8.సైనస్ హెడేక్ లు ఎట్లా ఉంటాయి ?
సైనస్ హెడేక్ లు అంటే ? : . మానవ కపాలం లో కొన్ని భాగాలలో ఎముకలు పూర్తి గా మందం గా లేకుండా ఉంటాయి. ఉదాహరణకు , ఒక ఇటుక ను తీసుకుంటే , ఆ ఇటుక అంతా ఏమాత్రం సందు లేకుండా చేయబడి ఉంటుంది కదా ! అట్లాగే ! కానీ సైనస్ లు ఉన్న భాగాలలో , ఎముకలు పైకి మందం గా కనిపించినా కూడా , లోపల చిన్న చిన్న గాలి గదులు గా నిర్మాణం అయి ఉంటాయి ! ఉదాహరణ కు తేనె తుట్టె లో గాలి గదులు ( తేనె తీయబడిన తరువాత ) నిర్మాణం అయి ఉన్నట్టు !
మరి ఈ సైనస్ లు హెడేక్ కు కారణం ఎట్లా అవుతాయి ?
ఈ విషయం తెలుసుకునే ముందు , ఈ సైనస్ లు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం ! మానవ కపాలం అంటే స్కల్ లో ముఖ భాగం లో, ఇంకా ఖచ్చితం గా చెప్పాలంటే ఫాల భాగం ( అంటే కనుబొమల మీద ఉన్న భాగం ) లో ఉన్న ఎముకలో రెండు సైనస్ లు ఉంటాయి ( అంటే రెండు కనుబొమ్మల మీదా రెండు ) వీటిని ఫ్రాన్ ట ల్ సైనస్ లు అని అంటారు ! అట్లాగే ముక్కు లోపల ఉన్న ఎముకకు రెండు వైపులా రెండు సైనస్ లు ఉన్నాయి వీటిని ఎథ మాయిడల్ సైనస్ లు అంటారు ! పై దవడ లు రెండింటి లో ఉండే సైనస్ లను మాగ్జిలరీ సైనస్ లు అంటారు. ఈ మూడు జతల సైనస్ లు, ముక్కుకు అనుసంధానమై ఉంటాయి ! అంటే వీటికి ముక్కు లోపలి భాగం తో కనెక్షన్ లు ఉంటాయి ! అంటే ముక్కు లోపలి పలుచటి పోర ఈ సైనస్ ల లోపలి భాగాలలో కూడా కప్పబడి ఉంటుంది ! పై చిత్రం లో చూడండి !
సామాన్యం గా ముక్కులో ఉండే లేదా వచ్చే ఇన్ఫెక్షన్ లు , ప్రత్యేకించి బాక్టీరియా లు కలిగించే ఇన్ఫెక్షన్లు ముక్కులో ఉండే పలుచటి పొరను కూడా ఆక్రమిస్తాయి !అంటే ఈ పొర లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది ! సరి అయిన సమయం లో సరి అయిన చికిత్స జరుగక పొతే , ఈ ఇన్ఫెక్షన్ కాస్తా ముక్కులో ఉండే పొర ద్వారా ఈ సైనస్ లలోకి ప్రవేశిస్తుంది ! ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్ ను నిర్మూలించినా కూడా , సైనస్ లలో కూడా దాగి ఉన్న ఇన్ఫెక్షన్ నిర్మూలించ బడక , సైనస్ హెడేక్ లాగా పరిణమిస్తుంది ! ఖచ్చితం గా చెప్పాలంటే , సైనస్ హెడేక్ అంటే సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే తలనొప్పి ! అందుకే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ప్రత్యేకించి , తల వంచినప్పుడు ఎక్కువ గా వస్తుంది !
ఈ సైనస్ తలనొప్పి ఎట్లా ఉంటుంది ?
సైనస్ తలనొప్పి ముఖ్యం గా ముఖ భాగం లో వస్తుంది అంటే ఫేస్ లో ఎక్కువ గా వస్తుంది ! ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నొప్పి ఉండి , రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి తగ్గు ముఖం పడుతుంది ! తలను అటూ ఇటూ కదిల్చినా , వంచినా , లేదా ఏవైనా బరువులు ఎత్తినా కూడా ఈ సైనస్ నొప్పి ఉధృతం అవుతుంది ! అట్లాగే , ఒక వెచ్చటి ప్రదేశం నుంచి అతి శీతల ప్రదేశం లోకి ప్రవేశించినపుడు కూడా ఈ సైనస్ హెడేక్ ఎక్కువ అవుతుంది ! ఎప్పుడూ ముక్కు కారుతూ ఉండడం కూడా ఒక లక్షణం కావచ్చు సైనస్ తలనొప్పికి ! అంటే జలుబు లక్షణాలు తగ్గినా కూడా కొంత మంది కి చాలా నెలల వరకూ ముక్కు కారుతూ ఉంటుంది ! కొన్ని సమయాలలో పసుపు లేదా ఆకు పచ్చ రంగులో ముక్కు లో ద్రవం ఉంటుంది , ఇట్లా జరిగితే అత్యవసరం గా డాక్టర్ కు చూపించుకోవాలి ! స్పెషలిస్ట్ డాక్టర్ తో ! ఎందుకంటే , రంగులో ఉన్న ముక్కు లో ద్రవం ఇన్ఫెక్షన్ తీవ్రత తెలియ చేస్తుంది ! ఆ ఇన్ఫెక్షన్ ను కనుక నిర్మూలించక పొతే, సైనస్ లకు పాకి , సైనస్ ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది ! మైగ్రేన్ హెడేక్ నూ , టెన్షన్ హెడేక్ నూ కూడా సైనస్ హెడేక్ లక్షణాలతో పోల్చ వచ్చు ! కొన్ని సమయాలలో వీటిని ఖచ్చితం గా గుర్తు పట్టడం కష్టం !
మరి చికిత్స ఏమిటి ? :
ముక్కు కారడం తగ్గించడానికి నేసల్ స్ప్రే లు వాడడం , యాంటీ హిస్టమినిక్ టాబ్లెట్ లు కానీ , స్ప్రే లు కానీ తీసుకోవడం , హ్యుమిడి ఫయర్ అనే పరికరం తో కొద్ది గా తేమ ఉన్న గాలిని పీల్చడం ! చేస్తే సైనస్ హెడేక్ కు ఉపశమనం కలుగుతుంది ! అవసరమైతే , యాంటీ బయాటిక్స్ కూడా వాడాలి ! సగం తీసుకున్నాక మానేయకుండా , కోర్సు పూర్తి చేయాలి ! లేక పొతే , బాక్టీరియా క్రిములు పూర్తి గా నిర్మూలించ బడక , మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ కలిగే రిస్కు ఉంటుంది ! స్పెషలిస్టు సలహా తప్పని సరిగా పాటించాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
Good and informative