విద్యార్ధులూ! ఊక దంపుడు కాదు మూక్ ( MOOC ) అంటే !
విద్య నిగూఢ గుప్తము ,కానీ పంచుకుంటే పెరిగేదీ విద్యే ! విద్యార్జన కోసం పడరాని కష్టాలు పడతారు , ప్రత్యేకించి చదువుకోడానికి చాలినన్ని వనరులు లేని వారు ! ధనం ఉన్న వారు అందరూ చదువుకోలేరు ! అట్లాగే ధనం లేనివారందరూ కూడా చదువులలో రాణించరు ! విద్య విలువ అందరికీ తెలిసినదే ! కానీ సరస్వతీ కటాక్షం మాత్రం అందరికీ ఉండదు కదా ! అంతర్జాలం ఆవిష్కరించ బడ్డాక , అది అంచలంచలు గా అభివృద్ధి చెందుతూ , విశ్వ మానవుల కు ఆనందాన్ని పంచ గలుగుతున్నది ! ఆనందం తో పాటుగా విజ్ఞానాన్నీఅంతర్జాలం ద్వారా పంచడానికి ” నడుం కట్టారు ” అంతర్జాలం అందరికీ అందుబాటు లో ఉండాలనుకునే గొప్ప విద్యావేత్తలూ , ధార్మిక దృక్పధం ఉన్న వారూ ! వారి ఆవిష్కారమే మూక్ అంటే ” మ్యాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సెస్ ” ( MOOC )
( MOOC )మూక్ తో మీకు ఎన్ని లాభాలో చూడండి :
1. మీకై మీరే , మూక్ ను అంటే మీకు నచ్చిన కోర్సు ను అనుసంధానం చేసుకోవచ్చు , మీకు కావలసినదల్లా ఒక కంప్యుటరూ , ఇంటర్నెట్ కనెక్షనూ మాత్రమే ( మీరు వాడే కంప్యూటర్ , మీ సొంతది కూడా అవనవసరం లేదు కూడా ! )
2. ప్రధానం గా అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు లోనే కోర్సులు వుంటాయి.
3. మీరు విద్యార్జన లో ప్రాంతీయ , కాల , ( అంటే time and physical boundaries ) పరిధులను అధిగ మించి చదువుకోవచ్చు ! అంటే ఉదాహరణకు , ఆంధ్ర ప్రదేశం లో నిజామాబాదు లో ని గాంధారి మండలం లో ఉన్న వారు కూడా అమెరికా లోని ప్రతిష్టాత్మక మైన విశ్వ విద్యాలయ విద్యార్ధి గా నమోదు చేయించుకుని వారికి ఇష్టమైన కోర్సు ను ఉచితం గా చదవ వచ్చు ! అట్లాగే విశాఖ పట్టణం దగ్గర మారు మూల ఉన్న గ్రామాలలో ఉన్న విద్యార్ధి కూడా , తన ఊరు నుంచి కదలకుండా అత్యంత ప్రామాణికం అయిన కోర్సులు చదవ వచ్చు , వేల మైళ్ళ దూరం లో ఉన్న విశ్వ విద్యాలయం లో నమోదు చేసుకుని !
4. మీరు ఏవిధమైన బెత్తాలూ , భయాలూ లేకుండా బాధ్యతా యుతం గా మీకై మీరే చదువుకోవచ్చు, ఇన్ఫార్మల్ వాతావరణం లో !
5. మీ కోర్సు లో చేరిన ఇతర విద్యార్ధులతో ఏమాత్రం మొహమాటం లేకుండా ఇంట రాక్ట్ అయి వారితో మీ సందేహాలను తీర్చుకోవడమే కాకుండా , మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు !
6. మీరు చేసే కోర్సు వరకే మీరు పరిమితం అవకుండా , ఇతర కోర్సులు చేసే వారితో కూడా పరిచయాలు ఏర్పరుచుకోవచ్చు !
7. మీకు ఒరిగే దల్లా , మీరు విజ్ఞాన వంతులు అవుతూ , మీ జీవితాంతం , కొత్త విషయాలూ , విజ్ఞాన సముపార్జన చేసుకోడానికి అత్భుతమైన అవకాశం !
8. మీరు కోర్సు చేయడానికి కనీసం ఒక డిగ్రీ కూడా అవసరం లేదు ! కేవలం మీ విజ్ఞాన కాంక్ష తప్ప !
9. ఇంకో అతి ముఖ్యమైన విషయం , మూక్ లో లభ్యమయే కోర్సులన్నీ కూడా ఉచితమే !
మరి ఆలస్యం ఎందుకు? పదండి ముందుకు ! క్రింద ఉన్న మూక్ వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేసి , మీ అవకాశాలను అందుకోండి , కృషి తో మీ కలల ను సఫలం చేసుకోండి , మూక్ లో మీరు చదివే కోర్సు లకు ఫీజు , మీ పట్టుదలా కృషీ మాత్రమే !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Good info shared I shall try.
MOOC (Massive Open Online Course) గూర్చి మీరు రాసిన టపా విజ్ఞానదాయకంగా ఉపయోగకరంగా ఉంది!అభినందనలు!
కృతఙ్ఞతలు ! ( ఫీజు లు కట్టే స్థోమత లేని ) ప్రతి వారికీ మూక్ గురించి తెలియ చేయండి !