7. ఆస్త్మా ఇన్హేలర్ టెక్నిక్ ఏమిటి ?
సాధారణం గా ఆస్త్మా చికిత్స కూ , నివారణకూ వాడే ఇన్హేలర్ మందులు ( అంటే పీల్చే ఊపిరితో బాటు గా మందును కూడా పీల్చే పధ్ధతి ) ఆస్త్మా ఉపశమనానికి ఎంతగానో ఉపయోగ పడతాయి ! కానీ కొన్ని పరిశీలనల ప్రకారం , ఈ ఇన్హేలర్ లు తీసుకొనే వారిలో కనీసం తొంభై శాతం మందికి , ఆ మందులు వాడే పధ్ధతి మీద అవగాహన లేదని విశద పడ్డది !ఈ మందులను సరిగా వాడక పొతే అంటే ఎట్లా ఊపిరి తిత్తులలొకి పీల్చాలో తెలియక పొతే , ఆస్త్మా తగ్గదు కదా , డబ్బు ఖర్చు అవడం కూడా జరుగుతుంది ! అంతే కాక , అనవసరమైన ఆందోళనల లకు కూడా కారణం అవుతుంది , ఈ పరిస్థితి !
మరి సరి అయిన టెక్నిక్ ఏమిటి ?
1. మొదట గా ఇన్హేలర్ మూత తీయాలి ( అంటే క్యాప్ )
2. ఇన్హేలర్ ను నిటారు గా పట్టుకుని అంటే నిలువు గా పట్టుకుని , అందులో ఉన్న మందు సరిగా కలవ డానికి , ఆ ఇన్హేలర్ ను బాగా కదిలించాలి అంటే షేక్ చేయాలి
3. ఆ తరువాత శ్వాస ను నిదానం గా వదిలి వేయాలి ! దీనిని ఎక్స్పిరేషన్ అంటారు ! ఇట్లా చేయడంవల్ల , ఊపిరి తిత్తులలో ఉన్న గాలి బయటకు వదిలి వేయడం జరుగుతుంది !
4. ఆ తరువాత ఇన్హేలర్ ను నోట్లో పెట్టుకుని , మందు విడుదల అయే భాగం చుట్టూ పెదవులు ఉంచి , సీలు చేయాలి అంటే పెదవులతో నే మూసి వేయాలి ! దీనితో మందు పీల్చే సమయం లో బయటకు పోదు !
5. అదే సమయం లో మందును విడుదల చేయడానికి ఇన్హేలర్ పై భాగాన్ని చూపుడు వేలితో నొక్కాలి !
6. నొక్కగానే విడుదల అయిన మందును ను దీర్ఘం గా లోపలి కి పీల్చాలి ! అప్పుడు విడుదల అయిన మందంతా నోటి నుంచి ఊపిరి తిత్తుల లోకి చేరుతుంది !
7. ఇట్లా ఊపిరి పీల్చుకున్న వెంటనే , ఒక పది సెకన్ల పాటు ఊపిరి బిగ పట్టాలి ! అంటే ఆ సమయం లో ఊపిరి తీసుకోవడం కానీ , విడుదల చేయడం కానీ చేయకూడదు ! ఇట్లా ఊపిరి బిగ బట్టిన సమయం లోనే ఇన్హేలర్ ను నోటినుంచి తీసి వేయాలి. అప్పుడు నోటిని మళ్ళీ మూసుకోవాలి లేక పొతే , మందు కొంత బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా !
8. ఆతరువాత ఊపిరి దీర్ఘం గానూ నిదానం గానూ వదిలి వేయాలి.
9. ఒక వేళ రెండు మార్లు కనుక ఇట్లా మందు రెండు డోసులు గా తీసుకోమని కనక డాక్టర్ సలహా ఇస్తే , ఒక నిమిషం సమయం ఆగి మళ్ళీ పైన చెప్పిన 1 నుంచి 8 స్టెప్పు లు ఆచరించాలి !
10. చివర గా ఇన్హేలర్ మూటను రిప్లేస్ చేయాలి అంటే మూత పెట్టాలి !
పైన ఉన్న వీడియో కూడా చూడండి , ఉపయోగ కరం గా ఉంటుంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
మంచి సమాచారం ఇస్తున్నారు బాగుంది .. ఇన్హేలర్ నుంచి మందు ప్రెస్ చేసిన తరువాత మందు పిల్చుకోవడానికి వీలుగా ఇన్హేలర్ నోటి నుంచి తిసివేసినట్టుగా విడియోలో ఉంది . మీరు రాసిన పాయింట్స్ లో అది అంత స్పష్టంగా లేదేమో
అది నా పొర పాటే. గమనించి, తెలియచేసినందుకు కృతఙ్ఞతలు.