స్త్రీలలో కేశ వర్ధనం . 2.
నీ వాలు జడలో సంపెంగలు,
ఉన్మత్తుని చేసే నులి వెచ్చని సెగ లు !
తుమ్మెద రెక్కలు, నీ కురులు !
తగిలితే , ఆ విద్యుత్తీగలు,
చేసె, గజి బిజి గమ్మత్తులు !
రేగె నాలో, సరాగాల రవ్వలు !
అవి పెనవేసే వేయి బంధాల వలలు !
అతి సున్నితం, ఈ భవ బంధం !
అత్యున్నతం, నీ మది బంధం !
అని వలచినవాడు మీ ‘ వలలో ‘ పడి పోవాలంటే, మీరు, మీ శిరోజాల మీద శ్రద్ధ వహించాల్సిందే !
మరి ఇప్పుడు స్త్రీలలో కేశాలు ఊడిపోవడం ఎన్ని రకాలు గా ఉంటుందో తెలుసుకుందాం !
1. యాన్ డ్రో జెనిక్ అలోపీశియా : ( యాన్ డ్రో జెనిక్ అంటే పురుష హార్మోనుల సంబంధమైన అని , అలోపీశియా అంటే కేశాలు తక్కువ అవడం అనీ అర్ధాలు, పెద్ద గా కంగారు అవసరం లేదు ఈ పదాలు చదివి ! ) : సాధారణం గా పురుష హార్మోనులు, స్త్రీలలో కూడా అతి తక్కువ పరిమాణం లో ఉంటాయి. ఏ కారణం చేతనైనా ఈ పురుష హార్మోనులు కొద్ది మాత్రమైనా ఎక్కువ అవుతే , జుట్టు ఎక్కువ గా రాలడం జరుగుతుంది.తల లో ఏదో కొంత భాగం లో కాకుండా , తలంతా, కొద్దిగా పలుచబడడం జరుగుతుంది, కేశ సాంద్రత తక్కువ అవడం వల్ల. ఈ పరిస్థితులు , స్త్రీలు గర్భవతులు గా ఉన్నపుడూ , లేదా పురుష హార్మోనులు ఉన్న కాంట్రా సె ప్టివ్ పిల్స్ కొన్ని రకాలు ఉంటాయి , అవి తీసుకోవడం వల్ల కానీ , లేదా అరుదైన అండాశయాలలో కణుతులు ఏర్పడడం , అంటే ట్యూ మర్ ఏర్పడడం వల్ల కానీ , ఏర్పడవచ్చు . ఈ కారణాలలో నివారింప దగ్గవి , గర్భ నిరోధక పిల్స్ తీసుకునే ముందు , అవి రాసే డాక్టర్ ను వివరం గా అడిగి , పురుష హార్మోనులు లేని పిల్స్ నే మీరు తీసుకోవడం చేయాలి , ఆ పిల్స్ మీరు తీసుకోవడం తప్పని సరి అయే పరిస్థితులు ఏర్పడితే !
2. టీలోజేన్ ఎఫ్లూవియం : జీవితం లోనూ , లేదా శరీరం లోనూ కలిగే తీవ్రమైన వత్తిడి కలిగించే పరిణామాలకు రియాక్షన్ లేదా ప్రతి చర్య గా , మీ శిరోజాలు ఊడి పోవడం జరుగుతుంది. ఇట్లా జరగడం సామాన్యం గా , వత్తిడి పరిస్థితులు సంభవించిన ఆరు వారాల నుంచి , మూడు నెలల వరకు ఉండవచ్చు !ఈ సమయం లో సామాన్యం గా ఊడిపోయే తల వెంట్రుకల కన్నా ఎక్కువ గా అంటే వందకు పైగా రోజుకు ఊడి పోవచ్చు !
మరి ఈ తీవ్రమైన వత్తిడి కలిగించే పరిస్థితులు ఏమిటి ? : ఇవి ఏవైనా కావచ్చు. ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ కానీ , ఒక పెద్ద ఆపరేషన్ కానీ , గర్భం దాల్చి శిశువుకు జన్మ నీయడం కానీ , లేదా తీవ్రమైన మానసిక వత్తిడి కానీ అవవచ్చు. ఆశా వాద పరిణామం ఏమిటంటే , సామాన్యం గా ఈ తీవ్రమైన శారీరిక , లేదా మానసిక వత్తిడి పరిస్థితులు, కేవలం తాత్కాలికం గానే హేర్ లాస్ అంటే తల మీద జుట్టు ఊడేట్టు చేస్తాయి. అంటే ఆ పరిస్థితులు సద్దు మణిగిన తరువాత , తిరిగి సహజమైన జుట్టు పెరగడమూ , తక్కువ గానే రోజూ ఊడి పోవడమూ జరుగుతుంది ! కేవలం తక్కువ శాతం స్త్రీలలో త్రమే,టీలోజెన్ పరిస్థితి ఎక్కువ కాలం కొన సాగుతుంది ! అప్పుడు వారు సరి అయిన సలహా తీసుకోవాలి , స్పెషలిస్టు డాక్టర్ ను సంప్రదించి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
బావుంది. మీరు మరో బ్లాగు ఓపెన్ చేయాల్సిన అవసరం చాలా అత్యవసరంగా ఉందని మనవిచేసుకుంటున్నా 🙂