స్త్రీలలో కేశ వర్ధనం ఎట్లా ? 3.
( మొక్క జొన్న కండె లో మొక్క జొన్నల మాదిరి గా ఉండే హేర్ స్టయిల్ )
అశ్వ జాలం,
మొక్క జొన్నలు,
వరాహ జాలం !
ఒక్కో తరహా ,
ఒక్కో మాయా జాలం !
చక్కని, చిక్కని ప్రణయ గాలం !
ఎట్లా తప్పించు కోగలం?!
3. అలోపీశియా ఏరియే టా : ఈ రకం లో తల మీద జుట్టు తలంతా కాక కేవలం కొన్ని ప్రదేశాలలో , అంటే ఒకటో రెండో లేదా మూడో , ప్రదేశాలలో , కొంత మేర అంటే కొన్ని అంగుళాల వ్యాసం లో జుట్టు రాలుతుంది. అంటే తల మీద కొన్ని కొన్ని ప్రదేశాలలో జుట్టు రాలిపోవడం వల్ల , కొన్ని పాచెస్ ఏర్పడతాయి ! ఈ పాచెస్ చాలా ఆందోళన కలిగిస్తాయి, ఉన్న వారికి ! ఇట్లా అలోపీశియా ఎరియే టా అంటే తల మీద కొన్ని ఏరియా ల లో మాత్రమే జుట్టు ఊడిపోవడం జరగ డానికి ప్రధాన కారణం , వెంట్రుక మూలాలలో అంటే రూట్స్ లో కొన్ని రకాలైన జీవ రసాయన చర్యలు జరగడం వల్ల. ఈ చర్యలలో ప్రధానం గా వారి రోగనిరోధక కణాలు వారి తల మీద ఉండే వెంట్రుకల మీద పని చేసి ( ఖచ్చితం గా చెప్పాలంటే వెంట్రుకల మొదళ్ళ లో లేదా రూట్స్ లో పనిచేసి ) అవి ఊడిపోవడానికి కారణమవుతాయి ! ఈ చర్యలు మందులు తీసుకున్నా , మందులు తీసుకోక పోయినా కూడా , కనీసం ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలం తరువాత , ఆగిపోయి , తిరిగి తలమీద నార్మల్ గా జుట్టు వత్తు గా పెరగ డానికి అవకాశం ఉంటుంది. కనీసం ప్రతి వంద మంది లో డెబ్బై మంది కి ఇట్లా జుట్టు తలమీద నార్మల్ గా పెరుగుతుంది ! అందువల్ల మెజారిటీ యువతులు ఆందోళన పడనవసరం లేదు !
4. ట్రాక్షన్ అలోపీశియా : తల మీద ఆరోగ్యవంతం గా పెరుగుతున్న వెంట్రుకలను అట్లా సహజం గా పెరగనీయక , వివిధ హేర్ స్టైల్స్ అని , వాటిని గట్టి గా లాగి జడ వేయడమూ , లేదా ముడి వేయడమూ చేస్తూ ఉంటే , వెంట్రుకల మూలాలలో ట్రాక్షన్ ఏర్పడుతుంది ! ఈ ఏర్పడ్డ ట్రాక్షన్ , రోమ మూలాలను బలహీనం చేసి, అవి ఊడి పోయేట్టు చేస్తుంది ! పంది పిలకలూ, గట్టి జడలు , గుర్రం తోకలూ ! రక రకాల రీతులు ! అతివల శిరోజాలంకరణలు , ! కానీ, రక రకాలు గా బలి అవుతాయి కురులు ! ప్రత్యేకించి అట్లాంటి స్టయిల్స్ ప్రతి రోజూ చేసుకుంటూ ఉంటే ! ( వీటినే ఆంగ్లం లో స్టైల్ గా పోనీ టెయిల్ అనీ, పిగ్ టెయిల్ అనీ , బ్రెయిడ్ అనీ పిలుస్తారు కదా ! )

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !