Our Health

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?5. టీలోజెన్ ఎఫ్లూవియం.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూలై 28, 2013 at 11:32 ఉద.

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?5. టీలోజెన్ ఎఫ్లూవియం. 

 
పథ్యం మానకు అతివా, అను నిత్యం ,
నీ అందం చెదరదు, ఇది సత్యం!
నీ  మనసు కూడా  పదిలం !
నీ సొగసూ అపుడే  పగడం !
 

 
టీలోజెన్ ఎఫ్లూవియం స్త్రీలలో జుట్టు ఊడి పోవడానికి అతి ముఖ్యమైన పరిస్థితి లేదా జబ్బు. దీనిని గురించి మనం వివరం గా తెలుసుకుందాం ! 
కేశ ఫాలికిల్స్ సంఖ్య లో మార్పు రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. T E  ( టీలోజెన్ ఎఫ్లూవియం కు సంక్షిప్త నామం లేదా షార్ట్ ఫామ్ ) తల మీద కేశాలు నిరంతరం పాతవి పోతూ , కొత్తవి వస్తూ ఉంటాయి. ఈ క్రియల మధ్య ఉండే కాలాన్ని లేదా దశను టీలోజెన్  అని అంటారు. అంటారు ఇది సహజమైన దశే  అయినా , కొన్ని పరిస్థితులలో సాధారణ సమయానికంటే ఎక్కువ సమయం ఉండడం వల్ల , కొత్త జుట్టు రాక  పోవడం ,ఆలస్యమవుతూ ఉంటుంది . ఈ లోగా రోజూ సహజం గా ఊడి పోయే జుట్టు పోతూ ఉంటుంది.  ఫలితం గా జుట్టు పలుచ బడి పోతూ ఉంటుంది. 
ఇట్లా పలుచ బడి పోవడం ముఖ్యం గా మూడు రకాలు గా జరుగుతుంది. 
1. అకస్మాత్తు గా కలిగే షాక్ వల్ల : షాక్ కలిగిన ఒకటి రెండు నెలల నుంచి , కేశాలు పెరిగే దశ కాస్తా విశ్రాంతి తీసుకుంటుంది. అంటే దీనిని రెస్టింగ్ ఫేజ్ అని అంటారు. ఈ రకమైన షాక్ ల ప్రభావం తాత్కాలికమే ! అంటే కనీసం నాలుగు నుంచి ఆరు నెలల కాలం లోగా మళ్ళీ సహజం గా అంటే ఇది వరలో ఎన్ని వెంట్రుక లైతే వచ్చేవో అన్నీ మామూలు గా వస్తాయి ( లేదా మొలుస్తాయి ). ఒక సంవత్సరం లోగా పూర్తి గా నార్మల్ గా అవుతుంది తల మీద పరిస్థితి !
2. రెండో రకమైన టీలోజెన్  లో తలమీద జుట్టు ఊడి పోవడం ఆలస్యం అవుతుంది కానీ దానితో పాటుగా , మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చే మధ్య సమయం , అదే టీలోజెన్  పరిస్థితి ఎక్కువ కాలం ఉంటుంది. గమనించ వలసినది టీలోజెన్  అంటే రెస్టింగ్ దశ ! ఈ రెస్టింగ్ దశ ఎంత సాగుతూ ఉంటే కొత్త వెంట్రుకలు రావడం కూడా అంత ఆలస్యం అవుతూ ఉంటుంది.కేశాల ఫాలికిల్స్ సరిఅయిన సంఖ్య లోనే ఏర్పడుతూ ఉంటాయి కానీ వాటిలో కేశాలు మాత్రం పెరగవు ఈ రకం లో.  ఈ రకమైన టీలోజెన్ లో సామాన్యం గా   ఆ వ్యక్తి  అనుభవిస్తున్న సమస్య లేదా వత్తిడి కలిగించే పరిస్థితి , పరిష్కారం కాక , కొనసాగుతూ ఉంటే , జుట్టు రావడం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. 
3. ఇక మూడో రకమైన T E లో వెంట్రుకలు కురచగా నూ త్వర త్వరగానూ వస్తూ ఊడి పోతూ ఉంటాయి. దీనికి కారణం, వెంట్రుకలు పెరిగే సహజ దశలో అవక తవకలు జరగడం. 
పైన తెలుసుకున్న వాటిలో మొదటి రెండు రకాల టీలోజెన్ కూ , తీవ్రమైన శారీరిక వత్తిడి కానీ , మానసిక వత్తిడి కానీ కారణాలు. ఈ మూడు పరిస్థితులలో కూడా జుట్టు పలుచ బడుతుంది , కానీ పూర్తి గా రాలి పోదు. అంతే కాక సాధారణం గా ఈ మూడు పరిస్థితులూ తాత్కాలికమే. రెండో పరిస్థితి కొంత ఏర్పడితే , అది ఎక్కువ కాలం కొనసాగ వచ్చు. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. బావుంది. పేను కొరుకుడు అంటారు. దాని గురించి చెప్పగలరు.

  2. ఇంగ్లీషు లో ‘ పేను కొరుకుడు ‘ ను ఏమంటారో తెలియచేయండి ! కేవలం పేల వల్ల ఆ పరిస్థితి ఏర్పడితే , దాని గురించి తెలుసుకోవచ్చు.

  3. పేను కొరుకుడు అన్నదానికి ఇంగ్లీషు పదం తెలియదు. ఇది పేలవల్ల కాదు. తల మీద గడ్డం మీద కాని ఇది వస్తుంది. ఒక చిన్న పేచ్ లా ఏర్పడి అక్కడి వెంట్రుకలు రాలిపోతాయి. చర్మం బిరుసెక్కుతుంది. ఊరుకుంటే వ్యాపించిపోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: