల సంభవించినవే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
shubham. manchi post tho modalu pettaru. keep it up
good