స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?7. ఏ గర్భ నిరోధక పిల్స్ తో జుట్టు పలుచబడదు ?

స్త్రీలలో కేశవర్ధనం లో భాగం గా క్రితం టపాలో టీలోజెన్ అనే ముఖ్య కారణం గురించి తెలుసుకున్నాం కదా ! మరి కాంట్రా సెప్ టివ్ పిల్స్ మాటేంటి ? కాంట్రా సెప్ టివ్ పిల్స్, వీటినే గర్భ నిరోధక పిల్స్ అని కూడా అంటారు కదా !
సామాన్యం గా ఈ రకమైన పిల్స్ ఎంతో క్షేమ దాయక మైనవి. చాలా మందిలో ఏవిధమైన సైడ్ ఎఫెక్ట్ లూ రావు. అంతే కాక చాలా సమర్ధ వంతం గా గర్భాన్ని నిరోధిస్తాయి ! కానీ కొన్ని రకాల గర్భ నిరోధక పిల్స్ , జుట్టు ఊడి పోవడానికి కారణం అవుతాయి. ప్రత్యేకించి యాన్ డ్రో జన్ అంటే పురుష హార్మోను కలిసి ఉన్న పిల్స్ స్త్రీలు ఎక్కువ కాలం వాడితే , అవి జుట్టు పలుచ బడడానికి కారణ మవుతాయి .
అమెరికాలో ఈ జుట్టు ఊడి పోవడం అనే సమస్య మీద విపరీతమైన అవేర్ నెస్ ఉంది , ప్రజలలోనూ , ప్రభుత్వం లోనూ ! అందుకనే అక్కడ హేర్ లాస్ అసోసియేషన్ అని ఒక సంఘం ఉంది ( A H L A ). ఆ సంఘం , నిపుణుల తో , మార్కెట్ లో లభ్యం అవుతున్న కాంట్రా సెప్ టివ్ పిల్స్ మీద నిపుణుల చేత విశ్లేషణ చేయించి ఈ క్రింది సూచనలు చేసింది :The American Hair Loss Association (ALHA) recognizes that for the most part oral contraceptives are a safe and effective form of birth control. It also recognizes that the Pill has been clinically proven to have other health benefits for some women who use them. However, the AHLA believes that it is imperative for all women — especially for those who have a history of hair loss in their family — to be aware of the potentially devastating effects birth control pills can have on normal hair growth.The AHLA recommends that all women interested in using oral contraceptives for the prevention of conception should only use low-androgen index birth control pills. Pills with the least androgenic activity include norgestimate (in Ortho-Cyclen, Ortho Tri-Cyclen), norethindrone (in Ovcon 35), desogestrel (in Mircette), or ethynodiol diacetate (in Demulen, Zovia).
1. తప్పని సరి పరిస్థితులలో , బర్త్ కంట్రోలు కోసం పిల్స్ వాడుదామని నిర్ణయం తీసుకుంటే , స్త్రీలు వీలైనంత తక్కువ యాన్ డ్రో జెన్ ఉన్న పిల్స్ నే వాడాలి. అంటే వారు తీసుకునే పిల్స్ లో యాన్ డ్రో జెన్ అతి తక్కువ పాళ్ళ లో ఉండాలి !
2. నార్ జేస్టి మేట్ , నార్ ఎథిన్ డ్రో న్ , డిసో జెస్ ట్రె ల్ ఇంకా ఎథినొ డయోల్ డై ఎసిటేట్ . ఈ మందులలో అతి తక్కువ శాతం యాన్ డ్రో జెన్ ఉంటుంది.
ఈ క్రింద సూచించిన ప్రో జెస్టిన్ ఉన్న మందులు తీసు కుంటే అవి ఎక్కువ జుట్టు ఊడి పోవడానికి రిస్కు ఎక్కువ చేస్తాయి
1. ప్రో జెస్టిన్ ఇంప్లాంట్ లు ( వీటినే నార్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు )
2. ప్రో జెస్టిన్ ఉన్న హార్మోను ఇంజెక్షన్ లు
3. ప్రోజేస్టిన్ ఉన్న స్కిన్ ప్యాచ్ లూ
4. లేదా ప్రో జెస్టిన్ ఉన్న వాజైనల్ రింగ్ లూ.
పైన ఉదహరించిన పిల్స్ కనుక దీర్ఘ కాలం తీసుకుంటే , అవి సహజం గానే శరీరం లో హార్మోనులలో తీవ్రమైన మార్పులు కలిగించి , గర్భ నిరోధం కలిగించడమే కాకుండా , జుట్టు ఊడి పోవడానికీ , ముఖ్యం గా పలుచ బడ డానికి కారణమవుతాయి ! ప్రత్యేకించి వంశ పారంపర్యం గా జుట్టు ఊడి పోవడం సమస్య ఉన్న వారు ఈ విషయం లో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి ! మీకు పిల్స్ తీసుకోవడం తప్పని సరి అనిపించినపుడు , పైన ఉన్న విషయాలు మీరు అవగాహన చేసుకోవడమే కాక , మీరు స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళినపుడు , ఈ విషయాలు వారితో కూడా ముఖా ముఖీ గా చర్చించి , మీకు క్షేమ దాయకమైన పిల్స్ ను రాయించు కోవాలి ! ప్రత్యేకించి దీర్ఘ కాలం కనుక పిల్స్ వాడుదామని నిర్ణయం తీసుకుంటే !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !